ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు! | IRDA asks insurers to design policy for HIV/AIDS patient | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు!

Published Sat, Dec 7 2013 2:03 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు! - Sakshi

ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు!

 న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల (పీఎల్‌హెచ్‌ఏ) కోసం కూడా బీమా కవరేజి లభించేలా చూడాలని జీవిత బీమా సంస్థలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఆదేశించింది. ఇందుకోసం తగిన పాలసీలను రూపొందించాలంటూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలను బట్టి అర్హత ఉన్న ఏ ఒక్క పీఎల్‌హెచ్‌ఏకి కూడా బీమా కవరేజిని నిరాకరించరాదంటూ ఐఆర్‌డీఏ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా..లోక్‌సభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు వివ రించారు. సర్క్యులర్ ప్రకారం.. పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుకి హెచ్‌ఐవీ లేకున్నా .. ఆ తర్వాత అది సంక్రమించిన పక్షంలో క్లెయిమ్‌లను నిరాకరించరాదు. బీమా సంస్థల నుంచి ఈ ప్రతిపాదనలపై ఐఆర్‌డీఏ అభిప్రాయాలు ఆహ్వానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement