ఎయిడ్స్ పై విజయం సాధించారు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధిని కలిగించే హెచ్ఐవీ వైరస్ నిర్మూలనలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ నుంచి హెచ్ఐవీ వైరస్ ను తొలగించవచ్చునని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త కామెల్ ఖాలిలి తెలిపారు. హెచ్ఐవీ-1 వైరస్ పై చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే యాంటీరిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్న పేషెంట్లు తమ ట్రీట్ మెంట్ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని సూచిస్తున్నారు.
జెనీ ఎడిటింగ్ సిస్టమ్ అనే విధానం ద్వారా హెచ్ఐవీ వైరస్ ను అరికట్టవచ్చని వివరించారు. డీఎన్ఏ లోని సీడీ4 టీ కణాల నుంచి హెచ్ఐవీ వైరస్ క్రమక్రమంగా తొలగిపోతుందని తమ పరిశోధనలు కనుగొన్నట్లు పేర్కొన్నారు. జెనీ ఎడిటింగ్ విధానం ప్రారంభించిన తర్వాత ఎయిడ్స్ పేషెంట్లు ఈ ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ పొందుతారు. ఈ విధానం ఏదో నామమాత్రం కాదని పూర్తిగా ప్రభావాన్ని చూపుతుందని పేషెంట్లు మళ్లీ ఈ వ్యాధి భారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్త కమెల్ ఖలిలి తెలిపారు.