హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు | Prince Harry takes HIV test live on Facebook and he is negative | Sakshi
Sakshi News home page

హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు

Published Thu, Jul 14 2016 5:48 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు - Sakshi

హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు

లండన్: వేల్స్ యువరాజు హ్యారీ హెచ్ఐవీ పరీక్షలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా లండన్ లోని జెయింట్ థామస్ హాస్పిటల్కు వెళ్లారు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్నారు. అయితే టెస్ట్ చేయించుకున్న విషయాన్ని వీడియో తీయించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే యువరాజు ఎయిడ్స్ పై అవగాహనా కల్పించేందుకు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్న వీడియో వైరల్ అయింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం చాలా సులువుగా ఉంటుందని, ఈ విషయంపై అవగాహనా పెంచేందుకు తాను ఈ పని చేసినట్లు వేల్స్ యువరాజు హ్యారీ వెల్లడించారు.

వచ్చే బుధవారం డర్బన్ లో జరగనున్న అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో తాను పాల్గొనునున్నట్లు ట్వీట్ చేశారు. హెచ్ఐవీ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, ఆడా, మగా, వృద్దులు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ హెచ్ఐవీ టెస్ట్ చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ టెస్టులు చేయించుకోవడం చాలా సులువు అని ట్వీట్ చేశారు. హెచ్ఐవీపై పోరాడేందుకు ప్రిన్స్ హ్యారీ సరైన మార్గాన్ని ఎంచుకున్నారని టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ సీఈవో ఇయాన్ గ్రీన్ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement