‘నో వర్కింగ్.. నో పే’
నిబంధనల మేరకు సిబ్బందికి వేతనాలు చెల్లించాలని గత నెల 104 వాహనాలపై జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ అధికారులకు సూచించారు. కానీ, ఆ దిశగా ముందుకు సాగడం లేదు.
ఎంజీఎం : గ్రామీణులను ఆపద కాలంలో ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన 104 వాహనాల పనితీరు అధ్వానంగా మారింది. మరమ్మతుకు నోచుకోక 16 క్లస్టర్ల పరిధిలో రోగులకు వైద్య సేవలు అందించడం లేదు. జిల్లాలో 20 వాహనాలు ఉండగా.. ఇందులో 11 పనిచేస్తున్నారుు. మిగతా తొమ్మిది మరమ్మతుకు నోచుకోక మూలనపడ్డారుు. వీటిపై పనిచేసే సిబ్బంది మాత్రం వేలాది రూపాయలు జీతం రూ పకంగా తీసుకుంటున్నారు. దీనికితోడు వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లో ఒకే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి 104 సిబ్బంది నిర్వహణ బాధ్యతలు అప్పగించడం కూడా పలు వివాదాలకు దారి తీస్తోంది.
పనిచేయని సిబ్బందికి వేతనాలు
జిల్లాలో 104 నిర్వహణకు సంబంధించి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 113 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో వాహనంలో ల్యాబ్‌టెక్నిషయన్, ఫార్మాసిస్టు, సెక్యూరిటీ, డ్రైవర్ డాటా ఆపరేటర్‌లు ఉంటారు. వీరిలో ల్యాబ్ టెక్నిషియన్‌కు రూ.10,900, ఫార్మాసిస్టుకు రూ.10,900, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.9,500, డ్రైవర్‌కు రూ.8,000, సెక్యూరిటీ గార్డుకు రూ.6,700 వేతనం ఉంది. అరుుతే జిల్లాలో 20 వాహనాలకు 21 మంది ఫార్మాసిస్టులు, 21 ల్యాబ్ టెక్నిషియన్లు, 16 డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 20 సెక్యూరిటీ గార్డులు, 20 మంది డ్రైవర్లు అవసరం ఉంటారు. అయితే 30 ల్యాబ్ టెక్నిషియన్లను, 25 ఫార్మాసిస్టులు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అదనపు సిబ్బంది యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నా అధికారులకు ఈ మాత్రం కానరావడం లేదు. ఏడాది కాలంగా జిల్లాలో 11 వాహనాలు అందుబాటులో ఉండగా.. 20 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లిస్తు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 104 వాహనాల పనితీరును మెరుగుపరుచాలని ప్రజలు వేడుకుంటున్నారు.
బడ్జెట్ లేమితో మరమ్మతుకు నోచుకోవడం లేదు..
- డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
104 వాహనాలకు బడ్జెట్ లేమితో మరమ్మతుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం వాహనాల టైర్లతోపాటు బ్యాటరీల మరమ్మతులకు రూ.14 లక్షలు మంజూరయ్యాయి. వాటితో కొన్ని వాహనాలు త్వరలో సేవలందిస్తాయి. అంతే కాకుండా అదనపు సిబ్బందిని డిప్యూటేషన్లపై కొనసాగిస్తున్నాం. కొన్ని వాహనాలకు డీజిల్ కొరతతో సేవలందించలేకపోతున్నాం.
104 ఆపదలో అంబులెన్స్‌లు
Published Fri, Apr 3 2015 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement
Advertisement