న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు)బిల్లులోని అంశాలతో పోలీసులు, దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముసాయిదా చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సోమవారం ప్రతిపక్ష నేతలకు సూచించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ప్రతిపాదిత చట్టంతో డేటా దుర్వినియోగం అవుతుందన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలపై స్పందించారు.‘ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మనమూ అదే అనుసరిస్తున్నాం. గడిచిన రెండున్నరేళ్లుగా వాహనాల చోరీలు సహా పలు కేసులను పరిష్కరించేందుకు డేటా బేస్‌ను వాడుతున్నాం’అని తెలిపారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment