హెచ్‌ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..! | CRISPR Gene Editing Eliminates HIV From Infected Cells, Says Scientists - Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!

Published Fri, Mar 22 2024 12:36 PM | Last Updated on Fri, Mar 22 2024 1:15 PM

CRISPR Gene Editing Eliminates HIV From Infected Cells says Scientists - Sakshi

హెచ్‌ఐవీ నివారణలో కీలక పురోగతి

CRISPR జీన్ ఎడిటింగ్  ‍ప్రక్రియ కణాల నుండి HIV ని తొలగిస్తుంది:  శాస్త్రవేత్తలు

ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో  గుడ్‌ న్యూస్‌ అందింది.  ఇకపై  హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం  మందులు తప్ప నివారణ లేని హైఐవీ  వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు.

 
డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో  యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో  ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు  దీనిపై ప్రపంచవ్యాప్తంగా  అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్‌స్టర్‌డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్‌పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్‌ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు.

మాలిక్యులర్ కటింగ్‌ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ సోకిన కణాల డీఎన్‌ఏను తొలగింగచలిగారు. తొలుత  ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్‌హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్  తెలిపారు. 

క్రిస్‌పర్-ఆధారిత చికిత్సలో  చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు  లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్,

హెచ్‌ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్‌ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement