నయనలో మరో కోణం
తమిళసినిమా: నటి నయనతార అనగానే తనో టాప్ కథానాయకి అన్న విషయం, ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడడం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఇలాంటి వాటి గురించే చాలా మందికి తెలుసు. ఎంతసేపు ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. అయితే నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నయనతారలో మంచి చెఫ్ ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం అట.
నయనతారలో మరో ముఖ్య అంశం తనలో మంచి కవయిత్రి ఉన్నారట. ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తన రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను ³#స్తకంగా ముద్రించాలా లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారట. నయన కవితలను పుస్తకం రూపంలోనో, పాటల రూపంలోనో త్వరలో చదవడమో, వినడమో చేయబోతున్నామన్న మాట.