Samme
-
సమ్మె కొనసాగిస్తున్న జేపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తమ నిరవధిక సమ్మెను కొనసాగించాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లు నిర్ణయించారు. గురువారానికి వారి సమ్మె 14వ రోజుకు చేరుకోనుంది. తెలంగాణ పంచాయత్ సెక్రటరీ ఫెడరేషన్ (టీఎస్పీఎఫ్) అధ్యక్ష బాధ్యతల నుంచి రాజేశ్వర్ రావు తప్పుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చి న జేపీఎస్‌లు సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక హామీ వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని తీర్మానించారు. శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ...’’మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే వెంటనే విధుల్లో చేరి మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. జేపీఎస్‌ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న ఫేక్ మేసేజ్‌లు నమ్మకండి. జిల్లా అధ్యక్షులు పంపించే మెసేజ్‌లనే ప్రామాణికంగా తీసుకోవాలి’ అని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం విధుల్లో చేరిన వారిలో పలువురు మళ్లీ సమ్మెలో చేరారని కార్యదర్శులు చెబుతున్నారు. నోటీసులిస్తే కోర్టులను ఆశ్రయించాలని... మంగళవారం సాయంత్రం 5లోగా విధుల్లో చేరకపోతే టెర్మినేట్ చేస్తామని పీఆర్‌శాఖ అల్టిమేటమ్ జారీచేసినా...ఈ శాఖ ఉన్నతాధికారులు కొంత సంయమనం పాటిస్తూ బుధవారం విధులకు హాజరుకాని వారికి నోటీసులు కూడా జారీచేయలేదని తెలుస్తోంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటీసులిచ్చి న పక్షంలో వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించాలనే అభిప్రాయంతో జేపీఎస్లున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు సైతం తీసుకున్నట్టు సమాచారం. -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్‌ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్‌కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
రేపు సార్వత్రిక సమ్మె
గాంధీనగర్ (కాకినాడ) : ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2న సమ్మె చేయనున్నట్టు రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఐదు డిమాండ్లు... వేతన సవరణ కోసం నియమించిన జి.ఓ 71 కమిటీ రిపోర్టు విడుదల చేసి వేతన సవరణ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 60 సంవత్సారాలు కొనసాగించాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం రూ.5 లక్షలు ఇవ్వాలనీ, డీసీసీబీ ఖాళీ పోస్టులలో 50 శాతం సంఘ ఉద్యోగులతో సినియారిటీ ప్రతిపాదికన భర్తీ చేయాలని, సహకార ఉద్యోగులకు ఆరోగ్య, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. -
సమ్మెను విజయవంతం చేయాలి
కోదాడఅర్బన్ : కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టియూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ౖ»ñ క్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ, ఇఫ్టూ డివిజన్ కార్యదర్శులు ఎస్.రాధాకష్ణ, బాదె రాము, నాయకులు ఎస్కె.లతీఫ్, కుక్కడపు ప్రసాద్, ముత్యాలు, రవి, మాధవరావు, సైదులు, రాఘవులు, శ్రీను, వి.నర్సింహారావు, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో సమ్మె మేఘాలు
సెప్టెంబర్ 2న విజయవంతం చేసేందుకు సంఘాల ప్రయత్నం గోదావరిఖని : సింగరేణిలో చాలా రోజుల తర్వాత ఒక రోజు సమ్మె జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు తోడు బొగ్గు పరిశ్రమలో ఎదరవుతున్న సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆగస్టు 8న జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలైన టీఎన్టీయూసీ, ఇప్టూలోని రెండు వర్గాల నాయకులు హైదరాబాద్‌లో సీఎండీకి సమ్మె నోటీస్‌ను అందజేశారు. కాగా సింగరేణిలో ప్రధాన సమస్యలైన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, 10వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి సత్వరమే ఒప్పందం పూర్తి చేయాలని, సింగరేణి లాభాలపై 30 శాతం స్పెషల్ ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. నిత్యావసర ధరలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను మార్చాలని, పెన్షన్ 40 శాతం పెంచాలని, గ్రాట్యూటీపై సీలింగ్‌ను ఎత్తివేయాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సింగరేణిలో ఐదు గనులలో బొగ్గును వెలికితీసేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించే గ్లోబల్ టెండర్లను రద్దు చేసి వాటిని సింగరేణి నిర్వహించాలని, 1997 నుండి 2001 వరకు వీఆర్ఎస్ తీసుకున్న వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సమ్మె డిమాండ్లలో పొందుపర్చారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, జేబీసీసీలో జరిగిన ఒప్పందం మేరకు హైపవర్ కమిటి వేతనాలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రత్యేక వీఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. సింగరేణిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న అత్యవసర సిబ్బందికి కూడా సమ్మె వేతనాలు చెల్లించాలని కూడా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గనులపై సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో గని కార్మికులు పాల్గొనాలని కోరేందుకు జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకెఎస్ కూడా సెప్టెంబర్ 2 సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె వల్ల సింగరేణిలో దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, ఈ విషయంలో కార్మిక సంఘాలు, కార్మికులు ఆలోచించాలని యాజమాన్యం కోరుతుండడం గమనార్హం. -
‘సకల’ వేతనాల చర్చలు నేటికి వాయిదా
ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సకల జనుల సమ్మె వేతనాల చెల్లింపులో లోపాలను సవరించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యంతో బుధవారం జరిగిన గుర్తింపు యూనియన్ నాయకుల చర్చలు గురువారానికి వాయిదా పడ్డాయి. సమ్మెకు ముందు రోజు గైర్హాజరైన కార్మికులకు జీతాలు చెల్లించాలని, సెప్టెంబర్ నెల మొదటి రోజు మస్టర్ ఉన్న వారిని పరిగణలోకి తీసుకోవాలని, అత్యవసర సిబ్బందికి సైతం ‘సకల’ వేతనాలు చెల్లించాలని నాయకులు కోరారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్(పా) పవిత్రన్‌కుమార్‌తో జరిపిన చర్చలు వాయి దా పడ్డాయని, గురువారం సీఎండీతో పూర్తి స్థాయి చర్చలు జరుగుతాయని గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. -
‘సకల’ వేతనం ఇవ్వాలి
గోదావరిఖని : సకలజనుల సమ్మె కాలంలో సింగరేణిలో అత్యవసర విధులు నిర్వహించిన తమకు కూడా సమ్మెకాలపు వేతనాలు ఇప్పించాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి సిబ్బంది కోరారు. ఈమేరకు సిబ్బంది, ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలం వేతనాలు అత్యవసర సిబ్బంది అయిన ఏరియా ఆస్పత్రి, సవిల్ విభాగం, ఎస్అండ్పీసీ, అండర్‌గ్రౌండ్, పంప్ ఆపరేటర్, మైనింగ్ సర్దార్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా పాలకుల కుట్రలకు వత్తాసు పలుకుతున్న టీబీజీకేఎస్ సకల జనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందిని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. అత్యవసర సిబ్బందికి సమ్మె వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ.ఖయ్యూం, దార సుశీల, శేషారత్నం, రామలక్ష్మి, విజయలక్ష్మి, సింహాచలం, థెరీసా, చలం కుమారి, రామారావు, వెంకటయ్య, తోట ప్రభాకర్, పుట్టపాక రాజయ్య, ఎ.రాజశేఖర్, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, బి.సురేశ్, వి.తిరుపతి, డి.వేణు, బి.వేణుగోపాల్, కె.సతీశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బ్యాంకుల బంద్
– 500 పైగా శాఖలు మూత – సమ్మెలో 10 వేల మంది ఉద్యోగులు – రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయే అవకాశం సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం బంద్ పాటిస్తున్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మినహా మిగతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. వీటిల్లో పనిచేసే క్లరికల్, ఆఫీసర్ కేడర్ ఉద్యోగులు 10 వేల మందికి పైగా సమ్మెలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా ఐదు బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం దీన్ని పట్టించుకోలేదు. దీంతో ఫోరం కింద ఉన్న 9 యూనియన్లు దేశవ్యాప్తంగా జులై 29న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపును అందుకున్న జిల్లాలోని ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకులతో పాటు అన్ని గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెకు సమాయత్తం అయ్యాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచి దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు నిర్ణయించారు. సుమారు 300 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ జరిగే సమ్మెలో పాల్గొననున్నారు. ఒకరోజు సమ్మె కారణంగా జిల్లాలో రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలని ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు జే ధన్వంత్‌కుమార్, ఆదినారాయణ, గిరి«కుమార్ తదితరులు కోరారు. -
జూడాల సమ్మె
ప్రభుత్వం వైద్య విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్పు మొత్తాన్ని పెంచాలని కొంతకాలం నుంచి జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని జీహెచ్, స్టాన్లీ, రాయపేట, కేఎంసీ ఆస్పత్రుల వద్దకు ఉదయం 8 గంటలకు చేరుకున్న విద్యార్థులు గేట్ల ముందు ధర్నాకు దిగారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఆందోళనలు చేశారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంంభించిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులను సీనియర్ వైద్యులు పరీక్షలు చేసిన పిదప వారి సూచనల ప్రకారం వైద్యం కొనసాగించే బాధ్యత జూనియర్ డాక్టర్లదే. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్ల సేవలు ఎంతో కీలకం. అకస్మాత్తుగా వేలాది మంది జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. స్టాఫ్ నర్సులే రోగుల బాధ్యతలను తీసుకోవలసి వచ్చింది. దీంతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. జూడాలు ఉంటున్న ప్రభుత్వ వసతి గృహాలను వెంటనే ఖాళీచేయాలని సైతం ఆదేశించింది. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని తాము ముందుగానే ఊహించినా తప్పలేదని చెన్నై ఆందోళనలకు నాయకత్వం వహించిన ఇలియా జానకిరామన్ అనే జూనియర్ డాక్టర్ సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. వైద్య కళాశాలల్లోని డిగ్రీ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం రూ.8,400, పీజీ విద్యార్దులకు రూ.17,400 చెల్లిస్తోందని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా తక్కువని ఆమె పేర్కొన్నారు. ఇదే డిమాండ్‌పై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా, అధికారులతో అప్పుడు జరిగిన చర్చలు విఫలమయ్యూయని ఆమె చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించనందున ఈనెల 17న ఒక్కరోజు సమ్మె పాటి ంచామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం తమ డిమాండ్‌పై స్పందించక పోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాలని ఆదివారం అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జూనియర్ డాక్టర్లకు (పీజీలకు) నెలకు ఢిల్లీలో రూ.71, 500, ఉత్తరప్రదేశ్‌లో రూ.55,370, కేరళలో 32 వేలు చెల్లిస్తుండగా తమిళనాడులో కేవలం రూ.17,400 చెల్లించడం అన్యాయమని ఆమె అంటున్నారు. డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆమె చెప్పారు. ఇక మంత్రులతో సైతం చర్చలకు తావులేదని, స్కాలర్ షిప్పులు పెంచాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. -
సిఎం మాటల మాయాజాలం
-
ఎస్మాను ప్రయోగించిన భయపడేది లేదు: అశోక్ బాబు
-
నేటి అర్ధరాత్రి నుంచి APNGOల సమ్మె
-
12 నుంచి సకలజనుల సమ్మె
రాష్ట్ర విభ జన ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే 12 అర్ధరాత్రి నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధం కావాలని ప్రజలకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి.వి.కృష్ణయాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని పెన్నానది వంతెనపై సోమవారం సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించారు.అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. కృష్ణయాదవ్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయని వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సీమాం ధ్రుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, అంజయ్య, అరవింద్, శ్రీను, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.