సప్త చిత్రాల శ్రుతి | Shruti Haasan to star in six films in 2015 | Sakshi
Sakshi News home page

సప్త చిత్రాల శ్రుతి

Published Tue, Jan 6 2015 2:22 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

సప్త చిత్రాల శ్రుతి - Sakshi

ప్రస్తుతం హీరోయిన్‌గా టాప్ గేర్‌లో పరుగులు తీస్తున్న నటి ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం శ్రుతి హాసన్. నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ప్రకటించిన ఈ బ్యూటీ తన వ్యాఖ్యల్ని నిజం చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్‌లో గబ్బర్‌సింగ్, రేసు గుర్రం, ఎవడు లాంటి చిత్రాలతో విజయ పథంలో కొనసాగుతున్న శ్రుతి హాసన్ పూజై చిత్రంతో తమిళంలోనూ గెలుపు ఖాతాను తెరిచారు. దీంతో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్‌గా తన హవా సాగుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈ మూడు భాషల్లో ఏడు చిత్రాలను చేస్తూ సహ హీరోయిన్లను అధిగమించారు.
 
 తమిళంలో విజయ్ సరసన శింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న పులి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా హన్సిక, ముఖ్య పాత్రలో శ్రీదేవి నటించడం విశేషం. తెలుగులో మహేష్ బాబు సరసన ఇప్పటికే ఓ చిత్రం చేస్తున్నారు. తాజాగా, నాగార్జునతో జత కట్టేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌లో ఈ అమ్మడు చేతిలో ఏకంగా 4 చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏడు చిత్రాలు విడుదల అవుతాయని శ్రుతి హాసన్ సంతోషంగా చెబుతున్నారు. నాగార్జున సరసన నటించనున్న చిత్రంలో మరో హీరోగా కార్తీ నటించనున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోనున్న మల్టీ స్టారర్ చిత్రంగా పేర్కొంటున్నారు. ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని శ్రుతి పేర్కొంటున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement