top heroine
-
నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది: వర్ష బొల్లమ్మ
‘‘నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే ఇష్టం. ‘స్వాతిముత్యం’ కథలో కొత్తదనం ఉంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘‘సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అలాగే కథ నచ్చడంతో ‘స్యాతిముత్యం’ చేయాలని ఫిక్స్ అయ్యాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇందులో భాగ్యలక్ష్మి అనే టీచర్ పాత్ర చేశాను. బయట సరదాగా ఉంటాను, కానీ విద్యార్థుల ముందు కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలోని నా గురువుల స్ఫూర్తితో ఈ సినిమాలో సహజంగా నటించాను. ఇందులో గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్ర కొంచెం డామినేటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు మధ్యతరగతి అమ్మాయిగా నన్ను చూడటానికి ఇష్టపడుతున్నారనుకుంటున్నాను. అందుకే అలాంటి పాత్రలు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి. లక్ష్మణ్‌గారి రచన నాకు చాలా నచ్చింది. టాప్ హీరోయిన్ అవ్వాలనే ఆలోచన నాకు లేదు.. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుంది. కమర్షియల్ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తాను. ప్రతినాయిక ఛాయలున్న సైకో పాత్ర బాగా చేయగలననే నమ్మకం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ లో ‘కొమురం భీముడో..’ పాటలో ఎన్టీఆర్‌గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను ఫ్యా¯Œ . ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు తెలుగు, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్‌తో ఉలిక్కిపాటు
రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్ బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. అరెస్ట్ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్‌ను ధృవీకరిస్తూ రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక ద్రవ్యాలు, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రతీకారంగానే.. పోరీ మోనీ అసలు పేరు షామ్‌సున్నాహర్. సైడ్ కిక్ వేషాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌ను, ముగ్గురు మహిళల్ని, నజీర్ సహచరుడైన డ్రగ్ డీలర్ తుహిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్టా కేసు నజీర్ అరెస్ట్ అయిన వారం తర్వాత గుల్షన్ ఆల్ కమ్యూనిటీ క్లబ్ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్ ఈ క్లబ్‌కు డైరెక్టర్ కూడా). డ్రగ్స్ మత్తులో జూన్ 7న ఆమె క్లబ్‌పై దాడి చేసిందని క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్ దొరికింది. ఆ వెంటనే నజీర్, అతని అనుచరులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. చంపేస్తారన్న కాసేపటికే.. బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్‌ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్ కేసు నమోదు అయ్యింది. -
బాలీవుడ్ హాట్‌ఫేవరెట్ కియారా
కియారా అద్వానీ... ప్రస్తుతం బాలీవుడ్ హాట్‌ఫేవరెట్. ఆమె చేసిన ‘కబీర్ సింగ్’ 300 కోట్లు వసూలు చేసింది. ఆమె భాగమైన ‘గుడ్ న్యూస్’ సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసింది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆమెనే హీరోయిన్గా కావాలంటున్నాయి. ప్రస్తుతం ఐదు సినిమాలు కియారా చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌స్టార్ హీరోయిన్ కియారాయేనా? ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాల విశేషాలు చూద్దాం. భూల్ భులెయ్యా 2 2007లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘భూల్ భులెయ్యా’. 14 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మనాలీలో జరుగుతుంది. నవంబర్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. షేర్షా ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. టైటిల్ రోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విక్రమ్ బాత్రా భార్యగా కనిపించనున్నారు కియారా. ఈ సినిమా విడుదల కోవిడ్ వల్ల వాయిదా పడింది. తాజాగా జూలై 2న సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కర్రమ్ కుర్రమ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారీకర్ నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రం ‘కర్రమ్ కుర్రమ్’. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కియారా లీడ్ రోల్లో కనిపిస్తారు. అశుతోష్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన గ్లెన్ బరెట్టో, అంకుష్ మోహ్లా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. స్వయం ఉపాధిలా సొంతంగా అప్పడాలు తయారు చేసుకునే కొందరి స్త్రీల కథ ఇదని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ఆరంభం కానుంది. మిస్టర్ లేలే ‘ధడక్’ దర్శకుడు శశాంక్ కైతాన్ ఓ పూర్తి స్థాయి కామెడీ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘మిస్టర్ లేలే’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విక్కీ కౌశల్, కియారా అద్వానీ జంటగా నటిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. జగ్ జగ్ జీయో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా రాజ్ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జగ్ జగ్ జీయో’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వరుణ్ ధావన్, కియారా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్ ముఖ్య పాత్రల్లో న టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది నాలుగు సినిమాలతో థియేటర్స్‌లో పలకరిస్తారు కియారా. ఇప్పుడు చేతిలో ఉన్న ఈ సినిమాలు కాకుండా ఇంకో సినిమా కూడా చర్చల దశలో ఉందని బాలీవుడ్ టాక్. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కిస్తున్న ‘యానిమల్’లో అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ ఉంది. తెలుగులో ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా కియారా పేరు పరిశీలిస్తున్నారన్నది ఓ వార్త. ఇదే దూకుడును కొనసాగిస్తే త్వరలో టాప్ హీరోయిన్ చైర్లో కియారా కూర్చునే అవకాశం ఉంది. -
నయనలో మరో కోణం
తమిళసినిమా: నటి నయనతార అనగానే తనో టాప్ కథానాయకి అన్న విషయం, ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడడం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఇలాంటి వాటి గురించే చాలా మందికి తెలుసు. ఎంతసేపు ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. అయితే నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నయనతారలో మంచి చెఫ్ ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం అట. నయనతారలో మరో ముఖ్య అంశం తనలో మంచి కవయిత్రి ఉన్నారట. ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తన రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను ³#స్తకంగా ముద్రించాలా లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారట. నయన కవితలను పుస్తకం రూపంలోనో, పాటల రూపంలోనో త్వరలో చదవడమో, వినడమో చేయబోతున్నామన్న మాట. -
టాప్ హీరోయిన్ కాలేకపోయా..
పలు భాషల్లో నటించినా ప్రముఖ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయానని నటి తాప్సీ వాపోతున్నారు. బహుభాషా నటిగా గుర్తింపు పొందిన మూడు పదుల వయసుకు చేరవలో ఉన్న ఈ ఢిల్లీ భామ తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా జీవా తదితర పలువురు యువ నటులకు జంటగా నటించారు. ఇటీవల కాంచన-2లో లారెన్స్‌తో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా దిగుమతి అయ్యారు. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా టాప్ నాయికల వరుసలో చేరలేకపోయారు. ఇది తనకు బాధాకరమైన విషయమేనంటున్న తాప్సీ ప్రముఖ హీరోల సరసన నటిస్తేనే తగినంత ప్రాచుర్యం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో రాణించడం చాలా కష్టం అంటున్న తాప్సీకీ ఇప్పుడు బిగ్‌బీ అమితాబ్‌తో నటించే లక్కీ ఛాన్స్ లభించింది. అదే విధంగా అక్షయ్‌కుమార్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాలపై తను చాలా నమ్మకం పెట్టుకున్నారట. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజే మారిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా తానూ టాప్ హీరోయిన్ అనిపించుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
జ్యోతిక చిత్రానికి కథ రెడీ
నటి జ్యోతిక తదుపరి చిత్రానికి కథ సిద్ధమైందన్నది తాజా సమాచారం. ఈ తరం నటీమణులకు స్ఫూర్తిగా నిలిచే ప్రముఖ నాయకిల్లో జ్యోతిక ఒకరు. ఇప్పటి ప్రముఖ నాయికలకు ముందు ఒక వెలుగు వెలిగిన నటి జ్యోతిక. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడిన జ్యోతిక ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత భర్త ప్రోత్సాహంతో మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. రీఎంట్రీలో జ్యోతిక నటించిన మొదటి చిత్రం 36 వయదినిలే. 2015లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ చూరగొంది. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా జ్యోతిక పచ్చజెండా ఊపలేదు. కథ నచ్చితేనే నటించాలన్న నిర్ణయంతో ఉన్న జ్యోతిక ఈ మధ్య కాలంలో చాలా కథలు విన్నారట. ఆ మధ్య సూర్య జ్యోతిక కలిసి ఒక చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి జ్యోతిక స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రంలోనే నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కుట్రం కడిదల్ చిత్రం ఫేమ్ బ్రహ్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి మంచి కథను తయారు చేసిన దర్శకుడు చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతక వర్గం ఎంపిక జరుగుతోందని, ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
