వాలెంటైన్స్‌ డే నిరసనలు : గాడిద, కుక్కకు పెళ్లి తంతు | Dog, donkey married amid Valentine's Day protest in Chennai | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్‌ డే నిరసనలు : గాడిద, కుక్కకు పెళ్లి తంతు

Published Wed, Feb 14 2018 3:12 PM | Last Updated on Mon, Feb 10 2020 3:26 PM

Dog, donkey married amid Valentine's Day protest in Chennai - Sakshi

గాడిద, శునకానికి వివాహం జరిపించిన నిరసనకారులు

సాక్షి, చెన్నై: వాలెంటైన్స్‌ డే వేడుకలను వ్యతిరేకిస్తూ భారత్‌ హిందూ ఫ్రంట్‌ కార్యకర్తలు బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. కుక్క, గాడిదకు పెళ్లి తంతు నిర్వహించారు. నిరసనకారులను అనంతరం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చురై ప్రాంతంలో నిరసనకారులు కుక్క, గాడిదలను పూల దండలతో అలంకరించి..వాటి నుదుటిపై పసుపు రాశారు.

వాలెంటైన్స్‌ డేకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా..హిందూ వివాహాల్లో ఉపయోగించే పెళ్లి సామాగ్రిని మహిళలు ప్లేట్లలో ప్రదర్శించారు. మరోవైపు హైదరాబాద్‌లో వాలెంటెన్స్‌ డేను వ్యతిరేకిస్తూ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీతీరాన పలు జంటలను భజరంగ్‌దళ్‌ సభ్యులు తరిమికొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement