దుగ్గెపల్లిలో కల్యాణమండపం ప్రారంభం | to inaugration kalyanamadapam in duggepalli | Sakshi
Sakshi News home page

దుగ్గెపల్లిలో కల్యాణమండపం ప్రారంభం

Published Thu, Sep 8 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

దుగ్గెపల్లిలో కల్యాణమండపం ప్రారంభం

దుగ్గెపల్లిలో కల్యాణమండపం ప్రారంభం

త్రిపురారం : మండలంలోని దుగ్గెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమండపాన్ని బుధవారం దాతలు పరిక అంతమ్మ తమ కుమారులతో కలిసి ప్రారంభించారు. దుగ్గెపల్లి గ్రామానికి చెందిన పరిక లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు నాగభూషణం (సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌), అంజిబాబు(ఉపాధ్యాయుడు) సుమారు లక్ష రూపాయల వ్యయంతో స్థానిక పాత బస్‌స్టాండ్‌ సమీపంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మండపాన్ని నిర్మించారు. అదేవిధంగా వారే గ్రామంలో ఏర్పాటు చేయించిన వినాయకుడి వద్ద పరిక నాగభూషణం, అరుణజ్యోతి, పరిక అంజిబాబు, పద్మజ్యోతి దంపతులతో పాటు పరిక అంతమ్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులు మాట్లాడుతూ పరిక లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గెపల్లి గ్రామాభివద్ధి పాటుపడుతుండడాన్ని కొనియాడి కతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దుగ్గెపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామాభివద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పూజారీ అభిమళ్ల నర్సింహ, పరిక సైదులు పరిక వెంకటయ్య, సింగం శంకర్, దోమల వినోద్, మీసాల మల్లయ్య, దోమల నాగరాజు, కొండల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement