inaugration
-
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
-
ఫర్నిచర్, మొక్కలు బాగున్నయ్
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో వీవీఐపీలు, వీఐపీల బస కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, 14 విల్లాలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. మధ్యాహ్నం 1:09 గంటలకు గండి చెరువుకు చేరుకున్న సీఎం.. 1:11 గంటలకు రింగ్‌రోడ్డు మీదుగా ప్రెసి డెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రెసిడె న్షియల్ సూట్ ప్రధానద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి సూట్‌ను పరిశీలించారు. సుమారు 21 నిమిషాలపాటు సూట్‌ను తిలకించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తు, గదుల్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, లాన్, మొక్కలను పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. సూట్‌కు ముందు భాగంలో నిర్మించిన భారీ ఎంట్రన్స్ వివ రాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివ రించారు. సీఎం వెంట సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
'హెల్తీవే రెస్టారెంట్'ను ప్రారంభించిన శర్వానంద్, బాబీ
Sharvanand And Director Bobby Inaugurated A Restaurant: బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో హైదరాబాదీల కోసం సరికొత్త రుచులు రుచిచూపించేందుకు 'హెల్తీవే రెస్టారెంట్ బై ఆర్యన్' పేరుతో హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్‌ను హీరో శర్వానంద్, డైరెక్టర్ బాబీ, నటి హిమజా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ వ్యవస్థాపకులు స్వప్నిక, ఆర్యన్, బాలు, జితేందర్. రెస్టారెంట్లో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఆరోగ్యం, బరువు అవసరాలకు అనుగుణంగా వివిధ ఆహార ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ప్రతీ వారం ఎప్పటికప్పుడు కొత్త మెనూతోపాటు ఫుడ్ డెలీవర్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. సుమారు 20 ఏళ్ల అనుభవం గల చెఫ్ వండిన వంటకాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని వ్యవస్థాపకులు తెలిపారు. శ్రద్ధ, నిబద్ధత గల సిబ్బందితో మంచి అనుభూతి చెందుతారన్నారు. పోషకాహార నిపుణులు, వృత్తిపరమైన చెఫ్‌లు ఉంటారన్నారు. వారు ఒకరికొకరు కలిసి పని చేస్తారని, కస్టమర్ల జీవక్రియ మార్పులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శర్వానంద్ ఇటీవలే 'మహా సముద్రం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'ఒకే ఒక జీవితం' చిత్రాల్లో నటించనున్నారు. -
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ
-
భారత్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ ప్రతిష్టాత్మిక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఆరు లేన్లు ఉండగా.. వైమానిక విన్యాసాలకు, యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలుగా రోడ్లను నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల యూపీలోని లక్నో నుంచి బిహార్‌లోని బక్సర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నోలోని చాంద్ సరాయ్లో ప్రాంతంలో మొదలై ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే గా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిలిచింది. దీని పొడవు 341 కిలోమీటర్లు. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. చదవండి: Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక -
TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరుగుతాయని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ప్రారంభించనున్నారు. పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. చదవండి: తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు రెడీ -
కళాఖండాల సేకరణ అద్భుతం
సాక్షి, అమరావతి: బాపు మ్యూజియంలో ఉన్న కళాఖండాల సేకరణ అద్భుతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన సందర్భంగా గురువారం ఆయన ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం విక్టోరియా మహల్‌లోని మహాత్మాగాంధీ నిలువెత్తు చిత్రపటానికి నివాళులర్పించి, పింగళి వెంకయ్య గ్యాలరీలో జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. 1921లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి సమర్పించినట్లు ఉన్న విగ్రహాకృతులను తిలకించారు. బాపు మ్యూజియం పరిశీలించిన అనంతరం ప్రముఖుల సందర్శన పుస్తకంలో 'Impressive Collection of Artifacts' (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రాశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. అరుదైన ప్రదర్శన ► మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ ఘనతను సృజనాత్మకంగా భావి తరాలకు చాటి చెప్పేలా బాపు మ్యూజియం నిలుస్తుంది. మ్యూజియంలో ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయం. ► దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. ► ప్రతి కళాకృతినీ ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత మ్యూజియం గురించి సమగ్రంగా ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ప్రాక్, తొలి చారిత్రక, బుద్ధ–జైన, హిందూ శిల్ప కళ, నాణెములు, టెక్స్టైల్, మధ్య యుగపు కళా దృక్పథాలు, ఆయుధాలు, కవచాల గ్యాలరీలను తిలకించారు. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ స్క్రీన్ ► డిజిటల్ వాల్ ప్యానల్ స్క్రీన్‌ను సీఎం స్వయంగా టచ్ చేసి విషయాలు తెలుసుకున్నారు. స్క్రీన్ టచ్ చేయడం ద్వారా 1,500 పురాతన వస్తువులను పెద్దగా చూసే వెసులుబాటు కల్పించడం ఆకర్షణగా నిలిచింది. ► ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 బౌద్ధ స్థలాలను పుస్తక రూపంలో చూపే డిజిటల్ బుక్‌ను పరిశీలించారు. మ్యూజియాన్ని తీర్చిదిద్దిన తీరును పురావస్తు శాఖ కమిషనర్ వాణి మోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎమ్మెల్యేలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరుడికి గోదావరితో జలాభిషేకం
-
జీవకోణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన భూమన
-
దుగ్గెపల్లిలో కల్యాణమండపం ప్రారంభం
త్రిపురారం : మండలంలోని దుగ్గెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమండపాన్ని బుధవారం దాతలు పరిక అంతమ్మ తమ కుమారులతో కలిసి ప్రారంభించారు. దుగ్గెపల్లి గ్రామానికి చెందిన పరిక లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు నాగభూషణం (సర్కిల్ ఇన్స్పెక్టర్), అంజిబాబు(ఉపాధ్యాయుడు) సుమారు లక్ష రూపాయల వ్యయంతో స్థానిక పాత బస్‌స్టాండ్ సమీపంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మండపాన్ని నిర్మించారు. అదేవిధంగా వారే గ్రామంలో ఏర్పాటు చేయించిన వినాయకుడి వద్ద పరిక నాగభూషణం, అరుణజ్యోతి, పరిక అంజిబాబు, పద్మజ్యోతి దంపతులతో పాటు పరిక అంతమ్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులు మాట్లాడుతూ పరిక లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గెపల్లి గ్రామాభివద్ధి పాటుపడుతుండడాన్ని కొనియాడి కతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దుగ్గెపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామాభివద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పూజారీ అభిమళ్ల నర్సింహ, పరిక సైదులు పరిక వెంకటయ్య, సింగం శంకర్, దోమల వినోద్, మీసాల మల్లయ్య, దోమల నాగరాజు, కొండల్ తదితరులు పాల్గొన్నారు.