ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఆసరా పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఆసరా పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ మంజూరైన తర్వాత కూడా ఆంధ్రా బ్యాంక్ ఇచ్చే ప్రీపెయిడ్ కార్డుల కోసం వారంతా కనీసం నెలరోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇకపై జాప్యం జరగకుండా పెన్షన్ అందుకునేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ఏర్పాట్లు చేశారు. యాంటీ రిట్రోవియల్ ట్రీట్‌మెంట్ (ఏఆర్‌టీ) కేంద్రాల్లో వారి బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వివరాలను సమర్పిస్తే చాలని అధికారులు స్పష్టం చేశారు.