ఎయిడ్స్ ఉన్న వారి ఇన్సూరెన్స్ క్లయిమ్‌లను తిరస్కరించకూడాదని బీమా కంపెనీలకు ఐఆర్డిఏ సూచించింది.
ముంబై: ఎయిడ్స్ ఉన్న వారి ఇన్సూరెన్స్ క్లయిమ్‌లను తిరస్కరించకూడాదని బీమా కంపెనీలకు ఐఆర్డిఏ సూచించింది. పాలసీ తీసుకునే సమయానికి హెచ్ఐవి బాధితులు కాకపోతే అలాంటి వ్యక్తుల క్లయిమ్‌లను తిరస్కరించడం సమంజసం కాదని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఐఆర్డిఏ అనేది మన దేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని నియంత్రించడం కోసం ఉద్దేశించింది. పాలసీ తీసుకున్నాక హెచ్ఐవి వస్తే దాన్ని కూడా ఒక తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలని బీమా నియంత్రణ సంస్థ తెలిపింది.
పాలసీ ప్రకారం ఏకమొత్తంగా గానీ లేదా విడతల వారీగా కానీ క్లయిమ్‌లు చెల్లించాలని తెలిపింది. ఎయిడ్స్ రోగులకు, వారి బంధువులకు ఇది శుభవార్తే గదా.