Mona Lisa
-
ఇండియన్ వెర్షన్ మోనాలిసా: మీరే పేరు పెట్టండి
లియోనార్డో డా విన్సీ (Leonardo da Vinci) కుంచె నుంచి జాలువారిన 'మోనాలిసా' చిత్రానికి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్.. ఏఐ టెక్నాలజీని సాయంతో భారతీయ సంప్రదాయాన్ని ఆపాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ రిషి పాండే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి.. మోనాలిసా చిత్రాన్ని చెవి దుద్దులు, మెడలో నెక్లెస్, తలపై దుపట్టా వంటి వాటితో అలంకరించాడు. ఇండియన్ వెర్షన్ మోనాలిసా రూపొందించాను. దీనికి పేరు పెట్టండి అని సోషల్ మీడియాలో వెల్లడించాడు.ఈ ఫోటో చూసిన నెటిజన్లలో కొందరు స్పందిస్తూ.. షోనాలిసా, మోనా తాయ్, లిసా బెన్ వంటి పేర్లను సూచించారు. చిత్రంలో ఉన్న మోనాలిసా.. త్రీ ఇడియట్స్ సినిమాలోని కరీనా కపూర్ హైపర్‌లూప్ క్లోన్ వెర్షన్ లాగా ఉందని మరొకరు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ ఫోటో కంటే ఇదే చాలా అందంగా ఉందని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలను రూపొందించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ టెక్నాలజీ సాయంతో పారిశ్రామిక వేత్తల ఫోటోలను, రాజకీయ నాయకుల ఫోటోలను, క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఫోటోలను కూడా రూపొందించారు. ఇప్పుడు ఏకంగా మోనాలిసా.. ఇండియన్ వెర్షన్ మొనాలిసాగా కనిపించింది.I made the Indian version of Mona Lisa using AI.Give her a name🫶 pic.twitter.com/ozcG5EigvF— Rashi Pandey (@rashi__pandey_) November 26, 2024 -
హెచ్ఐవీ నియంత్రణకు కొత్త ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్ఫర్ ఇన్హిబిటర్స్ (ఐఎన్‌ఎస్‌టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్ఐవీ వైరస్ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు. ఈ ఐఎన్‌ఎస్‌టీఐ, డోలుటెగ్రావిర్ వంటివి వైరస్‌ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు, చికిత్సలో సవాళ్లు.. 2021లో విడుదలైన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు. డోలుటెగ్రావిర్ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్‌ఎస్‌టీఐ ఆధారిత ఔషధాలు హెచ్ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్ మేకా సత్యనారాయణ తెలిపారు. -
మోనాలిసా ముఖంలో విషాదం!
-
మోనాలిసా ముఖంలో విషాదం!
బెర్లిన్: అందమైన ముఖం... అబ్బురపరిచే నవ్వు.. ఎంత చూసిన తనివితీరని కళ్లు.. ఇవన్నీ కలగలిపిన అందాల చిత్రం మోనాలీసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రం గురించి తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అలాంటి మోనాలీసా చిత్రం వెనుక మరో అమ్మాయి బొమ్మ ఉందని ఇటీవలే ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్త చెప్పగా... మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ తమ పద్ధతుల్లో ఈ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. తాజాగా జర్మనీలోని ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా తమదైన విశ్లేషణను తెరమీదకు తెచ్చారు. మోనాలిసా ముఖంలో అందరికీ సంతోషమే కనిపిస్తున్నప్పటికీ అందులో ఆమె బాధపడడం కూడా ఉందంటున్నారు. ఇందుకోసం మోనాలిసా పెదవుల చివరి భాగాలను కొద్ది కొద్దిగా పైకీ కిందకు వంచుతూ ఎనిమిది రకాల పెయింటింగ్స్ రూపొందించారు. వాటిని ఒరిజినల్ పెయింటింగ్స్‌తో కలిపి చూసినప్పుడు ఆశ్చర్యకరంగా మోనాలిసా బాధపడుతున్న సంకేతాలు కూడా కనిపించాయి. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలిసా నిజంగా మోనాలిసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
ఆ పెయింటింగ్ మరో సీక్రెట్ తెలిసింది!
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలీసా. అయితే శతాబ్ధాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయటపడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాత్వ శాస్త్రవేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా.. మోనాలీసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఆ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తుంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. మోనాలీసా పెయింటింగ్ లో ఉన్న మహిళ.. ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య లిసా గెరార్డినీ అని సైంటిస్టు పాస్కల్ కొట్టే గతంలో తెలిపారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. తాజాగా మరో విషయం బయటపడింది. డావిన్సీ తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చిన రూపం కూడా మోనాలీసాలో ఉందని, అతడు డావిన్సీకి గే లవర్ అని ఇటలీ పురాతత్వవేత్తలు చెబుతున్నారు. వ్యాపారి భార్య, గే లవర్ అయిన గియాన్ గియాకోమో లను కలిపి ఒకేరూపం ఇవ్వగా మోనాలీసా చిత్రరూపం ఏర్పడిందని ఇటలీకి చెందిన సిల్వానో విన్సెటీ వివరించారు. ఈయన పరిశోధనల్ని కూడా కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా, శతాబ్దాలు గడుస్తున్నాయి.. పరిశోధనలు జరుగుతూనే ఉన్నా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగానే మోనాలీసానా? కాదా? అన్న సందేహం మాత్రం నేటికీ తీరకపోవడం గమనార్హం. -
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
హైదరాబాద్ : తమపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ - జవహర్కాలనీలో నివాసముంటున్న మొనాలిసా అనే హిజ్రా బోనాల పండుగ రోజున మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తనపై నమిత అనే మరో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చిందని మొనాలిసా భావించింది. ఆ క్రమంలో నమితపై మోనాలిసా గురువారం రాత్రి రౌడీలతో దాడి చేయించింది. ఈ దాడిలో నమిత చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై గత మూడు రోజులుగా ముగ్గురు హిజ్రాలను రౌడీలు కిడ్నాప్ చేసి బాలానగర్‌లో ఓ గదిలో ఉంచి తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలో హిజ్రాలు బంజారాహిల్స్ పీఎస్‌కు చేరుకుని మొనాలిసాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టాంపుల్లో మోనాలిసా..!
న్యూయార్క్: స్టాంపుల ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణించే ఒక సెంటు విలువ(సుమారు 60 పైసలు) అయిన ఈ బ్రిటిష్ గయానా పోస్టల్ స్టాంపు.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అతి ఖరీదైన స్టాంప్‌గా రికార్డు సృష్టిం చింది. 1856 నాటి ఈ స్టాం పును మంగళవారం న్యూయార్క్‌లో సోత్‌బైస్ సంస్థ వేలం వేయగా.. రూ.59 కోట్ల ధర పలికింది. అలాగే సైజు పరంగా ప్రపంచంలోనే అతివిలువైన వస్తువుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. అన్నట్టూ.. దీని అసలు ముఖ విలువతో పోలిస్తే.. ఇది అమ్ముడుపోయిన ధర ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా..? జస్ట్ వంద కోట్ల రెట్లు మాత్రమే!