ఎయిడ్స్‌పై అవగాహనకు యానిమేషన్ చిత్రం
ఎయిడ్స్‌పై అవగాహనకు యానిమేషన్ చిత్రం
Published Tue, Nov 26 2013 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
ప్రపంచ వ్యాప్తంగా మృత్యువాత పడుతున్న వారిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికం. ఎయిడ్స్‌ను నిరోధించడానికి పలు చర్యలు చేపడుతూనే ఉన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తమిళ యానిమేషన్ పేరుతో ఎయిడ్స్‌పై అవగాహన కోసం తమిళ యానిమేషన్ చిత్రం రూపొందింది. నటు డు సూర్య, అనుష్క, సిద్దార్థ్, శ్రుతి హాసన్ నటించిన ఈ చిత్రాన్ని టీచ్ ఎయిడ్స్ సంస్థ తమిళనాడు ఎయి డ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్తంగా నిర్మిం చాయి.
భారత దేశంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య తమిళనాడులో అధికమన్నది చింతించవలసిన విష యం. యానిమేషన్ చిత్రం వివరాలను ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నటి అనుష్క మాట్లాడుతూ ఎయిడ్స్ వంటి పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను లఘు చిత్రాల ద్వారానే ప్రజలకు వివరించడం సాధ్యమన్నారు. టీచ్ ఎయిడ్స్ సంస్థ రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వారి వరకు సులభంగా అద్దమయ్యేలా ఉందన్నారు.
యువతను ఆకట్టుకునేలా విజ్ఞానంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేర్చి రూపొం దించారని తెలిపారు. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రం లో నటించడం సంతోషంగా ఉందని నటుడు సూర్య, శ్రుతిహాసన్, సిద్దార్థ్ ప్రకటన ద్వారా వ్యక్తం చేశారు. టీచ్ ఎయిడ్స్ సంస్థ 2011లో ఈ తర హా యానిమేషన్ చిత్రాన్ని తెలు గు, ఆంగ్ల భాషనల్లో రూపొందించింది. ఇందులో టాలీ వుడ్ నటుడు నాగార్జున, అనుష్క, శ్రుతి హాసన్, షెబ్నా ఆజ్మితో కలిసి నటించారు.
Advertisement