bajarangdal
-
'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు. కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్దళ్, పీఎప్ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ..బజరంగ్ దళ్ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సమానం అని కాంగ్రెస్ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్‌పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం. (చదవండి: బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్) -
వలెంటైన్స్ డే అలర్ట్.. అడ్డుకుంటామంటున్న సంస్థలు
వలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. బౌన్సర్లకు గిరాకీ.. బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే.. వలంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి. చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. -
కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత
చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి చౌరస్తా నుంచి మీర్‌పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్లతో వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
బజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. కన్నడనాట కార్చిచ్చు
Shivamogga Tensions: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతం కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని గత రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి, బెంగళూరు: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండురోజులపాటు విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ‘హిజాబ్’తో సంబంధం లేదు! ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుండడం కలకలం రేపింది. దీనిని ఖండిస్తూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ హత్యకు కారణం వేరే ఉంది. పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు. Koo App Deeply saddened by the murder of a Hindu activist Harsha in Shivamogga. Investigation is on and those responsible for this will be arrested at the earliest. Police officials have been instructed to maintain law and order and I request people to also stay calm. - Basavaraj Bommai (@bsbommai) 21 Feb 2022 ఇక పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు.. హిజాబ్ వ్యవహారం కారణం కాదని స్పష్టం చేశారు. మరోవైపు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ రఘు మాట్లాడుతూ.. పోలీస్ చర్యలపై తాము సంతృప్తిగా లేవని, హర్ష క్రియాశీలక సభ్యుడని, తమ కార్యాచరణ ఏంటో త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. రాజకీయ విమర్శలు కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. హర్ష హత్యకు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కారణమంటూ ఆరోపించారు. ‘హిజాబ్ నిరసనల ద్వారా రెచ్చగొట్టే వ్యవహారంతో ఈ హత్యకు శివకుమార్ కారణమయ్యారు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ఈశ్వరప్ప. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేపాడు ఈశ్వరప్ప. ఇక ఈశ్వరప్ప కామెంట్లను శివకుమార్ ఖండించారు. ఈశ్వరప్పను మతిస్థిమితం లేని వ్యక్తిగా పేర్కొంటూ.. ఆయన(ఈశ్వరప్ప) నాలికకు, బుర్రకు సంబంధమే ఉండదని సిద్ధరామయ్య(ప్రతిపక్ష నేత) తరచూ చెప్తుంటారని, ఈశ్వరప్పను తొలగించాల్సిందేన’ని శివకుమార్ బీజేపీను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. కాంగ్రెస్, బీజేపీలే ఈ ఘటనకు కారణమని, హిజాబ్ వ్యవహారం మొదలైనప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించానని విమర్శలు గుప్పించారు. శివమొగ్గలోని భారతి కాలనీ రవిశర్మ వీధిలో ఆదివారం రాత్రి హర్షను దుండగులు పొడిచి దారుణంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండుగులు హర్షను వెంబడించి పదునైన ఆయుధాలతో పొడిచి పరారయ్యారు. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కమల్ హాసన్ స్పందన ఇదిలా ఉంటే.. శివమొగ్గ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతంపై నటుడు, మక్కల్ నీది మయ్యయ్ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. ‘ఈ తరహా రాజకీయాలకు నేను వ్యతిరేకంగా. జనవరి 30, 1948న ఒక్క హత్యతో దీనిని ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది’’ అంటూ కమల్ గాంధీ హత్యను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. -
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది. హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా ప్రకటించింది. -
శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రోత్సహిస్తారా?
రాజ్గర్హ్, మధ్య ప్రదేశ్ : మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారణాయుధాల వినియోగ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్‌కు మరో అవకాశం దొరికినట్లు అయింది. హిందూవుల రక్షణ పేరుతో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ ఈ నెల 3 నుంచి జూన్ 1 వరకూ రాజ్‌గర్హ్‌లోని బవారాలో స్థానిక యువతకు తుపాకీ వంటి ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియోలను భజరంగ్ దళ్ జిల్లా కన్వినర్ దేవి సింగ్ సోందియా సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాక ‘1984 నుంచి మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దేశ విద్రోహక శక్తులు, లవ్ జిహాద్ వంటి వాటి నుంచి హిందూవులకు రక్షణ కల్పించడానికి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు’ తెలిపారు. ఈ వీడియోలు, ఫోటోలు బీజేపీ పై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధాలుగా మారాయి. ఈ విషయం గురించి ‘మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమానికి అనుమతిచ్చిందా..?. డీజీపీ కానీ, రాజ్గర్హ్ ఎస్పీ కానీ ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారా..? అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అలానే దిగ్విజయ్ సింగ్ కుమారుడు, రాఘోగర్హ్ ఎమ్మెల్యే జైవర్ధన్ ‘జాతీయవాదం పేరుతో భజరంగ్ దళ్ యువతకు మారణాయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫొటోలు చూసి నేను షాకయ్యాను’ అని ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజ్నిష్ అగ్రావాల్ స్పందిస్తూ... ఎవరైనా స్వీయ రక్షణ శిక్షణా తరగతులు నిర్వహించుకోవచ్చు. కానీ దానికి ఎవరు అనుమతిచ్చారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. -
మహిళ వేళ్లను నరికిన బజరంగ్దళ్ కార్యకర్తలు!
గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా ఛత్రల్ పట్టణంలో ముస్లిం మహిళ చేతివేళ్లను నరికి, ఆమె కుమారుడి చేతిని విరగ్గొట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బయటకు రావద్దంటూ తాము ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసినందుకు బజరంగ్దళ్ కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో రోషన్బీవీ సయద్(52) తన మూడు చేతివేళ్లను కోల్పోగా.. ఆమె కుమారుడు ఫర్జన్కు గాయాలయ్యాయి. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. ఇల్లు వదిలి బయటకు రావద్దని రోషన్బీవీని, ఆమె కుమారుడ్ని సోమవారం హెచ్చరించగా.. పశువులను మేపుకునేందుకు వారిద్దరు బయటకు రాగా బజరంగ్దళ్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. స్పృహలోకి వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
వాలెంటైన్స్ డే నిరసనలు : గాడిద, కుక్కకు పెళ్లి తంతు
సాక్షి, చెన్నై: వాలెంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. కుక్క, గాడిదకు పెళ్లి తంతు నిర్వహించారు. నిరసనకారులను అనంతరం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చురై ప్రాంతంలో నిరసనకారులు కుక్క, గాడిదలను పూల దండలతో అలంకరించి..వాటి నుదుటిపై పసుపు రాశారు. వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా..హిందూ వివాహాల్లో ఉపయోగించే పెళ్లి సామాగ్రిని మహిళలు ప్లేట్లలో ప్రదర్శించారు. మరోవైపు హైదరాబాద్‌లో వాలెంటెన్స్ డేను వ్యతిరేకిస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీతీరాన పలు జంటలను భజరంగ్‌దళ్ సభ్యులు తరిమికొట్టారు. -
ఏప్రిల్ 4న పరీక్షలు వాయిదా వేయాలి: బజరంగ్ దళ్
హైదరాబాద్ : హనుమాన్ జయంతి రోజున జరుగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బజరంగ్దళ్ నాయకులు ఉప ముఖ్యమంత్రిని కడియం శ్రీహరిని కలిశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏప్రిల్ 4వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు జరుగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. హనుమాన్ జయంతి రోజున తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న పలు పరీక్షలను వాయిదావేసి సెలవు దినంగా ప్రకటించాలని వారు విజ్క్షప్తి చేశారు. -
ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు. వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు. -
వాలెంటైన్స్ డే వద్దు: బజరంగ్దళ్
ఫిబ్రవరి 14 వాలెంటెన్స్ డే నిర్వహించొద్దని బజరంగ్దళ్ హెచ్చరికలు జారీ చేసింది. వాలెంటెన్స్ డేకు ఆఫర్లు ప్రకటిస్తున్న క్లబ్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రేమ పేరుతో పార్కులతో సంచరించే జంటలకు పెళ్లిళ్లు చేస్తామని బజరంగ్దళ్ నేతలు తెలిపారు. ప్రతి సంవత్సరం వాలంటైన్స్ డే పేరుతో పలువురు యువజంటలు పార్కులు, పబ్బలు, క్లబ్బుల వెంట తిరుగుతూ పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకుని మన సంస్కృతీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారని బజరంగ్ దళ్ మండిపడింది.