సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్‌ఫర్ ఇన్‌హిబిటర్స్ (ఐఎన్‌ఎస్‌టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్‌ఐవీ వైరస్ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు.
ఈ ఐఎన్‌ఎస్‌టీఐ, డోలుటెగ్రావిర్ వంటివి వైరస్‌ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గుర్తింపు, చికిత్సలో సవాళ్లు..
2021లో విడుదలైన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు. డోలుటెగ్రావిర్‌ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్‌ఎస్‌టీఐ ఆధారిత ఔషధాలు హెచ్‌ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్ మేకా సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment