HIV/AIDS Bill in next Parliament session: Oscar Fernandes
బెంగళూరు, న్యూస్‌లైన్: హెచ్‌ఐవీ బాధితుల రక్షణకు త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. కర్ణాటకలో హెచ్‌ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నగరంలోని వికాససౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఫెర్నాండెజ్ ప్రసంగించారు.
పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆరోగ్య శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీనిపై సెక్స్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో హైదరాబాద్‌లో సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకున్నామని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దానిని కర్ణాటకలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
హెచ్‌ఐవీ బాధితుల రక్షణకు బిల్లు
Published Wed, Sep 18 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement