వరుడికి ఎయిడ్స్... ఆగిన రెండో పెళ్లి
పీటలపై ఆగిన పెళ్లి
- ఎయిడ్స్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు
- ఖాకీల రంగప్రవేశం.. వరుడికి పరీక్షలు
- హెచ్‌ఐవీ ఉన్నట్లు నివేదిక
హసన్‌పర్తి : ముహూర్తం ఉదయం 10 గంటలకు.. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నారుు.. ఇంతలోనే పోలీసుల రంగప్రవేశం.. వరుడిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లి న పోలీసులు.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు విషయం ఏమిటని అడిగినా సమాధానం రాని పరిస్థితి.
హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెంది న ఓ యువకుడికి హుస్నాబాద్ మండలం తౌళ్లపల్లికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్యం జీవితం సవ్యంగానే సాగింది. మూడేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించారు. చివరికి ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
దీంతో భర్త కూడా పరీక్షలు చేరుుంచుకున్నాడు. అయితే అతడికి హెచ్‌ఐవీ(నెగటివ్) ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అతడికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే మొదటి భార్యకు రూ.50వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు.
మడిపల్లికి చెందిన అమ్మాయితోనే...
ఇదిలా ఉండగా, మడిపల్లికి చెందిన అమ్మాయితోనే రెండో పెళ్లికి సిద్ధమయ్యూడు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండగా, ఉదయం 7.15గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. అటు వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ సార్.. మడిపల్లిలో ఫలాన యువకుడికి ఎయిడ్స్ ఉంది.. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం.. మీరు వెళితే... ఓ యువతి జీవితం నాశనం కాకుం డా ఉంటుందని ఫోన్ పెట్టేశాడు. స్థానిక ఎస్సై రవికిరణ్ సమాచారాన్ని సీఐ రఘుచందర్‌కు చేరవేశారు. దీంతో పోలీసులు మడిపల్లికి వెళ్లి వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
కాగా, వరుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపించారు. సుమారు రెండు గంటల తర్వాత నివేదిక ఎస్సై చేతికి అందింది. దీంతో ఆయన స్థానిక వైద్యులకు దానిని చూపించగా.. వారు హెచ్‌ఐవీ ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కరుణ మైత్రి స్వచ్ఛంద వారికి సమాచారం అందించారు. వారు మడిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.