
గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా ఛత్రల్ పట్టణంలో ముస్లిం మహిళ చేతివేళ్లను నరికి, ఆమె కుమారుడి చేతిని విరగ్గొట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బయటకు రావద్దంటూ తాము ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసినందుకు బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో రోషన్‌బీవీ సయద్(52) తన మూడు చేతివేళ్లను కోల్పోగా.. ఆమె కుమారుడు ఫర్జన్‌కు గాయాలయ్యాయి. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. ఇల్లు వదిలి బయటకు రావద్దని రోషన్‌బీవీని, ఆమె కుమారుడ్ని సోమవారం హెచ్చరించగా.. పశువులను మేపుకునేందుకు వారిద్దరు బయటకు రాగా బజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. స్పృహలోకి వచ్చాక ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.