ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
ఒంగోలు సెంట్రల్:ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా ఎయిడ్స్ ఆధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సంధర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీని శిధ్దా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె ఆర్. విజయ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్‌వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎయిడ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ర్యాలీ అనంతరం అంభేద్కర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్‌కు మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ సురక్షిత లైంగిక చర్యల వల్ల ఈ వ్యాధి రాదన్నారు. ఈ సంధర్బంగా పీ శాక్స్ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఎఆర్‌టి మందులను సక్రమంగా వాడితే మంచిదన్నారు. జిల్లా జడ్జి మోహ న్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు వివక్షతకు గురైతే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణా అధికారి డాక్టర్ పద్మావతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి టి. రమేష్, డాక్టర్ సరళాదేవి, డాక్టర్ జోసఫ్, నాగేంద్రయ్య, డెమోలు శ్రీనివాసరావు, పద్మజ, తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.