
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి ఎన్నికైన తర్వాత అక్రమ వలస దారుల విషయంలో కఠినంగా ఉన్నారు. అమెరికాలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని కచ్చితంగా వెనక్కి పంపిస్తామనే సంకేతాలు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరంభంలోనే ఇచ్చారు ట్రంప్. అయితే అమెరికాలోనే ఉంటున్న బ్రిటన్ యువరాజు హ్యారీ విషయంలో ట్రంప్ ఆచితూచి అడుగులేస్తున్నారు. డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్‌హ్యారీ(Prince Harry)ని వెనక్కి పంపించాలని అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం నాటి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం హ్యారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు..
న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హ్యారీని వెనక్కి పంపే విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘ ప్రిన్స్ హ్యారీ విషయంలో నేను ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అతన్ని ఒంటరిగా వదిలేస్తున్నా. అతనికి ఇప్పటికే భార్యతో అనేక సమస్యలున్నాయి. అందుచేత హ్యారీపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు’ అని పేర్కొన్నారు.ఇప్పటికే హ్యారీకి సంబంధించిన అమెరికా వీసాపై అనేక న్యాయపరమైన చిక్కులున్నాయి. అమెరికా వీసా(USA VISA) ప్రొసెస్‌లో ఉండగా హ్యారీపై చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ వాడారనే ఆరోపణలు వచ్చాయి.
ఇదిలా ఉంచితే, 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయి. మేఘన్‌కు తాను అనుకున్నట్లు హ్యారీతో జీవితం లేదనే కారణంతోనే అతనికి ఆమె దూరంగా ఉంటున్నట్లు గతంలోనే కథనాలు వచ్చాయి. దీనికి తోడు హ్యారీ దంపతులు రాజ కుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయితే అక్కడ చోటు చేసుకున్న పలు పరిణామాలతో హ్యారీతో మేఘన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment