Myths
-
సోరియాసిస్ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..?
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ ( Psoriasis) దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్‌లో ప్రధానంగా తెల్లటి పొలుసులు , లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు వస్తాయి. మంట, విపరీతైన దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ప్రధానంగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. చేతులు లేదా కాళ్ళపై సోరియాసిస్ రోజువారీ కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. అలాగే గజ్జ లేదా పిరుదుల వంటి ప్రాంతాలలో సోరియాసిస్ వస్తే కూర్చోవడం లేదా టాయిలెట్‌కు వెళ్లడం కూడా బాధాకరంగా ఉంటుంది.సోరియాసిస్ భౌతిక అంశాలను పక్కన పెడితే దీనిపై అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం సోరియాసిస్ సోకినవారి దూరంపెట్టడం, అది అంటు వ్యాధి ఏమో అని భయపడటం లాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోరియాసిస్ చుట్టూ ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాంసోరియాసిస్ అంటువ్యాధి: కాదు ఇది అంటువ్యాధి కాదు. ప్రాణాంతకం అంతకన్నా కాదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. వ్యక్తి-నుండి-వ్యక్తికివ్యాపించదు. పరిచయం లేదా శారీరక స్రావాల ద్వారా వ్యాపించదు. ఉదాహరణకు, ముద్దు పెట్టుకున్నా, ఆహారం లేదా పానీయాలను పంచుకున్నా, ఈత కొలనులు లేదా ఆవిరి స్నానాలలో లాంటి సన్నిహిత బహిరంగ ప్రదేశాలలో ఇది ఇతరులకు సోకదు. సోరియాసిస్ కేవలం పొడి చర్మంవారికే వస్తుంది. కానే కాదు. చర్మ నిర్మాణం చాలా వేగంగా మారుతుంది - సాధారణ స్కిన్ టర్నోవర్ ప్రతి 28 రోజులు అయితే, సోరియాసిస్‌లో 4-5 రోజులలోపే ఉంటుంది. రక్తనాళాలు కూడా మారుతాయి అందుకే గోకిన ప్రాంతాలు ఎర్రగా మారతాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో, సోరియాసిస్ చర్మం పగుళ్లు ,రక్తస్రావం అవుతుంది.సోరియాసిస్‌లో చాలా రకాలుసోరియాసిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయని భావిస్తారు. కానీ గట్టెట్ సోరియాసిస్, ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్, పస్ట్యులర్ సోరియాసిస్, ప్లాంటార్ సొరియాసిస్, ఇన్వర్స్ సొరియాసిస్, ఫేస్ సొరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ లాంటి పలు రకాలు ఉన్నాయి. లక్షణాలు బట్టి ఏ రకం సోరియాస్ అనేది నిర్ధారిస్తారు.పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే. అయితే సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు స్వీయ-సంరక్షణ గురించి జాగ్రత్తపడాలి. నిరంతరం సంరక్షణ అవసరం.సోరియాసిస్‌ను నయం చేయవచ్చుఇది మరొక అపోహ. ప్రస్తుతానికి సోరియాసిస్‌కు నివారణ సాధ్యం కాదు కానీ నిర్వహణ, ఉపశమన చికిత్స ఉంది. వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రభావితమయ్యాడనే దానిపై ఆధారపడి, సోరియాసిస్ లక్షణాల నుండి ఉపశమన మార్గాలున్నాయి.సోరియాసిస్ చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? కానేకాదు ఒక్కోసారి చర్మం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో 6–42శాతం సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు దారి తీయవచ్చు.చికిత్స లేనప్పటికీ, చికిత్స ఎంపికలు లేవు అనేది మరో అపోహ. సోరియాసిస్ అనేది జీవితకాలం పాటు ఉండే దీర్ఘకాలిక పరిస్థితి. క్రీములు, లేపనాలు , జెల్స్, సమయోచిత (చర్మానికి వర్తించే), లైట్ థెరపీ లాంటి చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది వైద్యునిమార్గదర్శకత్వంలో తీసుకోవాలి. దీనిపై శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో నివారణ చికిత్స మార్గాలు వెలుగులోకి వస్తాయిని ఆశిద్దాం. ఏం చేయాలి?సోరియాసిస్ ఎగ్జిమా లాంటిదే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా యుక్తవసులో ప్రారంభమై జీవిత కాలం ఉంటుంది. పిల్లలు, శిశువుల్లో ఇది చాలా అరుదు. అలాగే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల సోరియాసిస్‌ను నయం చేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతారు.ఊబకాయం, ఆల్కహాల్, ధూమపానం వంటి కారకాలు సోరియాసిస్ లక్షణాల తీవ్రతను పెంచుతాయి. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం, బరువు నియంత్రణలో ఉండేలా చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం విధిగా పాటించాలి. -
హెచ్ఐవీ ఉన్నవాళ్లు పిల్లల్ని కనకూడదా?అలా కూడా వ్యాపిస్తుందా?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్ఐవి ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్ఐవి, ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో ప్రముఖ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. 1. అపోహ: హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్ఐవి ఇతరులకి సోకుతుంది? వాస్తవం: హెచ్ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ఐవి సోకదు. 2. అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది? వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్,హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు,ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం, రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది. 3. అపోహ: దోమకాటు ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది? వాస్తవం:దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవి ఎలా బతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. 4. అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు? వాస్తవం: సరైన మందులు,సకాల చెకప్స్‌తో, ఒకరు హెచ్ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని,హెచ్ఐవిని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి. 5. అపోహ: హెచ్ఐవీ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు? వాస్తవం: తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవి,ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం వల్ల హెచ్ఐవీ నెగటివ్ బిడ్డకు జన్మనివ్వొచ్చు. - నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
పురుషులకే స్ట్రోక్ రిస్క్ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకుంటే
World Brain Stroke Day 2022: మెదుడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం లేదంటే మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడులోని ఆ భాగంలో కణ మరణానికి దారి తీసి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి దారి తీయవచ్చు. సాధారణంగా ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అక్టోబరు 29న వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది.. ప్రాణాన్ని కాపాడుకోవడంలో ప్రతి నిమిషం విలువైనదే అనే థీమ్‌తో(‘Minutes can save lives’ #Precioustime) అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పక్షవాతానికి దారితీసే పరిస్థితులు, దీని గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాస్తవాలు, స్ట్రోక్‌కు గురైన పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ కథనం. బ్రెయిన్ స్ట్రోక్- రిస్క్ ఫ్యాక్టర్స్ ►ఒబేసిటి ►జన్యుపరమైన లోపాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ►అధిక రక్తపోటు ►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం ►మధుమేహం ►ఆహారపుటలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ►పొగ తాగే అలవాటు ►శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం ►మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం ►జీవనశైలి నివారణ ఎలా? ►జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో కొన్ని.. ►పొగతాగే అలవాటు మానుకోవడం ►ఆల్కహాల్ మానేయడం ►రోజూ కాసేపు వ్యాయామం చేయడం ►బరువు పెరగకుండా ఉండటం ►సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అపోహలు- వాస్తవాలు అపోహ: 1. కేవలం నడివయస్కులు, వృద్ధులకు మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవం: వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. ఒబేసిటీ, అధిక రక్తపోటుతో బాధ పడుతున్న 15- 65 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో ఎవరైనా దీని బారిన పడే అవకాశం ఉంది. అపోహ 2. బ్రెయిన్ స్ట్రోక్ చాలా అరుదుగా వస్తుంది. వాస్తవం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వాళ్ల సంఖ్య దాదాపు 17 మిలియన్లు. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్‌ది రెండో స్థానం. అపోహ 3: బ్రెయిన్ స్ట్రోక్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవం: మెదుడుకు ఆక్సీజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసణకు అంతరాయం ఏర్పడటం వల్ల.. రక్తం గడ్డకట్టుకుపోయి మెదడులోని కణాలు చచ్చుబడిపోతాయి. అపోహ 4: పురుషులకే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ వాస్తవం: పురుషులతో పోలిస్తే మహిళలే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యం కారణంగా తీసుకునే థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భం ధరించిన సమయంలో మధుమేహం బారిన పడటం వంటివి ఇందుకు దారి తీసే అంతర్లీన కారణాలుగా చెప్పవచ్చు. అపోహ 5: ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైతే జీవితాంతం జీవచ్ఛవంలా ఉండాల్సిందే! వాస్తవం: నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ నివేదిక ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారిలో 10 శాతం మంది పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. 25 శాతం మంది బాధితులు పాక్షిక ఉపశమనం పొందుతున్నారు. కొద్దిమంది మాత్రమే జీవితాంతం ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. అయితే, వారు కూడా సరైన థెరపీ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం మేలు పక్షవాతం బారిన పడిన వాళ్లు డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ►సాల్మన్ ఫిష్, అవిసె గింజలు(ఫ్లాక్స్ సీడ్స్), విటమిన్ ఈ కలిగి ఉండే విత్తనాలు, గింజలు, అవకాడోలు, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్ వాడకం, క్వినోవా(చిరు ధాన్యం), కాల్షియం, ప్రొటిన్ అత్యధికంగా కలిగి ఉండే గ్రీక్ యోగర్ట్, గ్రీన్ టీ. ఈ పండ్ల వల్ల ►వీటితో పాటు బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, విటమిన్ సీ కలిగి ఉండే పండ్లు, ఆపిల్స్, టొమాటోలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. నోట్: ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే ఈ కథనం. చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా.. Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల -
అగ్నిపథ్ నిరసనలు: చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదే!
బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలో చాలా చోట్ల రెండో రోజు అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. బీహార్‌లో అయితే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంతో పాటు రైళ్లను సైతం తగలబెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే అరుణా దేవీ తృటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. బీజేపీ మాత్రం అగ్నిపథ్ యువత మంచి కోసమే అని, చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదేనని చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ప్రోగ్రామ్‌పై నెలకొన్న అపోహలు, వాస్తవాలు పేరిట ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ మేరకు ఓ అనధికారిక ప్రకటనతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో మొదటిది.. అగ్నివీరుల భవిష్యత్తు పదిలంగా ఉండదు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. దానికి వాస్తవం పేరిట.. సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. అంతేకాదు, తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు. రెండోది.. అగ్నిపథ్ వల్ల యువతకు అవకాశాలు తగ్గుతాయి.. నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి. మూడోది.. అగ్నిపథ్ పథకం కారణంగా రెజిమెంటల్ బాండింగ్ పై ప్రభావం పడుతుంది. కానీ, అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదని, నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత ఎంపిక అవుతుందని కేంద్రం అంటోంది. నాలుగోది.. సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుంది. ఈ తరహా స్వల్పకాలిక నియామక విధానం చాలా దేశాలలో ఉంది. ఈ విధానాన్ని ఇప్పటికే చాలాచోట్ల విజయవంతంగా పరీక్షించాయి. యువత, శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. తద్వారా.. ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. ఐదవది.. 21 ఏళ్ల యువతలో పరిపక్వత ఉండదు. వారిపై సైన్యం ఆధారపడటం అవివేకమే. అయితే ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు తమ యువతపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏ సమయంలో చూసుకున్న ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. ప్రస్తుత పథకం చాలా నెమ్మదిగా సుదీర్ఘ కాలంలో యువకులు, ఎక్స్పీరియన్స్డ్ పర్యవేక్షక ర్యాంక్‌ల అధికారులు వందకు సగం సగం ఉండేలా చేస్తుంది. ఆరవది.. అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారతారు. ముఖ్యంగా వారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారు. ఇలాంటి ప్రచారం.. భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించడమే. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు. కానీ దేశానికి ద్రోహం చేయరు. అంతెందుకు, ఏటా వేలాది మంది సాయుధ బలగాల నుంచి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు. ఏడవది.. మాజీ సాయుధ దళాల అధికారులను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా పథకం ప్రకటించారు. దీంతో మాజీ అధికారులందరూ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు అని. కానీ, కేంద్రం ఈ పథకం గురించి ప్రస్తుతం సేవలందిస్తున్న సాయుధ దళాల అధికారులతో గత రెండేళ్లుగా సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఈ ప్రతిపాదనను రూపొందించారు. నిజానికి దాదాపు అందరూ మాజీ అధికారులందరూ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలను గుర్తించి దానిని సంతోషంగా స్వాగతించారు కూడా. -
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అనుమానాలొద్దు
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు)బిల్లులోని అంశాలతో పోలీసులు, దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముసాయిదా చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సోమవారం ప్రతిపక్ష నేతలకు సూచించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ప్రతిపాదిత చట్టంతో డేటా దుర్వినియోగం అవుతుందన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలపై స్పందించారు.‘ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మనమూ అదే అనుసరిస్తున్నాం. గడిచిన రెండున్నరేళ్లుగా వాహనాల చోరీలు సహా పలు కేసులను పరిష్కరించేందుకు డేటా బేస్‌ను వాడుతున్నాం’అని తెలిపారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?
సాక్షి, హైదరాబాద్: కేవలం అతిగా తినడం వల్లే ఊబకాయం రాదు. దీనికి అనేక కారణాలున్నాయి. అతి తక్కువ సమయంలో శరీర బరువు బాగా పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుంది. హెరడిటరీ, శారీరక, పర్యావరణ అంశాలతో పాటు మనం తీసుకునే ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తాయి. అధిక బరువుతో అంద విహీనంగా కనపడుతున్నామనే ఒత్తిడి ఒక్కటే కాదు, గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, స్లీప్ ఆప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ స్థూలకాయం, నివారణ మార్గాలపై కొన్ని అపోహలున్నాయి. నవంబరు 26 వరల్డ్ యాంటీ ఒబెసిటీ డే సందర్భంగా కొన్ని అపోహలు, వాస్తవాలు మీకోసం. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) ఊబకాయం అనేది కేవలం కాస్మొటిక్ వ్యాధి మాత్రమేనా? కానే కాదు. లావుగానే ఉన్నామనే తీవ్ర ఆందోళన ఎంత తప్పో, కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నామే తప్ప, దీనివలన పెద్దగా ఆరోగ్య సమస్యలు రావని అనుకోవడం కూడా భ్రమ. వాస్తవానికి, ఒబెసీటీకి కారణాలు అనేకం, అలాగే ఇది అనేక ఇతర వ్యాధులకు మూల కారణం. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కావచ్చు. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఊబకాయం అనేది మామూలే, జీవనశైలి రుగ్మత మాత్రమే అనుకుంటే పొరపాటే. సీనియర్ బేరియాట్రిక్ సర్జన్ల తాజా లెక్కల ప్రకారం, ఊబకాయం ఇప్పుడు మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీతో కూడిన వ్యాధి. ఈ వ్యాధిని నిపుణుల పర్యవేక్షణలో వైద్యపరంగా వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలి. అంత సులువు కాదు..కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బరువు తగ్గవచ్చు. ఇది ఒక విధంగా అపోహ. నేను ఎంత తొందరగా బరువుపెరుగుతానో, అంతే వేగంగా బరువు తగ్గుతాను అని చాలామంది అనుకుంటారు. కొద్దిపాటి సంకల్పం, వ్యాయామం మాత్రమే చాలు అని భావిస్తారు చాలామంది. వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది అందరికీ సాధ్యం కాదు. స్థూలకాయులకు ఆ అదనపు కిలోలను తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి ఉండాల్సిన బరువుకంటే 25 కిలోలు పెరిగితే దీన్ని తగ్గించుకోవడం ఒక సవాల్ అని బెంగళూరులోని లివ్లైఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం, వైద్య చికిత్స చాలా అవసరమని తెలిపారు. ఊబకాయం అనేది పట్టణాల్లోని ధనవంతులకే పరిమితమా? ఇది కూడా అపోహ మాత్రమే. భారతదేశంలోని మురికివాడల జనాభాలో 3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే పౌష్టికాహార లోపం కూడా ఊబకాయానికి పెద్ద కారణం. ఊబకాయం వల్ల ఐరన్, విటమిన్ డి-3 లోపం వంటి సమస్యలొస్తాయి. చిన్నపుడు లావుగా ఉండే పిల్లలు లావుగా ఉన్న పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోతారా అంటే కాదు అంటున్నారు నిపుణులు. దాదాపు 80శాతం మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఊబకాయులుగా పెరుగుతారని ఢిల్లీలోని మాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ చౌబే వెల్లడించారు. అంతేకాదు వీరిలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బాల్యంలో వచ్చే స్థూలకాయంపై అప్రమత్తంగా ఉండాలని, మొదటినుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని, నియమాలను అలవాటు చేయాలని సూచించారు. ఇన్ఫెర్టిలిటీ సంతానలేమి ఊబకాయానికి కారణమవుతుంది. నిజానికి ఊబకాయం లేదా, అధిక బరువే ఇన్ఫెర్టిలిటీకి కారణం. యువతలో ప్రాథమిక వ్యంధత్వానికి అత్యంత సాధారణ కారణాలలో ఊబకాయం ఒకటని వైద్యనిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ థైరాయిడ్ తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం వస్తుంది. కాబట్టి థైరాయిడ్ మందులు తీసుకుంటే చాలు అనుకుంటే ఇది కూడా ఒక మిత్. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న అందరూ ఊబకాయంతో బాధపడరు. అలాగే, ఏ వ్యక్తిలోనైనా స్థూలకాయానికి ఏకైక కారణం హైపోథైరాయిడిజమ్‌గా చెప్పలేం. హార్మోన్ల సమస్యలు ఇందుకు కారణం. వైద్యుల సలహాలేకుండా థైరాయిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు దారితీయవచ్చు. ఊబకాయం మనిషి శరీరాకృతిని ప్రభావితం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలో బరువు బాగా పెరగడంతో మధుమేహం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాదు తెలియకుండానే మూత్రపిండాల పనితీరును దెబ్బతిస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం, మద్యం, పొగతాగడం, ఒత్తిడి ఊబకాయానికి ముఖ్య కారణాలు. మారుతున్న జీవన శైలి, విచ్ఛలవిడిగా జంక్ ఫుడ్స్ వినియోగంతో బరువు పెరుగుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ఇంకా అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం, కనీస వ్యాయామం, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరమంటున్నారు. -
దీపావళి 2021: పండుగ సంబరాలు, కథలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే దీపాలు. సరదాలు..సంబరాలు. చిచ్చర పిడుగుల ముఖాల్లో సంతోషాల మతాబులు. పిండివంటల ఘుమ ఘుమలు. కొత్తబట్టలు, కొత్త అల్లుళ్లు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దాజరుపుకునే దీపకాంతుల పండగే దీపావళి. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా మా ప్రియమైన పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వంతో దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే పండుగల్లో మరో విశిష్టమైన పండుగ దీపావళి. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ధంతేరస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ణన్ పూజ, భాయ్ దూజ్ ఇలా ఐదు రోజుల పాటు దీపావళి వేడుక సాగుతుంది. లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ తర్వాతి రోజు దీపావళి. అయితే దీపావళికి సంబంధించి చాలా పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భమని ఒక కథ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా ఈ దీపావళి సంబరాన్ని చేసుకుంటారు. అంతేకాదు తమకు కలిగిన దాంట్లో తృణమో, ఫణమో ఇతరులకు దానం చేయడం కూడా మనకు అలవాటు. -
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాపంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియపై రకరకాల అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ విడుదల చేసింది. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని తెలిపింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు, చర్చలు జరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా కొనుగోళ్లు అంత సునాయాసమేమీ కాదని, అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల కంపెనీలు తమ ప్రాధాన్యత తాము నిర్ణయించుకున్నాయని చెప్పింది. రష్యాలోని స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కి క్లినికల్ ట్రయల్స్ అనుమతులు, దిగుమతులు వేగంగా జరిగాయని, అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలను భారత్‌లో తయారుచేసి, ఇక్కడి మార్కెట్‌కు అందించి, ఆ తర్వాత ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నామని వివరించింది. ఇతర దేశాల వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి ఇవ్వలేదన్న వార్తలు కూడా నిజం కాదని అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతిస్తూ ఏప్రిల్‌లోనే ప్రకటన జారీ చేశామని గుర్తుచేసింది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని, కోవాక్సిన్ నెలకు 1కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపింది. కోవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసుల నుంచి 11కోట్ల డోసులకు పెరగనుందని, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ సమన్వయంతో మరో 6 కంపెనీల్లో ఏకకాలంలో ఉత్పత్తి చేయనుందని పేర్కొంది. జైడస్ క్యాడిలా, బయోలాజికల్-ఈ, జెన్నోవా సంస్థల దేశీయ వ్యాక్సిన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వివరించింది. కంపల్సరీ లైసెన్సింగ్ అనేది సాధ్యపడే అంశం కాదు ఇందుకు అవసరమైన మానవ వనరుల తయారీ, శిక్షణ, బయోసేఫ్టీ ల్యాబొరేటరీలు వంటి అనేకాంశాలు ఇందులో మిళితమై ఉంటాయని, టెక్నాలజీ బదిలీ ద్వారా ఇప్పటికే భారత్ బయోటెక్ మరో 3 సంస్థలతో కలిసి కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. మోడెర్నా సంస్థ 2020లోనే తమ వ్యాక్సిన్లను ఇంకెవరు తయారు చేసినా కేసులు వేయబోమని చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఎవరూ చేయలేకపోయారు. లైసెన్సింగ్‌తో మాత్రమే ఇది సాధ్యపడదని పేర్కొంది. వ్యాక్సిన్ల తయారీ అంత సులభమైన అంశమైతే అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించింది. మరికొన్ని అంశాలు: ► వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుని రాష్ట్రాలకు వదిలేయలేదు. ►రాష్ట్రాల అభ్యర్థన మేరకే వ్యాక్సిన్ల సేకరణ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాం. ►ప్రపంచంలో ఏ దేశంలోనూ చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటి వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదు. ►వాట్సాప్ గ్రూపుల్లో కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేసే ప్యానిక్ సమాచారం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ అంశాన్ని నిర్ణయంచలేము. ►రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలనుకుంటారు. వ్యాక్సినేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, నిపుణులు అని కేంద్రం గుర్తు చేసింది. చదవండి: CoronaVirus: మన కాక్టెయిల్ ట్రయల్స్‌కి పర్మిషన్ -
కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు
సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. అపోహ: విటమిన్ ‘సి’లేదా జింక్ కరోనా నుంచి రక్షిస్తుంది.. వాస్తవం: సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటిని ఏ రూపంలో తీసుకున్నా వాటిలోని విటమిన్ ‘సి’ ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే జింక్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అపోహ: శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చు. వాస్తవం: వేడి నీటిని తాగడం, పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినడంద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుకొని తద్వారా కరోనాను ఎదుర్కోవచ్చనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కరోనా వ్యాధి రాకుండా శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అయితే ఈ అపోహపై కాస్త హాస్యాస్పదంగా స్పందించింది. ఇలా వేడినీటిని అధికంగా తాగడం వలన తమను తాము కాల్చుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అపోహ: వెల్లుల్లిని తరచూ తింటే కరోనా వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. వాస్తవం: వెల్లుల్లిలో శరీరానికి ఉష్ణాన్నిచ్చే కారకాలు ఉంటాయి. అలాగే కొన్ని యాంటిమైక్రోబియల్ గుణాలున్న కారకాలూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది. లవంగంలోనూ ఇలాంటి యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలుంటాయి. కానీ ఇవి కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొంటాయని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ డేటా లేదు. అపోహ: సెలైన్‌తో ముక్కును కడిగితే కరోనా వైరస్‌ను బయటకు తీయొచ్చు. వాస్తవం: మన నాసికా రంధ్రాలను సెలైన్‌తో కడగడం వల్ల కరోనా వైరస్‌ను బయకు పారదోలవచ్చనేది మరికొంత మంది నమ్మే అపోహ. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి సెలైన్‌ను అధికంగా ఉపయోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: శరీరంపై మందుల పిచికారీతో కరోనా దరిచేరదు! వాస్తవం: చేతులను తరచూ శానిటైజ్ చేసుకుంటే చాలు కరోనా దరి చేరదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, కేవలం చేతులనే కాదు.. శరీరం మొత్తం క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసుకున్నా కరోనా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అంతేకాదు, ఈ క్రిమిసంహారక స్ప్రే, శానిటైజర్లను అతిగా వాడితే కరోనా కంటే ముందు వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే, ఇలాంటి క్రిమిసంహారక మందులను అధికంగా వాడే బదులుæ శుభ్రత, సామాజిక దూరంలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అపోహ: మినరల్స్ ప్రయోగాలతో కరోనా మాయం! వాస్తవం: యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆహార నిపుణులుగా మారిపోతున్నారు. ‘ఫలానా వాటిలో ఫలానా.. వాటిని కలిపి తింటే మీ దగ్గరకు కరోనా దరిచేరదని’ కొంతమంది కల్లబొల్లి కబుర్లు చెబుతుంటారు. ఆహార పదార్థాలన్నింటిలోనూ విటమిన్స్, మినరల్స్ ఉండటం నిజమే. అయితే కొన్ని కొన్ని ఆహారపదార్థాల కలయిక ఔషధం కంటే విషాన్ని తయారు చేయగలదు. ఉదాహరణకు ఆపిల్ గింజల పొడి విషఫూరితమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. వివిధ మసాలా దినుసుల వాసన కూడా శ్యాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. తెలిసీ తెలియక చేసే ఇలాంటి మినరల్స్ ప్రయోగాలు ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి, యాట్యూబ్ చానల్స్ చెప్పే అన్నింటినీ నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: వేడి వాతావరణం వైరస్‌ను చంపేస్తుంది! వాస్తవం: మనిషి శరీరం నీరు, నిప్పులకు స్పందించినట్లే ఈ కరోనా వైరస్ కూడా స్పందించగలదని చాలా మంది భావన. దీంతో, చాలా మంది ‘ఈ వేసవిలో మనుషులే ఎండదెబ్బ తగిలి చనిపోతుంటే.. వైరస్ ఎంత?’ అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి వేడి, తేమతో సహా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రదేశాల్లోనూ కరోనా కేసులను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించింది. అంతేకాదు, ఈ స్థితిగతులకు కరోనా ఏ విధంగానూ స్పందించలేదని కూడా ప్రకటించింది. కాబట్టి, ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అపోహ: యాంటీ బయోటిక్స్‌తో కరోనా దూరం! వాస్తవం: సహజంగానే ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగానే జలుబు వంటి కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఎలాంటి మందులూ వాడకుండానే నయమవుతుంటాయి. ఇలాగే కొన్ని వ్యాధులను ఎదుర్కొనేందుకు మనలోని శక్తిని పెంపొందించేలా మార్కెట్లో వివిధ రకాల యాంటీబయోటిక్స్ లభ్యమవుతున్నాయి. అలాగని, ప్రతి వ్యాధికీ ఇవి పనిచేయవు. ఈ విషయం తెలియక చాలామంది కరోనాను ఎదురించేందుకు, వారిలోని శక్తిని కృత్తిమంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా యాంటీబయోటిక్స్ మందులను వాడటం ద్వారా కరోనాను అరికట్టలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేయాల్సిందేంటంటే.. కరోనా వైరస్ మహమ్మారి కథ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడం కంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి. శక్తి : సహజంగా రోగనిరోధక వ్యవస్థను బాగా పనిచేసేలా చూసుకోవడం. దీనికోసం చక్కని ఆహార, జీవన అలవాట్లను పాటించడం అవసరం. ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. అలాగే తగినంత నిద్ర పోవాలి, కాబట్టి ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా చూసుకోవాలి. శుభ్రత : రోజూ స్నానం చేయడం, తినే ముందు, తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు ఇతర వ్యక్తులను, వస్తువులను తాకినపుడు లేదా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులను, కాళ్లను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కేవలం మిమ్మల్నే కాదు, చుట్టూ ఉండే పరిసరాలను, వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. సామాజిక దూరం : కరోనా ఒక అంటువ్యాధి. అందుకే, వ్యక్తులతో తగినంత దూరం పాటించడం ముఖ్యం. అంతేకాదు, తినేటపుడు, తాగేటపుడు, మినహా అన్నివేళలా మాస్క్ ధరించాలి. అలాగే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఈ మూడు దశలను చక్కగా పాటిస్తూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బట్టలు, బూట్లు వైరస్‌ను తెస్తే.. ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా
కరోనా సెకండ్‌వేవ్ ఆరంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క టీకా కార్యక్రమం కొనసాగుతున్నా సమాజంలో కేసులు పెరగడంపై ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యేందుకు సమయం పడుతుంది, ఈలోపు వారు భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ఛాన్సులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక నష్టానికి భయపడి ప్రభుత్వాలు లాక్డౌన్ ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన. కరోనా రూపుమార్చుకొని కొత్త స్ట్రెయిన్ల రూపంలో పంజా విసురుతుంది కాబట్టి తొలిదశ కన్నా మరింతగా అప్రమత్తత అవసరమంటున్నారు. కొత్త స్ట్రెయిన్లు, సెకండ్‌వేవ్ ఆరంభం సందర్భంగా కరోనా, దానిపై వినిపించే రూమర్లు, నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.. తదితర అంశాలపై పునరావలోకనం ఈవారం ప్రత్యేకం.... సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. కరోనా విపత్కర కాలంలో ‘ఇందుగలదందు లేదని’ అన్నట్లు ఈ వైరస్ ఏ వస్తువుపై ఉందో... వాటి ద్వారా ఎప్పుడు? ఎలా? ఒంట్లోకి, ఇంట్లోకి చొరబడుతుందోనని జనంలో భయం... ఏదో ఒక పని మీద బయటకెళ్లి తిరిగి వచ్చినప్పుడు తమతోపాటే వైరస్‌ను మోసుకొచ్చామేమో అనే కలవరపాటు.. మాస్క్ వేసుకొని ఉన్నా, భౌతిక దూరం పాటించినా, చేతులను శానిటైజ్చేసినా, ఇంటికి రాగానే ముట్టుకున్న డోర్, తాళం వంటి వాటిని, మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను రసాయనాలతో క్రిమిరహితం చేసినా ఇంకా ఎక్కడో ఏదో అనుమానం.. ఇందులో ఒక కారణం దుస్తులు, బూట్లు. వీటి ద్వారా వైరస్ ఇంట్లోకి వచ్చిందేమో అనే సందేహం. ఈ ఆందోళనలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. వాహకాలే.. కానీ.. ప్లాస్టిక్, ఇనుము, రాగి వస్తువులు కొవిడ్ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. అలాగే దుస్తులు, బూట్లు సైతం ఈ వైరస్‌కు ఆశ్రయమిస్తాయి. కానీ వీటి ద్వారా వైరస్ వ్యాపించిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నారు వైద్య నిపుణులు. ‘ఈ వైరస్ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుస్తులు, బూట్ల ద్వారా ఇతరులకు వ్యాపించినట్లు ఆధారాలు లేవు’ అని అమెరికాలోని ఓర్లాండోలో ఉన్న అడ్వాంట్హెల్త్ కేంద్రం నిపుణులు చెప్పారు. వాస్తవానికి వస్తువు ఉపరితలాన్ని బట్టి వైరస్ కొన్ని గంటల నుంచి రోజుల వరకు వాటిపై మనగలుగుతుంది. ఇందులో ఇనుము, ప్లాస్టిక్‌పై అత్యధికంగా 2 నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అలాగే దుస్తులు, బూట్లపైనా కొన్ని గంటల పాటు జీవిస్తుంది. అంటే కఠిన ఉపరితలం ఉండే వస్తువులతో పోలిస్తే దుస్తులపై వైరస్ ఎక్కువ సేపు మనలేదు. కారణం.. వైరస్ ఎక్కువ రోజులు ఉండడంలో వాతావరణం, తేమ, ఆర్ధ్రతది కీలకపాత్ర. దుస్తుల స్వభావం దీనికి విరుద్ధం కాబట్టి ఎక్కువ సేపు బతకలేదు. తరచూ ఉతకడం.. దుస్తుల వల్ల వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, కచ్చితంగా రాదు అనీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కొవిడ్ రోగులకు సేవలు చేసే వాళ్లు.. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తమ దుస్తులను తరచూ డిటర్జంట్లతో ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం మేలంటున్నారు. అయితే, మార్కెట్‌కో, సరకుల దుకాణానికో వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. భౌతిక దూరం పాటించడం కష్టమైనప్పుడు, లేదా ఎవరైనా దుస్తుల మీద పడేలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రం ఇంటికి రాగానే వాటిని ఉతికి, ఇస్త్రీ చేయాలని సూచిస్తున్నారు. షూ సంగతి? సాధారణంగా దుస్తులతో పోలిస్తే బూట్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. అలాగే వీటిపైనా కరోనా వైరస్ చేరుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సర్వేలో తేలింది. దీనికోసం పరిశోధకులు చైనాలో కొవిడ్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన కొంత మంది వైద్యుల బూట్లను పరిశీలించినప్పుడు వాటి కింది భాగంలో వైరస్ ఉండడాన్ని గుర్తించారు. అయితే, సాధారణంగా బూట్లను ఇంట్లోకి తీసుకురావడం అరుదు. ఇంటిబయట తలుపు వద్దనే వదులుతారు. ఒకవేళ వాటిని ఇంట్లోకి తీసుకురావాల్సి వస్తే బయటే మొదట డిజర్జంట్ నీళ్లు లేదా రసాయనాలతో శుభ్రం చేయాలి. లేదా వాటిని ఇంటి బయట ప్రత్యేక స్థలంలో వదలాలి. దుస్తులు, షూ ద్వారా వైరస్ రావడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే, అన్నింటికంటే ముఖ్యం మార్కెట్‌కు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం. వీటిని మాత్రం కచ్చితంగా పాటించాలనేది వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పేమాట. -దుర్గరాజు శాయి ప్రమోద్ చదవండి: (కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు) -
బరువు తగ్గడం: ఇవన్నీ అపోహలే
ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ప్రాచూర్యం పొందిన చిట్కాలనో, డైట్ ప్లాన్లనో పాటించే ఉంటాము. యూట్యూబ్‌లో చూసిన దాన్నో.. ఇంటర్నెట్లో చదివిన దాన్నో.. స్నేహితుడు చెప్పినదాన్నో అచరించే ఉంటాము. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటం కోసం ప్రాచూర్యం పొందిన ప్రతీ చిట్కాను, డైట్ ప్లాన్‌ను ఫాలో అయిపోతుంటారు. నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారు, రాత్రి పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఇలా ఏదో ఒక దాన్ని ఆచరణలో పెట్టి ఫలితం రాక ఢీలా పడిపోతుంటారు. అయితే ఇప్పటికి చాలా మంది కొన్ని డైటింగ్ విధానాలపై అపోహలతో ఉన్నారు. ఆ డైటింగ్ విధానాల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ప్రాచూర్యం పొందిన డైట్ ప్లాన్లలో 90శాతానికిపైగా అపోహలే. డైట్ ప్లాన్ అపోహల్లో కొన్ని.. 1) గ్రీన్ టీ గ్రీన్ టీ ఒక జీరో క్యాలరీ డ్రింక్. ఇందులో ఫ్లేవనాయిడ్స్ తగిన మోతాదులో ఉంటాయి. అయితే గ్రీన్ టీ తాగటం వల్ల బరువు తగ్గుతారన్నది అపోహ మాత్రమే. 2) తేనె, నిమ్మరసం తేనె, నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని, పరగడపున తాగితే బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. ఈ పానీయాన్ని ఉదయం లేవగానే తాగటం వల్ల కొవ్వు కణాలను కరిగిస్తుందన్నది అబద్ధం. 3) చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుంది? చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుందన్నది కూడా శుద్ధ అబద్ధం. జిమ్ ట్రైనర్స్ చెప్పే కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉండవు. మీరు జిమ్‌లో బరువు తగ్గాలనుకుంటే కార్డియోను, వెయిట్ ట్రైనింగ్, కోర్ స్ట్రెన్తనింగ్తో బ్యాలన్స్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 4) కార్డియో కార్డియో ద్వారా బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. మీరు కార్డియో చేస్తున్నపుడు క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, కార్డియో తర్వాత మీరు ఖర్చుచేసే క్యాలరీల సంఖ్య జీరో. అందువల్ల మనం ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అన్న దానిపై శ్రద్ధ వహించాలి. కొత్తగా కొవ్వు ఒంట్లో చేరకుండా చూసుకోవాలి. -
కరోనాపై కొన్ని అపోహలూ... వాస్తవాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. 8,092మంది మరణించారు. ఇక మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ అధిగమించింది. ఈ వైరస్‌తో ఇప్పటివరకూ ఆసియాలో 3,384, యూరప్‌లో 3,422మంది మరణించారు. అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై సమాజంలో నెలకొని ఉన్నకొన్నిఅపోహలూ...వాస్తవాలివి... అపోహ ♦ కరోనా కేవలం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే సోకుతుంది. ♦ కరోనా వైరస్ చిన్నపిల్లలు, వృద్ధుల మీదే అత్యధికంగా ప్రభావం చూపుతుంది. ♦ అల్లం, ఉల్లి, వెల్లుల్లి, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లతో ఇది తగ్గిపోతుంది. వాస్తవం ♦ కరోనా వైరస్ అందరికీ సోకుతుంది. అన్ని వైరస్‌లకు లాగే వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారికి ఇది తన ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత కొద్దిసేపు ఉండి, ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది. అయితే వ్యాధి నిరోధక శక్తి లేనివారిలో అది శ్వాసకోశ వ్యవస్థ పైభాగానికే (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కే) పరిమితం కాకుండా ఊపిరితిత్తుల కణాలపై దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అదే అసలు సిసలు ముప్పు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాధినిరోధ శక్తి పెంపొందేలా మంచి సమతులహారం తీసుకోవడం, పెరుగు వంటి ప్రోబయాటిక్ తీసుకోవడం, మంచినీళ్లు తాగడం, వ్యాయామం చేయడం, కంటికి నిండుగా నిద్రపోవడం అవసరం∙ ఇది వయోభేదం లేకుండా అందరికీ సోకుతుందనే విషయం తెలిసిందే. అయితే మరీ చిన్నపిల్లలు, వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువ కాబట్టి వారు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. అయితే చిత్రంగా అది చిన్నపిల్లల కంటే వృద్ధులు... అందునా 80 పైబడి, డయాబెటిస్, గుండెజబ్బులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది∙ నిర్దిష్టంగా వాటి వల్ల ఇది తగ్గిపోతుందని ఎక్కడా స్పష్టమైన అధ్యయనాల దాఖలాలు లేవు. అయితే అల్లం, ఉల్లి, వెల్లుల్లి వంటివి జలుబు జాతి వైరస్ల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలప్పుడు కొంత ఉపశమనం కలిగిస్తాయన్న విషయం అనుభవంలో ఉన్నదే. డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
వికాస గ్రంథాలు
ఆత్మీయం మన పురాణాలు వ్యక్తిత్వ వికాస సంపద భాండాగారాలు. అధునాతనమైన జీవనసరళిలో వేగం పెరిగిపోతూ విలువలు, ప్రమాణాలు తరిగిపోతున్నాయి. సాంకేతికంగా ఎన్నో విజయాలను సాధించాడు. కాని ప్రశాంతంగా బతకడం మాత్రం దుర్భరం అయిపోతోంది. ఒత్తిడికి, సంఘర్షణకు గురికావలసి వస్తోంది. ఆరోగ్యానికి దూరం కావడం, సాధారణమైన సుఖసంతోషాలకు కూడా నోచుకోలేకపోవడం పరిపాటి అవుతోంది. ఈ నేపథ్యంలో మనిషికి మార్పు చాలా అవసరం. ఆ మార్పు బాహ్యమైనది కాదు – లోపలి మనిషికి. తరతరాలుగా తనలో జీర్ణమైన కొన్ని చాదస్తాలను, మూఢనమ్మకాలను విడిచిపెట్టి, తన ప్రవర్తనలోని లోపాలను చక్కదిద్దుకోవాలి. తద్వారా సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను మలచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, అభివృద్ధికరమైన ఆలోచనలకు స్థానం కల్పించడం, ప్రతికూల భావనలను పోగొట్టుకోవడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం దిశగా కృషి చేయాలి. చిత్రమేమిటంటే, ఇవన్నీ సాధించేందుకు కావలసిన వ్యక్తిత్వ వికాస శిక్షణ మన పురాణాలలోనే ఉంది. భగవద్గీత, రామాయణం, మహాభారతాలను మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఈ లోకంలో లేనేలేవు. విదేశీ వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో కూడా మన రామాయణ భారత భాగవతాలూ, భగవద్గీతలలోని అంశాలనే ఉదహరించడమే అందుకు నిదర్శనం. -
ధారణ
అష్టాదశ పురాణాల పేర్లను చక్కగా గుర్తు పెట్టుకునేందుకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలు, అన్ని పేర్లూ గుర్తొచ్చేస్తాయి. ‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’ త్రయం ‘వ’ చతుష్టయం! ‘అ’‘నా’‘ప’‘లిం’‘గ‘‘కూ’‘స్కా’ని పురాణాని పృథక్ పృథక్ మ ద్వయం– మకారంతో వచ్చే రెండు పురాణాలు. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం భద్వయం– భతో మొదలయే రెండు పురాణాలు– భాగవత, భవిష్యపురాణాలు. బ్రత్రయం– బ్రతో మూడు పురాణాలు... బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలు. వ చతుష్టయం– వ కారంతో వచ్చే నాలుగు పురాణాలు...వరాహ, విష్ణు, వామన, వాయు పురాణాలు అనాపలింగకూస్కాని అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో పురాణం. అ– అగ్నిపురాణం; నా– నారద పురాణం, ప– పద్మపురాణం, లిం– లింగపురాణం, గ– గరుడ పురాణం, కూ– కూర్మపురాణం, స్కా– స్కాంద పురాణం. -
పురాణాల గురించి కనీస అవగాహన ఉందా?
సెల్ఫ్ చెక్ భారతదేశం కర్మభూమి. రాముడు, కృష్ణుడు వంటి ఎందరో మహానుభావుల పాదపద్మాల జాడలను ఇముడ్చుకున్న పుణ్యపుడమి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటిన రామాయణ భారత భాగవతాల గురించిన కనీస అవగాహన అవసరం. వాటి గురించి మీకు ఎంత మాత్రం తెలుసో పరీక్షించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్. 1. రామాయణంలోని భాగాలు లేదా అధ్యాయాలను ‘కాండలు’అంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 2. రామాయణంలో మొత్తం ఆరు కాండలున్నాయని, అవి వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. మహాభారతాన్ని పంచమ వేదమంటారని తెలుసు. ఎ. అవును బి. కాదు 4. మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు... తెలుసు? ఎ. అవును బి. కాదు 5. మహాభారతంలో మొత్తం 18 పర్వాలుంటాయని తెలుసు. ఎ. అవును బి. కాదు 6. సంస్కృత మహాభారతాన్ని తెనిగించినవారు నన్నయ, తిక్కన, ఎర్రన అని, వారిని కవిత్రయం అంటారనీ తెలుసు. ఎ. అవును బి. కాదు 7. భాగవతాన్ని ముక్తికావ్యమంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. మహాభాగవతంలోని భాగాలను స్కందాలంటారని, మొత్తం పన్నెండు స్కందాలుంటాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. భాగవతాన్ని రచించినది పోతనామాత్యుడని (బమ్మెర పోతన) తెలుసు. ఎ. అవును బి. కాదు 10. మహాభాగవతంలో పోతన వదిలేసిన ఓ పద్యపాదాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ఆయన రూపంలో వచ్చి పూరించినట్లు మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు పై వాటిలో కనీసం ఏడింటికి ‘ఎ’లను గుర్తించినట్లయితే మీకు ప్రాచీన సంస్కృతిపై తగినంత అవగాహన ఉందని, పురాణాలు, కావ్యాల గురించి తెలియని వారికి కూడా మీరు ప్రాథమిక అవగాహన కల్పించగలరని చెప్పవచ్చు. కనీసం ఐదింటికి కూడా ‘ఎ’లు రాకపోతే మన ఇతిహాసాలపై ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదని, వాటి గురించి ఎవరు ఏం చెప్పినా ఔననీ, కాదనీ చెప్పలేని స్థితిలో ఉన్నారని, కాబట్టి కనీసం పరిజ్ఞానం పెంచుకోక తప్పదని చెప్పవచ్చు. -
మాట సాయమూ మహోపకారమే!
ఆత్మీయం పురాణాలు పద్ధెనిమిది. ఈ పురాణాలలోని సారాన్నంతటినీ పిండగా పిండగా, చివరకు తేలేది ఒక్కటే. పరోపకారం పుణ్యప్రదం. పరపీడనం పాపహేతువు. అంటే ఈ అన్ని పురాణాలలోని కథలూ, ఉపకథలూ చదివి, వాటి సారాన్ని చక్కగా వంటబట్టించుకుంటే మనకు లె లియవచ్చేది ఏంటంటే... ఇతరులను పీడించడం, బాధించడం, హింసించడం... ఇటువంటì వాటివల్ల పాపం కలుగుతుంది. అంటే అలా చేసిన వారికి కీడు జరుగుతుంది. అలా కాకుండా, తనకు ఉన్నంతలోనే ఇతరులకు ఉపకారం అంటే మేలు చేయడం పుణ్యాన్ని కలిగిస్తుంది. ఉపకారమనేది డబ్బు ద్వారానే కాదు, మాటసాయం లేదా కష్టాలలో ఉన్నవారికి వారికి హితవు కలిగేలా నాలుగు మంచి మాటలు చెప్పడం, అదీ చేతకాకపోతే అవతలి వారు చెప్పేదానిని ఓపిగ్గా వినడం కూడా పుణ్యప్రదమే. ఎందుకంటే, ఎదుటివారు మన బాధలను ఓపిగ్గా వింటున్నారనే భావన కూడా ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి. అందుకే కదా, ‘నీ సమస్యలు, బాధలు ఎదుటివారికి చెప్పుకుంటే సగమవుతాయి; నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది’ అని పెద్దలు అనేదీ, ఆంగ్ల సామెత పుట్టిందీనూ! -
దానం... ఫలం
దానాలకు వైశాఖమాసం ఎంతో ప్రాశస్త్యమైనదని పురాణోక్తి. సర్వతీర్థాలలోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే పుణ్యఫలం ఒక జలదానం చేస్తే వస్తుందట. వేసవి కాలంలో వచ్చే వైశాఖమాసంలో ఎండనబడి వెళ్లే బాటసారులకోసం, ఒక కుండలో నీళ్లు నింపి అడిగిన వారికి నీరందించటమే జలదానం. ఇలా ఈ మాసంలో జలదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందుతారని, వారి ఆప్తులు పుణ్యలోకాలను చేరుకుంటారనీ ప్రతీతి. అన్నదానం చేసిన వ్యక్తికి సర్వధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది. వారిని సకలదేవతలూ దీవిస్తారు. ఎండ వేడిమితో బాధపడే వారికి తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్లయితే, పూర్ణ ఆయుర్దాయం పొంది తుదకు మోక్షాన్ని పొందుతారని పురాణోక్తి. ఎండావానలకు పనికివచ్చే ఛత్రం అంటే గొడుగుని దానం చేసినవారికి ఆధిభౌతిక, ఆధి దైవిక దోషాలు, దుఃఖాలు నివారణ అవుతాయి. సుఖనిద్రకు అవసరమైన మంచం, పరుపు, దిండు దానంగా ఇవ్వటం వలన విష్ణుమూర్తి కృపకు పాత్రుడు కాగలడని, ప్రతి జన్మలోనూ ధర్మపరాయణుడిగా సుఖజీవనాన్ని కొనసాగించగలడని పురాణకథనం. మజ్జిగ దానం చేయటం వల్ల మరుసటి జన్మలో విద్యావంతులు, ధనవంతులు అవుతారని పురాణోక్తి.బియ్యాన్ని దానం చేసిన వారికి పూర్ణాయుర్దాయం లభిస్తుందట. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దానం చేస్తే అశ్వమేథ యాగం చేసిన పుణ్యం, విష్ణుసాయుజ్యం లభిస్తాయట. వేసవికాలంలో విరివిగా వచ్చే మామిడిపళ్లను దానంగా ఇచ్చిన వారి పితృదేవతలు ప్రీతిచెందుతారు. దాత, అతని పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం నిండిన కుండని దానంగా ఇవ్వడం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు. అలాగే దోసపండు, బెల్లం, చెరకుగడలు దానం చేసినవారి సమస్త పాపాలు తొలగిపోతాయి. చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది. పైన చెప్పినవే కాదు... అవకాశం ఉన్న ఏ వస్తువులను దానం చేసినా మంచిదే. -
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే మోహనం...