సప్త చిత్రాల శ్రుతి
ప్రస్తుతం హీరోయిన్గా టాప్ గేర్‌లో పరుగులు తీస్తున్న నటి ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం శ్రుతి హాసన్. నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ప్రకటించిన ఈ బ్యూటీ తన వ్యాఖ్యల్ని నిజం చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్లో గబ్బర్‌సింగ్, రేసు గుర్రం, ఎవడు లాంటి చిత్రాలతో విజయ పథంలో కొనసాగుతున్న శ్రుతి హాసన్ పూజై చిత్రంతో తమిళంలోనూ గెలుపు ఖాతాను తెరిచారు. దీంతో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్గా తన హవా సాగుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈ మూడు భాషల్లో ఏడు చిత్రాలను చేస్తూ సహ హీరోయిన్లను అధిగమించారు. తమిళంలో విజయ్ సరసన శింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న పులి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్గా హన్సిక, ముఖ్య పాత్రలో శ్రీదేవి నటించడం విశేషం. తెలుగులో మహేష్ బాబు సరసన ఇప్పటికే ఓ చిత్రం చేస్తున్నారు. తాజాగా, నాగార్జునతో జత కట్టేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్లో ఈ అమ్మడు చేతిలో ఏకంగా 4 చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏడు చిత్రాలు విడుదల అవుతాయని శ్రుతి హాసన్ సంతోషంగా చెబుతున్నారు. నాగార్జున సరసన నటించనున్న చిత్రంలో మరో హీరోగా కార్తీ నటించనున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోనున్న మల్టీ స్టారర్ చిత్రంగా పేర్కొంటున్నారు. ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని శ్రుతి పేర్కొంటున్నారు. -
ఎయిడ్స్ ప్రచారానికి ఓకే
ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. అలాం టి వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రుతి ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా వున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ, ప్రచారం చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుందని భావించిన ఎయిడ్స్ నిరోధక సంస్థ నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. అందుకు శ్రుతిహాసన్ వెంటనే ఓకే చెప్పారు. ఆమె ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పిన వ్యాఖ్యలను వీడియోలో దాన్ని చిత్రీకరించి ఇంటర్నెట్లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. దీన్ని త్వరలో ఎయిడ్స్ నిరోధక కమిటీ నిర్వాహకులు చిత్రీకరించనున్నారని తెలిసింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విజయ్ సరసన గరుడ చిత్రంలోనూ తెలుగులో మహేష్‌బాబుకు జంటగా ఒకచిత్రంతో పాటు హిందీలో ఐదు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా విశాల్ సరసన మరోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ శ్రుతి ఎయిడ్స్‌పై అవగాహన ప్రచారానికి అంగీకరించడం గొప్ప విషయమే కదా మరి. -
నాది సహజ సౌందర్యం
నాది సహజ సౌందర్యం అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఐరన్‌లెగ్ నటి అన్న నోళ్లను అతి త్వరలోనే మూయించి టాప్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన నటి ఈమె. తమిళం, తెలుగు, హిందీ భాషల దర్శక నిర్మాతలు శ్రుతిహాసన్ కాల్షీట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. తాజాగా తమిళంలో పూజై చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సరసన మారిశన్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో మహేష్‌బాబు సరసన ఒక చిత్రంతో పాటు హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. విజయ్‌తో నటిస్తున్న చిత్ర షూటింగ్ నగరం శివారు ప్రాంతం వీసీఆర్ రోడ్డులో జరుగుతోంది. అయినా తన గ్లామరస్ నటనతోనే శ్రుతిహాసన్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముద్దుగుమ్మను స్ఫూర్తిగా తీసుకునే ఇతర హీరోయిన్లు ఎదగాలని ప్రయత్నిస్తున్నారన్నది పరిశ్రమ వర్గాల మాట. అయితే తాజాగా అందరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్ మరోసారి వార్లల్లో కెక్కారు. ఆమె ఏమన్నారంటే... సినిమా నటీమణులందరూ తెరపై అందంగానే కనిపిస్తారు. అందుకు కారణం మేకప్, ఫోకస్ లైట్స్. హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఇవే ముఖ్య కారణం. అయితే నేను మాత్రం ఎలాంటి మేకప్ లేకుండానే అందంగా ఉంటాను. నాది సహజ అందం. నా శరీరాకృతి కూడా కచ్చితమైన కొలతలతో ఉంటుంది. నా తల్లిదండ్రులు అందంగా ఉంటారు. అందువల్లే నేను అందంగా ఉన్నాను అని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. -
నేనింతే
అందం, అభినయం కలగలసిన నటి అనుష్క. ఈమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కాదెమో. ఈ భామ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ చిత్రాలున్నాయి. వీటిలో రెండు తమిళ్, రెండు తెలుగు. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించిన లింగా చిత్రం వచ్చే నెల 12న తెరపైకి రానుంది. అజిత్‌కు జంటగా నటించిన ఎన్నై అరుందాల్ సంక్రాంతికి సందడి చేయనుంది. అలాగే తెలుగులో రుద్రమదేవిగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక దక్షిణాది సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్లో రూపొందుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా వరసగా భారీ చిత్రాలను సొంతం చేసుకున్న అనుష్క పారితోషికం భారీగా పెంచిందని, గర్వం బాగా పెరిగిపోయిందని కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి దీటుగానే బదులిస్తోంది అనుష్క. నటిగా తన అంతస్తు పెరిగిందని చెప్పింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. తెలుగులోనూ రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చిత్రాలు తన చేతిలో ఉన్నాయని తెలిపింది. అయితే అహంకారం, గర్వం, అసూయ అనేవి తన దరిదాపుల్లో లేవని స్పష్టం చేసింది. సినీ రంగ ప్రవేశానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానని వెల్లడించింది. -
నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి
కమల్‌హాసన్, శ్రుతిహాసన్ ఇద్దరూ సినిమాలతో ఫుల్ బిజీ. ఈ కారణంగా ఇద్దరూ రోజులు తరబడి కలుసుకోలేని పరిస్థితి. అయినా సరే... కూతురి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారట కమల్. స్వతంత్రభావాలతో పెరిగిన ఆయన... తన బిడ్డలను కూడా అలాగే పెంచారు. తండ్రి సహాయం లేకుండానే శ్రుతి టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈ టాపిక్ దేనికి? అనుకుంటున్నారా! విశేషమేంటంటే, చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఈ తండ్రీకూతురూ.. చెన్నయ్ పురవీధుల్లో అర్ధరాత్రి హెల్మెట్లు పెట్టుకొని మరీ షికార్లు చేశారు. ఈ విషయాన్ని శ్రుతీనే తెలియజేశారు. ‘‘నాన్నను కలిసి చాలా రోజులైంది. ఓ సినిమా వేడుకకు ఇటీవలే చెన్నయ్ వెళ్లాను. పనిలో పనిగా నాన్నను కలిసి సర్ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్తే ఆయన లేరు. చాలా బాధేసింది. చేసేది లేక... నాన్నకు ఫోన్ చేశాను. ఆళ్వార్‌పేట ఆఫీస్‌లో ఉన్నానని చెప్పారు. అది నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆఫీస్. అక్కడికెళ్లాను. నన్ను చూడగానే నాన్న కళ్లలో నీళ్లు తిరిగాయి. నాక్కూడా. నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఎత్తుకున్నంత పనిచేశారు. చాలాసేపు ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం. టైమ్ పన్నెండు దాటిపోయింది. సరదాగా బయటకెళ్దామా అన్నారు నాన్న. నేను కూడా ‘ఓకే’ అన్నాను. కారు తీస్తారనుకున్నా. కానీ ఆయన బైక్ తీశారు. ఇద్దరం హెల్మెట్లు పెట్టుకున్నాం. చెన్నయ్ వీధుల్లో సరదాగా తిరిగాం. నాన్నతో ఆ షికారు నా జీవితంలోనే మరచిపోలేని అనుభూతిని పంచింది!’’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రుతీహాసన్. -
అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే!
శ్రుతీహాసన్ తన తోటి కథానాయికలందరికీ షాక్ ఇచ్చారు. ‘దక్షిణాదిన అందరూ అత్యంత ఇష్టపడుతున్న హీరోయిన్ ఎవరు?’ అనే అంశంపై ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందర్నీ వెనక్కు నెట్టి ఆమె మొదటి స్థానంలో నిలిచారు. బళ్లు ఓడలు అవ్వడం... అంటే ఇదే. గతంలో శ్రుతీహాసన్ పేరెత్తితే చాలు ‘ఐరన్‌లెగ్’ అనేవారు. అలాంటి హీరోయిన్ ఇలాంటి క్రెడిట్ సాధించడం నిజంగా విశేషమే. గబ్బర్‌సింగ్, ఎవడు, బలుపు, రేసుగుర్రం... ఇలా వరుసగా విజయాలను అందుకుంటూ తెలుగు సినీరంగంలో దూసుకుపోతున్నారు శ్రుతి. నిజానికి, గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 11వ స్థానంలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇప్పుడిలా ప్రేక్షకాదరణలో ప్రథమ స్థానం పొందడాన్ని బట్టి... శ్రుతి కెరీర్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. పెద్దగా విజయాలు లేకపోయినా తమన్నా ఈ సర్వేలో రెండోస్థానంలో నిలవడం విశేషం. శ్రీయ, ఇలియానా, హన్సిక, నయనతార, కాజల్ టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకోగా, ప్రస్తుతం తెలుగులో నంబర్‌వన్ హీరోయిన్గా భాసిల్లుతున్న సమంత 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సర్వేలో నంబర్‌వన్‌గా నిలిచినందుకు శ్రుతి చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు.