
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్‌కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్‌కు రిబ్బన్ కత్తిరించడం. సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్‌ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్.
కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియా తోపాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి ఇన్‌స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త.
ఇక ఇప్పుడు షోరూమ్‌ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్‌కు చెందిన జ్యువెలరీ షోరూమ్‌ను వాలెంటైన్స్ డే రోజున మోని భోంస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్‌ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది.
బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్‌కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము.
కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్ 1 యూట్యూబర్ రణ్‌వీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్‌ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టం కాదు.
(చదవండి: కోళ్ల అందాల పోటీలు..!)
Comments
Please login to add a commentAdd a comment