సాక్షి, హైదరాబాద్: అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) నగరంలో మళ్లీ పంజా విసురుతోంది. గత 15 ఏళ్లుగా తగ్గుతూ వచి్చన ఈ జబ్బు 2018 నుంచి క్రమంగా పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిడ్స్ కేసుల నమోదులో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా... కరీంనగర్, నల్లగొండ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018లో కొత్త కేసుల శాతం 1.93 ఉండగా.. 2019లో 1.98కి పెరగడం గమనార్హం. ఇదిలా ఉంటే 2019 జనవరి–అక్టోబర్ వరకు నగరంలోని 23 ఐపీటీసీ సెంటర్లలో మొత్తం 1,32,124 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా... 1,339 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే హెచ్‌ఐవీ పాజిటీవ్ బాధితుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
చారి్మనార్, గోల్కొండలో అధికం...
రాష్ట్ర వ్యాప్తంగా 83,102 మంది హెచ్‌ఐవీ పాజిటీవ్ బాధితులు ఉండగా... వీరిలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్లలో ప్రస్తుతం 23,350 మంది చికిత్స పొందుతున్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 21,350 మంది వరకు పెద్దలు ఉండగా... 1,234 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. జిల్లాలో చారి్మనార్, గోల్కొండ ఏరియాలో అత్యధికంగా హెచ్‌ఐవీ పాజిటీవ్ కేసులు నమోదవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, అడ్డా కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వలస వచ్చినవారు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వ్యాధి వ్యాప్తికి కారణాలివే...
- హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ (హెచ్‌ఐవీ) వైరస్ ఎయిడ్స్‌కు కారణం.
- అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్‌ఐవీ సోకుతుంది.
- గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు 5 శాతం అవకాశం ఉంది. ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం.
- కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది.
- ఒకరికి వాడిన సిరెంజ్‌లు, బ్లేడ్స్‌ను మరొకరికి వాడటం వల్ల వస్తుంది.
- నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కని్పస్తాయి.
- జ్ఞాపక శక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
– డాక్టర్ నిర్మలా ప్రభావతి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment