ధారణ | hymn to remember the names of the Ashtadha mythology | Sakshi
Sakshi News home page

ధారణ

Published Sat, Aug 5 2017 11:56 PM | Last Updated on Mon, Sep 11 2017 11:21 PM

hymn to remember the names of the Ashtadha mythology

అష్టాదశ పురాణాల పేర్లను చక్కగా గుర్తు పెట్టుకునేందుకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలు, అన్ని పేర్లూ గుర్తొచ్చేస్తాయి.
‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’ త్రయం ‘వ’ చతుష్టయం!  ‘అ’‘నా’‘ప’‘లిం’‘గ‘‘కూ’‘స్కా’ని పురాణాని పృథక్‌ పృథక్‌ మ ద్వయం– మకారంతో వచ్చే రెండు పురాణాలు. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం భద్వయం– భతో మొదలయే రెండు పురాణాలు–  భాగవత, భవిష్యపురాణాలు.

బ్రత్రయం– బ్రతో మూడు పురాణాలు... బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలు. వ చతుష్టయం– వ కారంతో వచ్చే నాలుగు పురాణాలు...వరాహ, విష్ణు, వామన, వాయు పురాణాలు అనాపలింగకూస్కాని అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో పురాణం. అ– అగ్నిపురాణం; నా– నారద పురాణం, ప– పద్మపురాణం, లిం– లింగపురాణం, గ– గరుడ పురాణం, కూ– కూర్మపురాణం, స్కా–  స్కాంద పురాణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement