సాక్షి, హైదరాబాద్: తమ నిరవధిక సమ్మెను కొనసాగించాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లు నిర్ణయించారు. గురువారానికి వారి సమ్మె 14వ రోజుకు చేరుకోనుంది. తెలంగాణ పంచాయత్ సెక్రటరీ ఫెడరేషన్ (టీఎస్‌పీఎఫ్) అధ్యక్ష బాధ్యతల నుంచి రాజేశ్వర్ రావు తప్పుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చి న జేపీఎస్‌లు సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక హామీ వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని తీర్మానించారు. శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ...’’మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే వెంటనే విధుల్లో చేరి మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.
జేపీఎస్‌ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న ఫేక్ మేసేజ్‌లు నమ్మకండి. జిల్లా అధ్యక్షులు పంపించే మెసేజ్‌లనే ప్రామాణికంగా తీసుకోవాలి’ అని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం విధుల్లో చేరిన వారిలో పలువురు మళ్లీ సమ్మెలో చేరారని కార్యదర్శులు చెబుతున్నారు.
నోటీసులిస్తే కోర్టులను ఆశ్రయించాలని...
మంగళవారం సాయంత్రం 5లోగా విధుల్లో చేరకపోతే టెర్మినేట్ చేస్తామని పీఆర్‌శాఖ అల్టిమేటమ్ జారీచేసినా...ఈ శాఖ ఉన్నతాధికారులు కొంత సంయమనం పాటిస్తూ బుధవారం విధులకు హాజరుకాని వారికి నోటీసులు కూడా జారీచేయలేదని తెలుస్తోంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటీసులిచ్చి న పక్షంలో వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించాలనే అభిప్రాయంతో జేపీఎస్‌లున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు సైతం తీసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment