తగ్గిన హెచ్‌ఐవీ తీవ్రత | Reduced Severity in Patients With HIV | Sakshi
Sakshi News home page

తగ్గిన హెచ్‌ఐవీ తీవ్రత

Published Tue, Jul 19 2022 11:43 AM | Last Updated on Tue, Jul 19 2022 11:43 AM

Reduced Severity in Patients With HIV - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: హెచ్‌ఐవీ తీవ్రత జిల్లాలో చాలా వరకు తగ్గిందని జిల్లా ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి  రాణి సంయుక్త పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ప్రభావం ఏ ప్రాంతాలలో, ఏ సమూహాలలో, ఏ వయసు వారికి సోకుతున్నదో తెలుసుకోవడానికి  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో 3 రోజుల వర్క్‌ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డబ్లు్యహెచ్‌ఓ కన్సల్టెంట్‌ సుకుమార్, డీపీఎం  బాలాజీ, జిల్లా సూపర్‌ వైజర్‌ సాక్షి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement