ఇబ్బందుల్లో ఐసీటీసీ ఉద్యోగులు, సిబ్బంది
చెన్నూర్ : సమీకత సమగ్ర హైచ్‌ఐవీ పరీక్ష కేంద్రం (ఐసీటీసీ), ఎయిడ్స్ వ్యాధి నిరోధక కేంద్రం (ఏఆర్టీ) సెం టర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. రాష్ట్రాలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ను విభజించక పోవడంతో రెండు రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోంది.
తెలంగాణలోని 10 జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతి పై సుమారు 1000 మందికి పైగా కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నిషియన్లు, ఏఆర్టీ సిబ్బంది పని చేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విభజన జరగక పోవడమే..
రాష్ట్రలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ శ్యాక్స్), తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ శ్యాక్స్) విడిపోలేదు. దీంతో జాతీయ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ మండలి (న్యాకో) ఢీల్లీ నుంచి వేతనాలు ఏపీ శ్యాక్స్ ఖాతాలో వేస్తున్నారని దీంతో వేతనాలు సకాలంలో రావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లోని ఏపీ శ్యాక్స్, టీఎస్ శ్యాక్స్‌లను విభజించకపోతే ఈ సమస్య తీవ్రమవుతుంది తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్రాలు వేరుపడ్డాక అన్ని శాఖలు వేరైన నేటికి ఐసీటీసీ, ఏఆర్టీ సెంటర్లను వేరు చేయకపోవడం పట్ల రెండు ప్రాంతాల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని సిబ్బంది కోరుతున్నారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
Published Fri, Feb 27 2015 3:54 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
Advertisement