నిర్వహణలోపం.. సేవలకు శాపం
27 నుంచి మూతపడనున్న కేంద్రాలు
నిర్వాహకులకు కమీషన్లు చెల్లించకపోవడమే ప్రధాన కారణం
కోదాడఅర్బన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 27 నుంచి మీసేవలు నిలిచిపోనున్నాయి. మీసేవ, ఈ సేవ కేంద్రాలను హెచ్‌సీఎల్ కంపెనీ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కమీషన్ చెల్లించకపోవడంతో కేంద్రాలను మూసివేయాలని ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్వాహకులు నిర్ణయించారు. అంతేకాక కంపెనీ నిర్వహిస్తు న్న కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో వారు కూడా సేవలను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.
అందని వేతనాలు
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రభు త్వ సర్వీసులను అందించేందుకు గాను హెచ్‌సీఎల్ కంపెనీ 53 మీసేవ కేంద్రాల ను ఫ్రాంచైజీల ద్వారా ఏర్పాటు చేసింది. వీటికి తోడు నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడలలో హెచ్‌సీఎల్ కంపెనీ సొంతంగా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ సర్వీసులను అందజేస్తోం ది. మీసేవ కేంద్రాలలోనే గతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈసేవ సర్వీసులు కూ డా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల నిర్వహణకు గాను హెచ్‌సీఎ ల్ కంపెనీ ఫ్రాంచైజీ నిర్వాహకులకు వా రు అందించే సేవలను బట్టి కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే తమ సొం త కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూ డా హెచ్‌సీఎల్ కంపెనీ వేతనాలు చెల్లిం చాల్సి ఉంటుంది. కేంద్రాలు ప్రారంభిం చిన నాటి నుంచి ఫ్రాంచైజీలకు అంతంత మాత్రంగానే కమీషన్లు చెల్లించింది. ఇక ఎనిమిది నెలలుగా మాత్రం అసలు కమీషన్లు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు తమ కంపెనీ కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి కూడా నాలుగు నెల లుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాలను నిర్వహించలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఆర్టీఏ సేవలపై ప్రభావం
మున్సిపాలిటీలలో మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే దాని ప్రభావం ఆర్టీఏ సేవలపై ఎక్కువగా పడనుంది. ఆర్టీఏ సేవలను హెచ్‌సీఎల్ కంపెనీ పరిధిలోని కేంద్రాల్లో మాత్రమే లభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వాహనాల ట్యాక్స్‌లను మూడు నెలలకోసారి చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం ఈనెల 31వ తేదీలోపు మూడునెలల ట్యాక్స్‌ను వాహనదారులు చెల్సించాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత చెల్లించే పన్నులపై అధికంగా జరిమానా ఉంటుంది. ఈనెల 27 నుంచి మీసేవ, ఈ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే ట్యాక్స్ చెల్లించే వీలులేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
నిరవధిక బంద్‌కు నిర్ణయం
హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి కమీషన్లు సక్రమంగా రాకపోవడంతో ఫ్రాంచైజీల నిర్వాహకులు పలుమార్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల నల్లగొండలో సమావేశమైన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఈ నెల 27వ తేదీ నుంచి హెచ్‌సీఎల్ కంపెనీ కింద జిల్లాలో ఉన్న అన్ని ఫ్రాంఛైజీలను నిరవధికంగా బంద్ చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వారితో పాటు బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మీసేవ కేంద్రాలు మూతపడనున్నాయి.
మున్సిపాలిటీల్లో నిలిచిపోనున్న మీసేవ
Published Fri, Jul 25 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement