జ్యోతిక చిత్రానికి కథ రెడీ | Jyothika to start work on her next from today | Sakshi
Sakshi News home page

జ్యోతిక చిత్రానికి కథ రెడీ

Published Sun, Jul 10 2016 4:12 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

జ్యోతిక చిత్రానికి కథ రెడీ - Sakshi

జ్యోతిక చిత్రానికి కథ రెడీ

నటి జ్యోతిక తదుపరి చిత్రానికి కథ సిద్ధమైందన్నది తాజా సమాచారం. ఈ తరం నటీమణులకు స్ఫూర్తిగా నిలిచే ప్రముఖ నాయకిల్లో జ్యోతిక ఒకరు. ఇప్పటి ప్రముఖ నాయికలకు ముందు ఒక వెలుగు వెలిగిన నటి జ్యోతిక. టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడిన జ్యోతిక ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత భర్త ప్రోత్సాహంతో మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. రీఎంట్రీలో జ్యోతిక నటించిన మొదటి చిత్రం 36 వయదినిలే.

2015లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ చూరగొంది. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా జ్యోతిక పచ్చజెండా ఊపలేదు. కథ నచ్చితేనే నటించాలన్న నిర్ణయంతో ఉన్న జ్యోతిక ఈ మధ్య కాలంలో చాలా కథలు విన్నారట. ఆ మధ్య సూర్య జ్యోతిక కలిసి ఒక చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి జ్యోతిక స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రంలోనే నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి కుట్రం కడిదల్ చిత్రం ఫేమ్ బ్రహ్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి మంచి కథను తయారు చేసిన దర్శకుడు చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతక వర్గం ఎంపిక జరుగుతోందని, ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement