‘సకల’ వేతనం ఇవ్వాలి
Published Fri, Jul 29 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
గోదావరిఖని : సకలజనుల సమ్మె కాలంలో సింగరేణిలో అత్యవసర విధులు నిర్వహించిన తమకు కూడా సమ్మెకాలపు వేతనాలు ఇప్పించాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి సిబ్బంది కోరారు. ఈమేరకు సిబ్బంది, ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలం వేతనాలు అత్యవసర సిబ్బంది అయిన ఏరియా ఆస్పత్రి, సవిల్ విభాగం, ఎస్‌అండ్‌పీసీ, అండర్‌గ్రౌండ్, పంప్ ఆపరేటర్, మైనింగ్ సర్దార్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా పాలకుల కుట్రలకు వత్తాసు పలుకుతున్న టీబీజీకేఎస్ సకల జనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందిని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. అత్యవసర సిబ్బందికి సమ్మె వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ.ఖయ్యూం, దార సుశీల, శేషారత్నం, రామలక్ష్మి, విజయలక్ష్మి, సింహాచలం, థెరీసా, చలం కుమారి, రామారావు, వెంకటయ్య, తోట ప్రభాకర్, పుట్టపాక రాజయ్య, ఎ.రాజశేఖర్, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, బి.సురేశ్, వి.తిరుపతి, డి.వేణు, బి.వేణుగోపాల్, కె.సతీశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement