ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరిక
గజ్వేల్: వారంతా విషాదానికి ప్రతిరూపాలు. అనాథలు. ఎయిడ్స్ భూతం కబళించి మెదక్ జిల్లా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న 15 ఏళ్లలోపు వయసున్న 30 మంది చిన్నారుల కోరిక సీఎం కేసీఆర్‌ను కలవడం, మాట్లాడడం. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని గడా(గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు హామీ ఇచ్చారు. ఎయిడ్స్‌డే సందర్భంగా మంగళవారం ఇక్కడ ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్‌ను పారదోలాలని చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
కేసీఆర్ తాతయ్యను కలవాలె
Published Wed, Dec 3 2014 4:01 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
Advertisement
Advertisement