సాక్షి, అమరావతి: హెచ్‌ఐవి/ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ 5కె మారథాన్ (రెడ్ రన్)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎపిశాక్స్) అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ (ఐఆర్‌యస్) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె తెలిపారు.
సెప్టెంబర్ 30న ఐక్యత మరియు దృఢ సంకల్పం యొక్క ఉల్లాసకరమైన ప్రదర్శనలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆలోచనగా యూత్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించేందుకు విజయవాడ నగరం సిద్ధమవుతోందని ఆమె అన్నారు. ఈ ఈవెంట్ యువత ఆరోగ్యం మరియు అవగాహన దిశగా అద్భుతమైన వేడుకగా నిర్వహించనున్నట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. నేకో(NACO) దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కీలకమైన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వినూత్నమైన కార్యక్రమంగా దీన్ని రూపొందించామని అన్నారు.
హెచ్ఐవి నివారణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం, యువతలో సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను ప్రోత్సహించడం, హెచ్ఐవి మరియు ఎస్టిఐ సంబంధిత సేవల్ని ప్రోత్సహించడం , ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి నిర్ధేశించిన లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు.
26 జిల్లాల నుండి వచ్చిన 17-25 సంవత్సరాల వయస్సు గల 260 ఔత్సాహిక కళాశాల విద్యార్థులు 5K మారథాన్‌లో పాల్గొంటారన్నారు. ఇది ఆరోగ్యకరమైన, మరింత అవగాహన గల భవిష్యత్తు కోసం వారి నిబద్ధతను సూచిస్తుందన్నారు. కళాశాల విద్యార్థులు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులతో సహా ప్రతి జిల్లా నుంచి పది మంది దీనిలో పాల్గొంటారన్నారు. హెచ్ఐవికి సంబంధించిన మరింత సమాచారం కోసం www.apsacs.ap.gov.in సంప్రదించాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment