కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు.
కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్‌దళ్, పీఎప్‌ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ..బజరంగ్ దళ్ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)తో సమానం అని కాంగ్రెస్ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది.
పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్‌పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం.
(చదవండి: బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్)
Comments
Please login to add a commentAdd a comment