
లియోనార్డో డా విన్సీ (Leonardo da Vinci) కుంచె నుంచి జాలువారిన 'మోనాలిసా' చిత్రానికి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్.. ఏఐ టెక్నాలజీని సాయంతో భారతీయ సంప్రదాయాన్ని ఆపాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ రిషి పాండే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి.. మోనాలిసా చిత్రాన్ని చెవి దుద్దులు, మెడలో నెక్లెస్, తలపై దుపట్టా వంటి వాటితో అలంకరించాడు. ఇండియన్ వెర్షన్ మోనాలిసా రూపొందించాను. దీనికి పేరు పెట్టండి అని సోషల్ మీడియాలో వెల్లడించాడు.
ఈ ఫోటో చూసిన నెటిజన్లలో కొందరు స్పందిస్తూ.. షోనాలిసా, మోనా తాయ్, లిసా బెన్ వంటి పేర్లను సూచించారు. చిత్రంలో ఉన్న మోనాలిసా.. త్రీ ఇడియట్స్ సినిమాలోని కరీనా కపూర్ హైపర్‌లూప్ క్లోన్ వెర్షన్ లాగా ఉందని మరొకరు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ ఫోటో కంటే ఇదే చాలా అందంగా ఉందని మరొకరు అన్నారు.
ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలను రూపొందించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ టెక్నాలజీ సాయంతో పారిశ్రామిక వేత్తల ఫోటోలను, రాజకీయ నాయకుల ఫోటోలను, క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఫోటోలను కూడా రూపొందించారు. ఇప్పుడు ఏకంగా మోనాలిసా.. ఇండియన్ వెర్షన్ మొనాలిసాగా కనిపించింది.
I made the Indian version of Mona Lisa using AI.
Give her a name🫶 pic.twitter.com/ozcG5EigvF— Rashi Pandey (@rashi__pandey_) November 26, 2024