
లండన్: భూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన ప్రదేశాల్లో చిలీలోని అటకామా ఎడారి ఒకటి. ఎయిడ్స్ చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను ఈ ఎడారి ప్రాంతంలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన ఎడారి మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయి.
మన పర్యావరణ వ్యవస్థలో యాక్టినోబ్యాక్టీరియా జాతి చాలా ప్రధానమైందని, ఇది జీవక్రియా మిశ్రమాల గని అని బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ∙పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో బ్యాక్టీరియాలోని చిన్నభాగమైనా సహకరిస్తుందని.. దీంతో ఔషధాలను కనుగొనడంలో ఉపయోగపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment