Treatment in hospital
-
న్యూయార్క్‌లో చికిత్స
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు లంగ్ కేన్సర్ అని తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు సంజయ్ దత్. త్వరలో న్యూయార్క్ వెళ్లటానికి వీసా అప్లయ్ చేసుకున్నారాయన. ఐదేళ్ల గడువు ఉండే ఆరోగ్య వీసా కోసం అప్లయ్ చేశారట. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత భార్య మాన్యత, చెల్లెలు ప్రియాదత్‌తో కలిసి న్యూయార్క్ ప్రయాణం అవుతారని తెలిసింది. అక్కడి మెమోరియల్ సియాన్ కేటరింగ్ కేన్సర్ సెంటర్లో చేరనున్నారు సంజయ్ దత్. 1980–81ల మధ్యకాలంలో సంజయ్ దత్ తల్లి, ప్రముఖ నటి నర్గిస్కి ఆ ఆస్పత్రిలోనే కేన్సర్ చికిత్స జరిగింది. కేన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. మనీషా కొయిరాల, సోనాలి బింద్రేలు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్లలానే సంజయ్ దత్ కూడా త్వరగా కేన్సర్‌ను జయించి తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. -
కోవిడ్ వైద్యంపై నిపుణుల బృందం
న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సూచించింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ధరల విషయంలో వ్యత్యాసాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్ష రుసుము కొన్ని రాష్ట్రాల్లో రూ.2,200 కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4,500 ఉందంటూ కోర్టు.. ధరల నిర్ణయ విషయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నామని తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉండాలని సూచించింది. ఢిల్లీలోని ఎల్ ఎన్ జేపీ ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీసీటీవీల ప్రస్తావన తీసుకొచ్చింది. కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క అంశమూ పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపింది. ఆస్పత్రుల్లో కరోనా రోగులను సరైన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జూలైలో మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది. -
మృతదేహానికి మూడురోజుల చికిత్స
సాక్షి ప్రతినిధి, చెన్నై: చికిత్స చేస్తుండగానే రోగి మృతి చెందినప్పటికీ ఆ విషయం దాచిపెట్టి డబ్బు గుంజిన ఆస్పత్రి నిర్వాకం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. చికిత్స పేరుతో మృతుని బంధువుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేయడంతోపాటు మరో రూ.5 లక్షలు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం హామీపత్రం రాయించుకుంది. నాగపట్నం జిల్లా కీళాయిసానూరుకు చెందిన శేఖర్ (55) రవాణా శాఖలో డ్రైవర్. అనారోగ్యం బారిన పడిన శేఖర్‌ను బంధువులు ఈనెల 7న∙నాగపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం క్షీణించడంతో మరునాడే తంజావూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ముందుగా రూ.2.50 లక్షలు ఇస్తేనే చికిత్స ప్రారంభిస్తామని అక్కడి వైద్యులు చెప్పడంతో వెంటనే చెల్లించారు. ఈ నెల 28వ తేదీ వరకు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్ధపడ్డారు. చికిత్స కోసం అయిన రూ.5 లక్షలు చెల్లించాలని యాజమాన్యం పట్టుబట్టడంతో బంధువులు హామీ పత్రం రాసిచ్చారు. తంజావూరు ప్రభుత్వవైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించగా శేఖర్ మూడురోజుల క్రితమే చనిపోయాడని వైద్యులు తేల్చారు. దీంతో అతని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పేరుతో రూ.8 లక్షలు వసూలు చేయడంతోపాటు, శేఖర్ మృతికి ఆస్పత్రి కారణమైందని, పైగా ఆ విషయం దాచి పెట్టిందంటూ బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహిళ వేళ్లను నరికిన బజరంగ్దళ్ కార్యకర్తలు!
గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా ఛత్రల్ పట్టణంలో ముస్లిం మహిళ చేతివేళ్లను నరికి, ఆమె కుమారుడి చేతిని విరగ్గొట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బయటకు రావద్దంటూ తాము ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసినందుకు బజరంగ్దళ్ కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో రోషన్బీవీ సయద్(52) తన మూడు చేతివేళ్లను కోల్పోగా.. ఆమె కుమారుడు ఫర్జన్కు గాయాలయ్యాయి. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. ఇల్లు వదిలి బయటకు రావద్దని రోషన్బీవీని, ఆమె కుమారుడ్ని సోమవారం హెచ్చరించగా.. పశువులను మేపుకునేందుకు వారిద్దరు బయటకు రాగా బజరంగ్దళ్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. స్పృహలోకి వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలో జరిగింది. తనను పెళ్లి చేసుకోమంటూ మనోహర్ అనే యువకుడు ఆరు నెలలుగా రమ్య అనే యువతి వెంట పడుతున్నాడు. ఈ విషయంలో అతని సోదరులు సోమవారం రాత్రి ఆమె ఇంటి వద్ద గొడవకు దిగారు కూడా. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో ప్రాణాపాయ స్థితిలో ఆమె చికిత్స పొందుతున్నది. -
ఆందోళనకరంగానే కృష్ణవేణి ఆరోగ్యం
కోలుకుంటున్న తల్లి, కుటుంబసభ్యులు.. హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో శుక్రవారం తీవ్రగాయాలకు గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి నీరజ కృష్ణవేణి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏ పరిసితీ చెప్పలేమని డాక్టర్లు పేర్కొంటుండడంతో ఆమె కుటుంబీకు లు ఆవేదనకు గురవుతున్నారు. ప్రేమోన్మాది రాజు చేతిలో గాయపడిన నీరజ కృష్ణవేణితో పా టు ఆమె తల్లి తులసమ్మ, వరుసకు సోదరుడైన దుర్గా గంగాధర్‌లు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తులసమ్మ, దుర్గాగంగాధర్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో శనివారం వారిని సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుత దాడి నాపైనే: దుర్గాగంగాధర్ కాగా ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షి, బాధితుడు అయిన నీరజ సోదరుడు గంగాధర్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మేమంతా నిద్రిస్తుండగానే ఒక్కసారిగా తలుపులను నెట్టుకొని రాజు లోనికి వచ్చాడు. కత్తితో బెదిరిస్తూ కదిలితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో నేను అడ్డుకునేందుకు వెళ్లగా తొలుత నాపైనే కత్తితో దాడిచేసి గాయపరిచాడు. నేను గట్టిగా అరుస్తూ పడిపోగా మా అక్క నీరజ కృష్ణవేణిపై కత్తితో పాశవికంగా దాడిచేశాడు. అడ్డువచ్చిన మా పెద్దమ్మనూ గాయపరిచాడు. దీంతో మేమంతా కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయాం. అవి విన్న మా పెద్దనాన్న వల్లభరావు ఇంట్లోకి రాగానే అతనిపైనా కత్తితో దాడికి రాజు యత్నించడంతో లాక్కొని అదే కత్తితో అతనిపై దాడిచేశాం’ అన్నాడు. ఎలాంటి ఫిర్యాదులు లేవు: ఈ సంఘటనలో బాధితురాలి తండ్రి చేతిలో హతమైన రాజు విషయంలోగానీ, అంతకు ముందు అతను పాల్పడిన దాడి ఘటనపైన గానీ ఎవరు ఎవరిపైనా తమకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేయలేదనీ, స్థానికుల సమాచారం మేరకే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని కూకట్పల్లి సీఐ పురుషోత్తమం మీడియాకు తెలిపారు. రాజు శవానికి పోస్టుమార్టం చేయించి అతని కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. శవాన్ని అప్పగిస్తున్న సమయంలో మృతుడి సెల్‌ఫోన్‌లోని కాల్ డాటా, ఫొటోల ఆధారంగా విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగుచూస్తాయని రాజు బంధువులు తెలిపినప్పటికీ వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రేమోన్మాదిపై ప్రతిదాడిచేసిన యువతి తండ్రి వల్లభరావును విచారించామనీ, అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు.