ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించి వెలువడిన తాజా నివేదిక మరింత దడ పుట్టిస్తోంది. 2023లో ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్‌ఐవి వైరస్‌ను ప్రపంచంలోని సుమారు నాలుగు కోట్ల మందిలో గుర్తించారు. వీరిలో 90 లక్షల మంది వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స పొందలేకపోయారు. ఫలితంగా ప్రతి నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతిచెందాడని వెల్లడయ్యింది.
ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరంగా పరిణమించింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలలో ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది ఎయిడ్స్ కారణంగా ఆరు లక్షల మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు
2023లో దాదాపు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మృతిచెందారు. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేస్తామని ప్రపంచ నాయకులు ప్రతిజ్ఞ చేశారని, అయితే 2023లో కొత్తగా13 లక్షలకు పైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment