పురాణాల గురించి కనీస అవగాహన ఉందా?
సెల్ఫ్ చెక్
భారతదేశం కర్మభూమి. రాముడు, కృష్ణుడు వంటి ఎందరో మహానుభావుల పాదపద్మాల జాడలను ఇముడ్చుకున్న పుణ్యపుడమి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటిన రామాయణ భారత భాగవతాల గురించిన కనీస అవగాహన అవసరం. వాటి గురించి మీకు ఎంత మాత్రం తెలుసో పరీక్షించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్.
1. రామాయణంలోని భాగాలు లేదా అధ్యాయాలను ‘కాండలు’అంటారని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
2. రామాయణంలో మొత్తం ఆరు కాండలున్నాయని, అవి వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
3. మహాభారతాన్ని పంచమ వేదమంటారని తెలుసు.
ఎ. అవును బి. కాదు
4. మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు... తెలుసు?
ఎ. అవును బి. కాదు
5. మహాభారతంలో మొత్తం 18 పర్వాలుంటాయని తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. సంస్కృత మహాభారతాన్ని తెనిగించినవారు నన్నయ, తిక్కన, ఎర్రన అని, వారిని కవిత్రయం అంటారనీ తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. భాగవతాన్ని ముక్తికావ్యమంటారని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
8. మహాభాగవతంలోని భాగాలను స్కందాలంటారని, మొత్తం పన్నెండు స్కందాలుంటాయని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
9. భాగవతాన్ని రచించినది పోతనామాత్యుడని (బమ్మెర పోతన) తెలుసు.
ఎ. అవును బి. కాదు
10. మహాభాగవతంలో పోతన వదిలేసిన ఓ పద్యపాదాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ఆయన రూపంలో వచ్చి పూరించినట్లు మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
పై వాటిలో కనీసం ఏడింటికి ‘ఎ’లను గుర్తించినట్లయితే మీకు ప్రాచీన సంస్కృతిపై తగినంత అవగాహన ఉందని, పురాణాలు, కావ్యాల గురించి తెలియని వారికి కూడా మీరు ప్రాథమిక అవగాహన కల్పించగలరని చెప్పవచ్చు. కనీసం ఐదింటికి కూడా ‘ఎ’లు రాకపోతే మన ఇతిహాసాలపై ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదని, వాటి గురించి ఎవరు ఏం చెప్పినా ఔననీ, కాదనీ చెప్పలేని స్థితిలో ఉన్నారని, కాబట్టి కనీసం పరిజ్ఞానం పెంచుకోక తప్పదని చెప్పవచ్చు.