ఎయిడ్స్ ప్రచారానికి ఓకే | shruti hasan to support aids campaign | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ ప్రచారానికి ఓకే

Published Wed, Dec 17 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

ఎయిడ్స్ ప్రచారానికి ఓకే

ఎయిడ్స్ ప్రచారానికి ఓకే

 ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. అలాం టి వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రుతి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా వున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ, ప్రచారం చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుందని భావించిన ఎయిడ్స్ నిరోధక సంస్థ నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. అందుకు శ్రుతిహాసన్ వెంటనే ఓకే చెప్పారు.
 
 ఆమె ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పిన వ్యాఖ్యలను వీడియోలో దాన్ని చిత్రీకరించి ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. దీన్ని త్వరలో ఎయిడ్స్ నిరోధక కమిటీ నిర్వాహకులు చిత్రీకరించనున్నారని తెలిసింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విజయ్ సరసన గరుడ చిత్రంలోనూ తెలుగులో మహేష్‌బాబుకు జంటగా ఒకచిత్రంతో పాటు హిందీలో ఐదు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా విశాల్ సరసన మరోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ శ్రుతి ఎయిడ్స్‌పై అవగాహన ప్రచారానికి అంగీకరించడం గొప్ప విషయమే కదా మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement