
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
పటమట : ఎయిడ్స్‌పై అవగాహన అవసరమని మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ రేఖ పేర్కొన్నారు. స్టెల్లా కళాశాలలో బుధవారం అంతర్జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అపరిచితులకు దూరంగా ఉండటంతో పాటు ఆస్పత్రులలో ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడకుండా జాగ్రత్తపడాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ రిబ్బన్ క్లబ్, జాతీయ సేవాదళం ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో యువజనోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు రెడ్ రిబ్బన్ ఆకారంలో మానవహారాన్ని ప్రదర్శించారు.