సంబంధిత ఉద్యోగి సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్ రోగులకు మందులను నిల్వ చేసే నగరానికి చెందిన ఓ స్టోర్ నిర్వహణలో లోపాలున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. ఈ మందులను నిల్వ చేసే స్టోర్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఈ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇటీవల స్టోర్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో పలు అవకతవకలు జరిగినట్లు తేలడంతో స్టోర్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఎరుుడ్‌స వ్యాధిగ్రస్తులకు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మందులను రాష్ట్రానికి ఇస్తుంది.
ఈ మందుల నిల్వ కోసం ఎల్‌బీ నగర్‌లో ప్రత్యేక స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. అరుుతే ఈ స్టోర్ నిర్వహణ బాధ్యతలను ఒక కాంట్రాక్టు ఉద్యోగి చూస్తున్నారు. ప్రభుత్వం అందించిన మందులకు... ఈ స్టోర్ నుంచి సరఫరా చేసిన మందులకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్టోర్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు సరిగా లేనట్లు పరిశీలనలో తేలడంతో స్టోర్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు. కాగా ఈ స్టోర్‌లో మందులు గోల్‌మాల్ అయ్యాయా? ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయా? అనే విషయంపై అధికారులు పూర్తిస్థారుు విచారణ చేయాలని నిర్ణరుుంచారు. విచారణ తర్వాత అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.