పుణ్యతీర్థం విష్ణుమూర్తి శేషశయనుడై భక్తుల మొరలను ఆలకిస్తూశ్రీరంగనాయకితో కొలువుతీరిన క్షేత్రం... శ్రీరంగం.విశాల ప్రాంగణం... ఎత్తయిన గోపురాలు...దేవతామూర్తుల సముదాయం...దేవాలయంలోనే పట్టణం... ఇవీ ఈ క్షేత్రం విశేషాలు.‘రంగ రంగ రంగపతి రంగనాథానీ సింగారాలే తరచాయె శ్రీరంగనాథా’... అని అన్నమయ్య సంకీర్తన చేసింది ఈ క్షేత్రం గురించే! శ్రీరంగనాథుడు, రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం– శ్రీరంగం. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న ఒక ద్వీపం. ‘శ్రీరంగం’ అనే ఊరిలో దేవాలయం లేదు. ‘శ్రీరంగ దేవాలయం’లోనే శ్రీరంగం అనే ఊరు ఉంది. దేవాలయం ఊరు కలగలిసినదే – శ్రీరంగం. దీనిని వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి శయనమూర్తిగా దర్శనమిస్తాడు. క్షీరసాగరంలో పవళించిన శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడడు. సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని ఈ క్షేత్రానికి సంబంధించిన గాథలు చెబుతున్నాయి. స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధి నిర్వర్తిస్తాడనీ, శ్రీరంగంలో శయనిస్తాడనీ తెలుస్తోంది. విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు ఉండి, స్వామి సేవలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు కి.మీ. పొడవైన ప్రాకారంతో ఈ దేవాలయం నిర్మితమై, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ 50 పైచిలుకు పరివార దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. స్వామివారి రాజగోపురం 236 అడుగుల ఎత్తు కలిగి (ఆసియాలోనే అతి పెద్ద రాజగోపురం), 13 అంతస్థులతో శోభాయమానంగా ఉంటుంది. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలు ఉండగా, తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్ఠించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూలస్థానంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రాంగణంలోనే వసతి సముదాయాలు, వాణిజ్య సముదాయాలు కలిగిన ఆలయం ఇది. కంబోడియాలోని అంకోర్వాట్ మందిరం వైశాల్యంలో దీని కంటే పెద్దదే అయినప్పటికీ, ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది. కానీ ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం మాత్రం శ్రీరంగమే. అమ్మవారితో.... కావేరీ నదీ తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ దేవాలయాలు ఉన్నాయి. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో ఆది రంగడు, శివసముద్రంలో మధ్య రంగడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరంలో అంత్య రంగడు. శ్రీరంగంలోని మండపాన్ని భోగమండపం అంటారు. రామ, కృష్ణావతారాలను విభవ అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు ఈ క్షీరాబ్ధి నాథుడే మూలమని ఆళ్వారులు విశ్వసిస్తారు. విభీషణుడికి రాముడిచ్చిన విగ్రహం వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సంతుష్టుడై తాను ఆరాధించేది శ్రీరంగనాథుడిననీ, కనుక నీవు కూడా ఆరాధించమనీ ఆ ఆరాధనను ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. అలా రంగనాథ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. సీతాపహరణం తరువాత విభీషణుడు రావణుడితో విభేదించి, రాముని శరణు కోరి ఆశ్రయం పొందాడు. విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రావణ వధ అనంతరం తమ ఆరాధ్య దైవం అయిన రంగనాథుడి విగ్రహాన్ని అతడికి ఇస్తూ ‘లంకకు తీసుకెళ్లు. కాని దారిలో ఎక్కడా ఈ విగ్రహాన్ని నేల మీద ఉంచకూడదు’ అని వివరించాడు. కానీ విభీషణుడు ఉభయ కావేరుల మధ్యనున్న ద్వీపంలో విశ్రమించేందుకు విగ్రహాన్ని దించి తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆశ్చర్యంగా ఆ విగ్రహం రాలేదు. ఈ సంగతి తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చి, ‘స్వామివారు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నందున ఇక్కడే దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడదాం’ అన్నాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కునకు తిరిగారని స్థల పురాణం చెబుతోంది. చంద్రగిరికి చేరిన ఉత్సవమూర్తి ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తిని పెరియ పెరుమాళ్ అనీ, ఉత్సవమూర్తిని నంబెరుమాళ్ అనీ అంటారు. ఒకానొక సమయంలో తురుష్కుల వలన ఉపద్రవం ఏర్పడినప్పుడు శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతానికి చేర్చారనీ, ఆ సమయంలో మరొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించార నీ చరిత్ర. బంగారు స్తంభాలు... గర్భాలయంలో శ్రీరంగనాథుని ఎదుట ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్ అంటారు. ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి గాయత్రి మండపం, గర్భాలయానికి ముందున్న ప్రదేశానికి చందన మండపం, ప్రదక్షిణకు తిరువణ్ణాళి ప్రదక్షిణం అని పేరు. ప్రాకారాలు... మొదటి ప్రాకారంలో ద్వారపాలకుడు, యాగశాల, విరజా బావి, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. రెండో ప్రాకార గోపుర ద్వారంలో పవిత్రోత్సవ మండపం, దొర మండపం ఉన్నాయి. ఇక్కడ ఉన్న విరజా మండపం క్రింది నుంచి విరజానది ప్రవహిస్తోందని పండితులు చెబుతారు. విణ్ణప్పం అంటే అభ్యర్థన జరిగే మండపంలో ధ్వజారోహణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్తంభాల మీద ఉన్న వినీత ఆంజనేయస్వామి వరాలివ్వగల శక్తిమంతుడని చెబుతారు. మూడవ ప్రాకారాన్ని అలినాడన్ తిరువీధి అంటారు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి, వెలుపల వాలి సుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంది. ప్రాకారానికి ఎడమ భాగంలో ధాన్యం కొలిచే మండపం, దీని ప్రక్కన నంజీయర్ సన్నిధి ఉన్నాయి. ఈ ప్రాకారంలో ఇంకా చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, వేదవ్యాస సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి, వైకుంఠనాథన్ సన్నిధి, సూర్య పుష్కరిణి... వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం పది దినాలు శ్రీరంగనాథులు కొలువుతీరే వేయి కాళ్ల మండపం ఉంది. దీనిని సహస్రస్థూణా మండపం అంటారు. ఈ మండపంలో స్వామి వేంచేసి ఉండే స్థలానికి తిరుమామణి మండపం అని పేరు. ఉత్సవాలు.. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనం సుప్రసిద్ధం. ఉగాది, విజయదశమి మొదలైన ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నిత్యం ఉత్సవ సంబరమే. లౌకికవాదానికి ప్రతీక... ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇక్కడ మూర్తిని ఢిల్లీకి తరలించాడనీ, సుల్తాన్ కుమార్తె స్వామి భక్తురాలిగా మారిందనీ, అనంతరం ఈ విగ్రహాన్ని రామానుచార్యులు శ్రీరంగానికి తీసుకువచ్చాడనీ, సుల్తాన్ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైందని చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఇప్పటికీ పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధరించి, కనిపిస్తారు. రోటీలను నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా ఉంది. షేక్ చినమౌలానా ఈ ఆలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. ఈయనది ప్రకాశం జిల్లా కరవది గ్రామం. ఈ దేవాలయంలో గరుడాళ్వార్ 25 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. 30 మీటర్ల పొడవాటి వస్త్రంతో స్వామిని అలంకరిస్తారు. అతి సుందరమైన శిల్పకళతో ఒక మండపం ఇక్కడి గరుడాళ్వార్‌కి ఉంది. ఈ ఆలయంలో మాత్రమే శ్రీరంగనాథస్వామిని భక్తిప్రపత్తులతో ఆరాధించిన మహమ్మదీయ రాణి తుళ్లకునాచ్చియార్ చిత్రం ఉంది. ఈ ఆలయంలో భగవద్ శ్రీరామానుజాచార్య స్వామి పార్థివ దేహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో కొన్నాళ్లు భద్రపరిచారు. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం ప్రాకృతిక ఉపద్రవాల అంచున ఉంది. గతంలో చాలాసార్లు డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని కాలపరీక్షకు నిలబడింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సాధ్యం కాని ఇంతటి బృహత్తరమైన ఆలయాన్ని ఆ రోజుల్లో మనవారు ఎలా నిర్మించగలిగారో అంతుచిక్కదు. ఆలయంలో ఉన్న వెయ్యి స్తంభాల మండపం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇన్ని స్తంభాలను ఎంత మంది శిల్పులు, ఎలా నిర్మించారో అంతు చిక్కదు. బరువైన రాళ్లను ఎత్తయిన ప్రదేశాలోకి ఏ విధంగా తీసుకువెళ్లారన్నది సమాధానం లేని ప్రశ్న. దర్శన వేళలు...: ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మధ్యాహ్నం 12 నుంచి 1.5 మధ్య తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 మధ్య పూజ జరుగుతుంది. ఈ సమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6 నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే 50 రూపాయలు టికెట్ కొనుగోలు చేయాలి. శీఘ్ర దర్శనం కావాలనుకుంటే 250 రూపాయల టికెట్ కొనాలి. సౌకర్యాలు...: వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేట్ హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. సాధారణ హోటల్స్ నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇలా చేరుకోవచ్చు... తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇక్కడి నుంచి దూరం కేవలం 9 కి.మీ. పావుగంటలో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగానికి 15 నిమిషాలలో చేరుకోవచ్చు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి 333 కిలోమీటర్లు. – డా. పురాణపండ వైజయంతి -
పుష్కరుడికి ఘన వీడ్కోలే...
అంత్యపుష్కరాలు సందర్భం ‘నర్మదా తీరం తపస్సుకు... గంగాతీరం మరణానికి.. కురుక్షేత్రం దానానికి శ్రేష్ఠమైనది.. అయితే ఈ మూడింటికన్నా గౌతమీ తీరం పరమపవిత్రం’ అని గౌతమీ మాహాత్మ్యం చెబుతోంది. అంతటి మహత్యమున్న గౌతమీ గోదావరి తీరం అంత్యపుష్కరాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఏ నదికి.. చివరకు హిందువులు అత్యంత పవ్రితంగా భావించే గంగానదికి కూడా లేనివిధంగా గోదావరికి అంత్యపుష్కరాలు ఉన్నాయి. జులై 31, ఆదివారం నాడు ఆరంభమైన ఈ అంత్యపుష్కరాలు పన్నెండు రోజులపాటు అంటే ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మహాక్రతువులో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పితృదేవతలకు పిండప్రదానం చేసే మహత్కార్యంలో నిమగ్నమవనున్నారు. పుష్కరాలు.. అంత్య పుష్కరాల సమయంలోనే కాదు.. ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరుడి ప్రవేశం దేశంలో గోదావరితోనే మొదలవుతోంది. ఇక్కడ ఏడాది పాటు ఉండి మిగిలిన నదుల్లోకి ప్రవేశిస్తాడు. ‘స్కందపురాణం, గౌతమీ మహత్యం’లో పేర్కొన్నట్టు... బ్రహ్మదేవుడు పుష్కరుడిని గురుడు సింహారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులు, చివరి 12 రోజులు మాత్రమే కాకుండా ఏడాదంతా మధ్యాహ్నం రెండుగంటలపాటు నివసించమని కోరాడు. ఈ కారణంగానే గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో నదీస్నానం, పితృదేవతలకు పిండప్రదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని భక్తుల విశ్వాసం. పుష్కరాలు, అంత్యపుష్కరాల సమయంలో గోదావరి నదీస్నానం చేస్తే మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంత్యపుష్కరం మూఢంలో మొదలవుతున్నా ఆ ప్రభావం ఉండదంటున్నారు అన్నవరం దేవస్థానం ప్రధానసలహాదారుడు, రాజగురువు ఎం.ఆర్.వి.శర్మ. ‘తీర్థాలను తొలిసారిగా సందర్శించేటప్పుడు మూఢమి మంచిది కాదని ధర్మశాస్త్రం చెబుతోంది. కాని గోదావరికి ఆ దోషం లేదు. తొలిసారి మూఢమిలో సైతం సందర్శించుకోవచ్చు. ఎందుకంటే పుష్కరుడు గోదావరిలో ఏడాది పొడవునా ఉంటారు’ అని ఆయన అన్నారు. పుణ్యఫలాన్నిచ్చే పితృతర్పణాలు పుష్కరాల సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఎంత పుణ్యఫలమో... అంత్య పుష్కరాల సమయంలో ఇచ్చినా అంతే పుణ్యఫలం దక్కుతుందని వేదపండితులు చెబుతున్నారు. పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. ఎక్కువ మంది ఉత్తరాంధ్రావాళ్లే! గోదావరి పుష్కరాలకే కాదు.. అంత్యపుష్కరాలకు సైతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వీరితోపాటు ఈసారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ఎంపిక చేసిన ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిండప్రదానాలకు అనుమతి ఇచ్చారు. వైదిక విధులకు సంబంధించిన సామగ్రిని ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచారు. నదిలో భక్తులు గల్లంతవకుండా పడవలతో రక్షణచర్యలు చేపట్టనున్నారు. వీటిపై గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాజమహేంద్రవరం, కొవ్వూరులో భక్తుల విశ్రాంతికి సత్రాలు, కమ్యూనిటీ భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్ బస్సులతోపాటు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్టీసీ సుమారు 150 బస్సులను నడుపుతోంది. - నిమ్మకాయల సతీశ్ కుమార్, సాక్షి అమలాపురం తెలంగాణ లో అంత్యపుష్కరాల ఏర్పాట్లు గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం బాసర, సోన్ (నిర్మల్), మంచిర్యాల, చెన్నూరు గోదావరి వంటి నాలుగు ప్రధాన ఘాట్లను ఎంపిక చేసింది. నిన్నటి నుంచి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జిల్లాలో నాలుగు ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. బాసర వద్ద నాలుగు స్నాన ఘాట్టాలు, సోన్‌లో రెండు, మంచిర్యాల, చెన్నూరులో ఒక్కొక్కటి చొప్పున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. బాసరలో ఏకకాలంలో 20వేల మంది భక్తులు స్నానమాచరించే వీలుంది. సోన్‌లో 6వేల మంది, మంచిర్యాలలో 10 వేలు, చెన్నూరులో 5వేల మంది పుష్కర స్నానం చేసే వీలుంది. గోదారిలో దిగి సాన్నాలు చేసేలా అన్ని ఘాట్ల వద్ద మెష్యూలు ఏర్పాటు చేయనున్నారు. బాసరలో 30 మందిని, మిగిలిన మూడు ఘాట్ల వద్ద పన్నెండు మంది చొప్పున గజ ఈతగాళ్లను నియమించారు. ఘాట్ల వద్ద దుస్తులు మార్చేందుకు గదులు.. ఆశ్రయం పొందే విధంగా తడకలతో నిర్మించిన గదులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను తరలించే విధంగా.. ఆర్టీసీ ముందస్తుగా 11 ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో... గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం, బూర్గంపాడు మణుగూరు మండలాలల్లో ఎనిమిది పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పర్ణశాల, ఇరవెండి పుష్కర ఘాట్లలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర పుణ్య స్నానాలు చేశారు. భద్రాచలం, పర్ణశాలలో ఎక్కువ సంఖ్యలో అంత్య పుష్కరాల సమయంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్ల విస్తీర్ణం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. తాగునీరు, వసతి, ఇతర సౌకర్యాలపై ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. భద్రాచలం పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో పాటు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీనిపై జిల్లా స్థాయి అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష జరగలేదు. భద్రాచలం సబ్ కలెక్టర్ మాత్రమే ఈ నెల 26న భద్రాచలంకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా... అంత్యపుష్కరాలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. పురాణ ప్రసిద్ధి, చారిత్రిక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు, పితృదేవతలకు తర్పణాలు వదలనున్నారు. అంత్యపుష్కరాలకు చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం, కొవ్వూరులతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరఘాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పుష్కరాలకు 284 ఘాట్ల నిర్మాణం జరిగింది. అంత్యపుష్కరాలకు తక్కువ మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న 33 ఘాట్లను ఏ-1గా ప్రభుత్వం గుర్తించింది. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 16 ఘాట్లు.. పశ్చిమగోదావరి జిల్లాలో 17 ఘాట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోటిలింగాలు, పుష్కరఘాట్లతోపాటు మరో ఐదు ఘాట్లు, కోటిపల్లి, అప్పనపల్లి, ముక్తేశ్వరం తొగరపాయతోపాటు పశ్చిమాన కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నర్సాపురం వలంధరరేవు ఘాట్లతో సహా రెండు జిల్లాల్లో కలిపి రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముంది. అంత్యపుష్కరాలకూ అంతే ప్రభావం! ఆది పుష్కరాలకు ఎంత ప్రభావం ఉంటుందో, అంత్యపుష్కరాలు కూడా అంతే ప్రాశస్త్యం, ప్రభావం కలిగి ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రజల్లోనే అంత్య పుష్కరాల గురించిన అవగాహన లేకపోవడం విచారకరం. ఈ విషయంలో పండితులు, మీడియా ప్రచారం చేయడం అవసరం. అంత్యపుష్కరాలలో కూడా స్నానం జపం త ర్పణం పిండప్రదానం వంటి కర్మలను ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోక్తి. ఆది పుష్కరాలలో స్నానం చేశాం కదా, మళ్లీ అంత్య పుష్కరాలలో చేయవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే అవకాశం ఉంటే ఎన్నిరోజులయినా, ఎన్ని సార్లయినా చేయవచ్చు. ప్రజలందరూ ఈ అంత్యపుష్కరాలను సద్వినియోగం చేసుకుని భగవదనుగ్రహాన్ని పొందవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ ప్రచారకులు ఆది పుష్కరవిధులు నిర్వర్తించని వారికి ఊరట! బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరశోభ వస్తుంది. అది మొదటి 12 రోజులూ, ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో రెండు గడియలు, సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించడానికి ముందు మరొక పన్నెండు రోజులు గోదావరి జలాలలో పుష్కరుడితో పాటు బృహస్పతి, బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు అందరూ ఉంటారు. ఆది పుష్కరాలలో గోదావరిలో పుష్కరస్నానం కానీ, దాన జపతపాదులు కానీ, పితృకర్మలు కానీ చేయడం వీలు కానివారు అంత్యపుష్కరాలుగా చెప్పబడే చివరి 12 రోజులూ చేసుకోవచ్చును. పుష్కరాలలో చేసే ఈ కర్మలకు ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది. ఎప్పుడు చేసినా ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. ఎందుకో కానీ ఈ సౌలభ్యాన్ని గురించి ఎవరూ అంతగా పట్టించుకున్నట్లు కనపడదు. రాబోయే కృష్ణాపుష్కరాల మీద చూపే శ్రద్ధ, దానికి ముందుగా వస్తున్న గోదావరి అంత్యపుష్కరాల మీద కూడా చూపిస్తే, ఆది పుష్కరాలలో పుష్కరవిధులు నిర్వర్తించడం కుదరని వారికి ఎంతో ఊరట కలుగుతుంది. కృష్ణానది ఆదిపుష్కరాల రద్దీ తగ్గుతుంది. - డా.ఎన్.అనంతలక్ష్మి పౌరాణిక ప్రవచకులు పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. -
అతిపురాతనం అధరాలంకరణం!
పురాణాలు, ప్రబంధాలలో బింబాధర వర్ణనలను విరివిగానే చదువుకుని ఉంటాం. వాటిని చదివినప్పుడల్లా లిప్స్టిక్లేవీ లేని కాలంలో అప్పటి కవులు పెదవులను అంత సవర్ణభరితంగా ఎలా వర్ణించారబ్బా అని ఆశ్చర్యపోయే ఉంటాం. ఇప్పటి మోడర్న్ మేకప్‌లో వాడే లిప్‌స్టిక్ అప్పట్లో ఉండేది కాదు. అయితే, అధరాలంకరణ అలవాటు అప్పట్లో లేదనుకుంటే పొరపాటే! ఐదువేల ఏళ్ల కిందటే సుమేరియన్లు పెదవులకు రంగు పూసుకునేవారు. పైగా ఆడా మగా తేడా లేకుండా అందరూ పూసుకొనేవాళ్లు. ప్రాచీన ఈజిప్షియన్లు తమ సామాజిక హోదాను చాటుకొనేందుకు పెదవులను శ్రద్ధగా అలంకరించుకునేవారు. మొక్కల నుంచి ఖనిజాల నుంచి ఎరుపు రంగును సేకరించి, శుభ్రపరచి పెదవులకు అలంకారంగా వాడేవారు. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ నిత్యం ఎర్రబారిన పెదవులతోనే ప్రజలకు దర్శనమిచ్చేది. తెల్లని ముఖంలో ఎర్రని పెదవులను జనం అబ్బురంగా చూసేవాళ్లు. కొన్నాళ్లకు ఈ ఫ్యాషన్‌ను అనుకరించడం మొదలుపెట్టారు. అప్పట్లో తేనెటీగల కొవ్వులో మొక్కల నుంచి సేకరించిన ఎరుపురంగును కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని దీర్ఘకాలం భద్రపరచుకుని ఉపయో గించేవారు. ఆధునిక లిప్స్టిక్కు ఒకరకంగా ఇదే పూర్వరూపం. ప్యారిస్‌లోని ఓ కాస్మొటిక్స్ సంస్థ 1884లో మొదటిసారిగా రకరకాల రసాయనాలను ఉపయోగించి ఆధునిక లిప్‌స్టిక్‌ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి పాశ్చాత్య ఫ్యాషన్ రంగంలో లిప్‌స్టిక్ కీలకంగా మారింది. క్రమంగా ఇది ఇతర దేశాలకూ వ్యాపించింది. -
చట్టం దూరంగా ఉంచింది... బంధం దగ్గర చేసింది!
కేస్ స్టడీ రజనీ, మాధవ్లది అన్యోన్య దాంపత్యం. వివాహమై ఎనిమిదేళ్లైనా ఏమాత్రం వారి మధ్య అపోహలు అపార్థాలు లేవు. ఉద్యోగంలో, ఇంటిపనిలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. ఒక పూట వంట రజని చేస్తే, మరో పూట మాధవ్ చేస్తాడు. ఇరువురు ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకుంటారు. కానీ కడివెడు పాలల్లో ఒక విషం బొట్టులా ఆర్నెల్ల క్రితం రజనీ మేనత్త పల్లెటూరి నుండి వచ్చింది. తనకు ఏ దిక్కూ లేదని, మేనకోడలింట్లో పెద్ద దిక్కుగా ఉంటానని తిష్ట వేసింది. ఇకనేం రజనీ మనస్సులో రోజూ విషం చిమ్మే కబుర్లు మొదలెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చు రగిల్చింది. చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్లింది. కేసు విచారణ ముగిసింది. జడ్జిగారికి విడాకులకు కారణాలు కన్పించలేదు. కేస్ కొట్టివేస్తే అప్పీల్‌కు వెళ్తారు. ఈ లోగా ఇరువురి మధ్య ద్వేషం పెరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమనంగా సెక్షన్ 13-ఎ ప్రకారం అంటే ఆల్టర్నేటివ్ రిలీఫ్‌గా వారికి ‘జుడీషియల్ సపరేషన్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భార్యాభర్తల మధ్య వివాహం రద్దు పరచదు. కేవలం ఒక కప్పు కింద సంసారం చేసే బాధ్యతను రద్దు పరచి, పరస్పరం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం రజనీ, మాధవ్‌లు వేరువేరుగా కొంతకాలం ఉన్నారు. తమ లోపాలను, ఆలోచనా విధానాలను సరిదిద్దుకున్నారు. అపోహలు తొలిగాక హాయిగా కలిసి కాపురం చేస్తున్నారు. రజనీ మేనత్తను సాగనంపారు. న్యాయమూర్తిగారు సెక్షన్ 13ఎ హిందూ వివాహచట్టం ప్రకారం ఆల్టర్నేటివ్గా జుడీషియల్ సపరేషన్ ఆర్డర్స్ ఇచ్చి వారికి కాపురం నిలబెట్టుకునే అవకాశం ఇచ్చారు. -
వినేవాళ్లు ఉండాలేగానీ...
సోల్ / చాడీలు వదంతులను వ్యాప్తిలోకి తేవడంలానే చాడీలు చెప్పడం కూడా కొందరికి ఒక కాలక్షేపం. స్వప్రయోజనాల సాధన కోసం కొందరు చాడీలు చెబుతారు. ఇద్దరి మధ్య తగవు పెట్టడానికి ఇంకొందరు చాడీలు చెబుతారు. ఎదుటివారి అభివృద్ధినిఅడ్డుకోవడానికి మరికొందరు చాడీలు చెబుతారు. చెప్పేవారు సరే, ఏమైనా చెబుతారు, ఎన్నయినా చెబుతారు. ‘కుఛ్తో లోగ్ కహేంగే... లోగోంకా కామ్ హై కెహనా...’ వినేవాళ్లు లేకుంటే ఎంతటి చాడీకోర్లయినా ఏం చెప్పగలరు చెప్పండి? వినేవాళ్లకు వివేకం, ఇంగితజ్ఞానం లోపించినప్పుడే చాడీలు చెప్పేవాళ్లు చెలరేగిపోతారు. లోకంలో చాడీకోర్లు వర్ధిల్లుతున్నారంటే అది వాళ్ల తప్పు కాదు, వినేవాళ్లకు కామన్సెన్స్ లేకపోవడమే అందుకు అసలు కారణం. అసూయే మూలం సాటివారి పురోగతిపై అసూయ మితిమీరినప్పుడు, జీవితంలో వారిని అధిగమించే శక్తిసామర్థ్యాలు లోపించినప్పుడు వారిని ఇతరుల ద్వారానైనా సాధించాలనే ఉద్దేశంతో చాలామంది చాడీలు చెబుతారు. ఏమీ చేతగాని అసూయాపరులే చాడీలు చెప్పడాన్ని ఒక లలితకళలా సాధన చేస్తారు. మొహమాటానికో, ముఖస్తుతికో అలవాటుపడిన కొందరు అలాంటి చాడీలను వీనులవిందుగా వింటారు. నిజానికి చాడీల వల్ల చెప్పేవాళ్లకు, వినేవాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అదొక తాత్కాలిక మానసికానందం మాత్రమే. మానవులకు గల నానా అవలక్షణాల్లో చాడీలు చెప్పడం కూడా ఒకటని ప్రపంచంలోని అన్ని మతాలూ పరిగణిస్తున్నాయి. ఇతరులపై చాడీలు చెప్పడం అత్యంత నీచమైన అవలక్షణమని, ఇలాంటి అవలక్షణాన్ని విడనాడాలని బోధిస్తున్నాయి. అయితే, ఇలాంటి హితబోధలను పట్టించుకునేవారు ఎందరు? మతాలు మతాలే, మానవ స్వభావాలు మానవ స్వభావాలే! పురాణాల్లో చాడీకోర్లు చాడీలు చెప్పడమేమీ ఆధునిక కళ కాదు. పురాణకాలం నుంచే ఈ కళలో ఆరితేరిన వారు కొందరున్నారు. మన పురాణాల్లోని చాడీకోర్లలో ముఖ్యంగా నారదుడిని, మంథరను, శకునిని గుర్తు చేసుకోవచ్చు. బ్రహ్మమానస పుత్రుడైన నారద మహాముని నారాయణ నామస్మరణ చేసుకుంటూ, మహతిని మీటుకుంటూ త్రిలోక సంచారం చేసేవాడని ప్రతీతి. ముల్లోకాలూ తిరిగే నారద మహామునికి కలహభోజనుడనే పేరు కూడా ఉంది. ఎవరికైనా కయ్యం పెట్టనిదే ఆయనగారికి కడుపు నిండదు. బ్రహ్మదేవుడి ద్వారానో, బోళాశంకరుడి ద్వారానో వరాలు పొంది, బలగర్వంతో విర్రవీగే రాక్షసరాజుల వద్దకు వెళ్లి దేవతల మీద చాడీలు చెప్పి రెచ్చగొట్టేవాడు. బుద్ధితక్కువ రాక్షసరాజులు ఆ మాటలకు అనవసరంగా రెచ్చిపోయేవారు. దేవతలతో కయ్యానికి కాలు దువ్వేవారు. చివరకు ఏ మహావిష్ణువో, ఆదిపరాశక్తో వచ్చి, వాళ్లను సంహరించాక అక్కడికా కథ సుఖాంతమయ్యేది. విష్ణుభక్తుడైన నారద మహాముని ఏం చేసినా లోకకల్యాణానికేనని, ఆయన చెప్పే చాడీలు కూడా అందుకేనని పురాణాల సారాంశం. మంథర చాడీలు ఇక త్రేతాయుగంలో మంథర పేరుమోసిన చాడీకోరు. ఆమె చాడీల దెబ్బకు ఏకంగా రామాయణమే మలుపు తిరిగింది. ‘దశరథ మహారాజు రాముడికి పట్టం కట్టాలనుకుంటున్నాడు. అదే జరిగితే నీ కొడుకు భరతుడి గతేం కాను..?’ అంటూ కైకకు నూరిపోసి, దశరథుడు ఏనాడో ఆమెకు ఇచ్చిన వరాలను గుర్తుచేసి రెచ్చగొట్టింది. కైక ఆ వరాల కోసం దశరథుడిని సాధించింది. ఫలితంగా రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. పుత్ర వియోగంతో దశరథుడు పరలోకానికి పయనించాడు. చాడీకోరు శకుని మహాభారతంలో శకుని ఆరితేరిన చాడీకోరు. కౌరవుల పంచన చేరిన శకుని దుష్టచతుష్టయంలో పెద్దతలకాయ. పాండవులపై చాడీలు చెబుతూ ఎదిగీ ఎదగని వయసు నుంచే మేనల్లుడైన దుర్యోధనుడి బుర్ర పాడు చేసేవాడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే అలవిమాలిన అహంకారి. అహంకారికి కన్నూ మిన్నూ కానదు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి విదుర, భీష్మాదులు చెప్పే హితవచనాల కంటే, శకుని మామ చెప్పే చాడీలే పసందుగా ఉండేవి. చాడీకోరు శకునిని ఆంతరంగిక బృందంలో పెట్టుకున్న దుర్యోధనుడు ఎలా దుంపనాశనమయ్యాడో మనందరికీ తెలిసిందే. ఇవీ అనర్థాలు చాడీలు చెప్పేవాళ్లందరూ నారద మహామునులు కాదు. అందువల్ల వాళ్లు చెప్పే చాడీల కారణంగా లోకకల్యాణం మాట దేవుడెరుగు గానీ, నానా అనర్థాలు జరగడం మాత్రం తథ్యం. చాడీల వలలో పడితే ప్రాణస్నేహితులు కూడా బద్ధశత్రువులుగా మారిపోతారు. భార్యాభర్తల్లో ఎవరు చాడీలు నమ్మినా ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఖాయం. చాడీల మాయలో చిక్కుకుంటే, తల్లిదండ్రులకు పిల్లలకు నడుమ కూడా కీచులాటలు వస్తాయి. చాడీకోర్ల మాటలను బాసులు నమ్మితే, ఆఫీసుల్లోని అమాయక జీవులు ఉద్యోగాలను పోగొట్టుకుని వీధిన పడతారు. చాడీలు చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వాళ్ల స్వభావాన్ని మార్చడం దుస్సాధ్యం. అయితే, వినేవాళ్లు కాస్త ఇంగితంతో వివేకాన్ని ప్రదర్శించి, ‘వినదగునెవ్వరు చెప్పిన...’ అనే సుమతీ శతకకారుని హితోక్తిని మననం చేసుకుని, సంయమనంతో వ్యవహరిస్తే చాడీల వల్ల తలెత్తే అనర్థాలను నివారించుకోవచ్చు. -
ఏ పురాణంలో ఏముంది..?
మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు. 18 పురాణాల పేర్లు ... 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి. వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు. స్కాందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. - దోర్బల వి. ఆర్ -
మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి
సందర్భం- 23న దీపావళి భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి. ధనత్రయోదశి ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథనాలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది. నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్లిపోయాడు. అందరూ ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్థిల్లుతారు. కనుక ఇది ధనత్రయోదశి అయింది. ధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి. భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు. దీపావళి ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ. దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది. కార్తీకం-పాడ్యమి కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి. భగినీహస్త భోజనం కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు. ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు. - డా॥పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సరసిజ నిలయే సరోజ హస్తే ధవళ తరాంకుశ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్... అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ ధర్మశాస్త్రం చెబుతోంది. -
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
ముంబై: నేత్రదానంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే నేత్రాలను దానం చేయొచ్చని.. నేత్రదానం చేస్తున్నట్లు ముందుగా ప్రకటించినవారు మాత్రమే తమ కళ్లను దానం చేయొచ్చని.. ఇలాంటి అపోహలను తొలిగించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమాలు, నేత్రదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా ప్రజను నేత్రదానం వైపు ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఎవరైనా నేత్రదానం చేయొచ్చు... నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. ఒకరు రెండు కళ్లు దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపు వస్తుంది. నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్లను దానం చేయొచ్చు. కళ్లజోడు పెట్టుకునేవారు. అధిక బ్లడ్ ప్రెషర్, మధుమేహం, ఉబ్బసం వ్యాధులతో ఉన్నవారు, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారూ తమ నేత్రాలు దానం చేయొచ్చు. నేత్రాలు దానం చేయూలనుకుంటే వెంటనే దగ్గరిలోని నేత్రదాన ంపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, ఐ బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నేత్రదానం కోసం 1919/1053 అనే ఉచిత (టోల్‌ఫ్రీ) నంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నేత్రాలను దానం చేయాలనుకునేవారు ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయాలి. తమవారెవరైనా మరణించిన, బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్నా వారి నేత్రాలను దానం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అయితే వ్యక్తి మరణించిన వెంటనే సమాచారం ఇవ్వాలి.