మూడేళ్లలో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌? | HIV vaccine in three years? | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌?

Published Wed, Feb 8 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

మూడేళ్లలో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌?

మూడేళ్లలో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌?

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ శాస్త్రవేత్త పాల్‌ స్టౌఫెల్స్‌ వెల్లడి
జీవశాస్త్ర రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు
సమన్వయంతో పనిచేయడం కీలకమని వ్యాఖ్య
బయో ఆసియా సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్త  


సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ హెచ్‌ఐవీ సోకితే రోజులు లెక్కబెట్టుకో వాల్సిందే అన్నది కొన్నేళ్ల కిందటి మాట.. క్రమం తప్పకుండా మందులు వాడితే జీవితాన్ని దశా బ్దాల పాటు పొడిగించుకోవచ్చన్నది నేటి పరి స్థితి. మరి భవిష్యత్తు మాటేమిటి? హెచ్‌ఐవీయే కాదు కేన్సర్‌ వంటి అనేక ప్రాణాంతక వ్యాధు లకూ మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తా యని డాక్టర్‌ పాల్‌ స్టౌఫెల్స్‌ చెబుతున్నారు. హెచ్‌ఐవీకి మూడేళ్లలో వ్యాక్సిన్‌ సిద్ధం కానుందని అంటున్నారు. బహుళజాతి కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రధాన శాస్త్రవేత్త అయిన ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించగా... ఫార్మా రంగం లో వినూత్న పోకడలు, పరిశోధన అంశాలను వెల్లడించారు. జీవశాస్త్ర రంగంలో అపార నైపుణ్య మున్న భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా మారగలదని పేర్కొన్నారు.

హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా సాధ్యం?
సుమారు 30 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో హెచ్‌ఐవీ సోకిన వారు 3 నుంచి 6 నెలలకు మించి బతికేవారు కాదు. అప్పుడే ఈ వ్యాధికి వినూత్న రీతిలో పరిష్కారాన్ని కనుక్కోవాలని తీర్మానం చేసుకున్నాం. ఇప్పటివరకు దాదాపు ఆరువేల హెచ్‌ఐవీ వైరస్‌లను నిశితంగా పరిశీలించి దాని బలహీనతలను గుర్తించాం. యాంటీ రిట్రోవైరల్‌ మందుల ద్వారా ఆయుః ప్రమాణాలను గణ నీయంగా పెంచగలిగాం. ఈ విషయంలో భారత దేశంలోని జెనరిక్‌ మందుల రంగాన్ని కచ్చితంగా ప్రశంసించాలి. మేం టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇస్తే జెనరిక్‌ ఫార్మా కంపెనీలు వాటికి మందుల రూపమిచ్చి.. అతి చౌక ధరలతో ప్రపంచానికి అందించగలిగాయి. ఫలితంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలబెట్టగలిగాం. ఇదే స్ఫూర్తితో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ ఇప్పుడు హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు మొదలెట్టింది. 2020కి వ్యాక్సిన్‌ తయారీపై స్పష్టత వస్తుంది.

మందులుండగా వ్యాక్సిన్‌ ప్రత్యేకత ఏమిటి?
ఒకసారి హెచ్‌ఐవీ బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. ఒక్కమాత్ర కూడా తప్ప కుండా దాదాపు 30 – 40 ఏళ్లు మందులు వాడట మన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మాత్రలకు బదులుగా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి వస్తే వ్యాధి ఇతరులకు సోకకుండా నివా రించే అవకాశాలు ఎక్కువవుతాయి.

కేన్సర్‌కు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో ఏది మెరుగైంది?
శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా అది కేన్సర్‌ కణాలను నాశనం చేసే ఇమ్యునోథెరపీ మొదలుకొని ఎన్నో కొత్త విధానాలు సిద్ధమవుతున్నది వాస్తవమే. సాంక్ర మిక వ్యాధులపై విజయం సాధించిన విధంగానే కొన్ని మందులను కలపడం, వ్యక్తులకు తగి నట్టుగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా కేన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదు.

మొండి క్షయకు సరికొత్త మందు తయారీపై..!
ప్రస్తుతం క్షయ చికిత్సకు ఉపయోగిస్తున్న మందులకు నిరోధకత ఏర్పడింది. దాంతో ‘బెడాక్విలిన్‌’కు ప్రాధాన్యమేర్పడింది. దాదాపు 4 దశాబ్దాల తరువాత మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ క్షయ వ్యాధికి ఈ కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం.

జీవశాస్త్రంలో భారత్‌ అవకాశాలేంటి?
భారత్‌ జీవశాస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తుందన్నది నా బలమైన నమ్మకం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement