cultural programmes
-
నేటి నుంచి మగువలకు బతుకమ్మ కానుక
సాక్షి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి ఉమ్మడి వరంగల్‌లో రంగం సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ పండుగ పూట పేద వర్గాల మహిళలు నిరుత్సాహంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను అందజేయడం ద్వారా కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తోంది. చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’ ఈ నెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలై 13 వరకు జరగనున్నాయి. దీంతో అధికారులు ముందుగానే స్టాక్ తెప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మినహా, జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాల్లో చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు 13.45 లక్షల చీరలు... రూ.46.97 కోట్ల వ్యయం... దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు పై బడిన యువతులు, మహిళలు చీరలు పొందేందుకు అర్హులు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12.87 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, 13,45,015 మంది అర్హతగల వారిని గుర్తించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు 11.25 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 2,83,341, వరంగల్‌లో వరంగల్ 3,37,334, జనగామలో1,99,556, మహబూబాబాద్ 2,71,000, జేఎస్ భూపాలపల్లి1,43,000, ములుగులో 1,10,784 చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్రామస్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డుస్థాయి కమిటీల ద్వారా పంపిణీ చేయనుండగా అధికారులు పర్యవేక్షిస్తారు. ఉమ్మడి వరంగల్‌లో రూ.46,96,76,000 వ్యయంతో మొత్తం 13,45,015 చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆడపడుచులకు కేసీఆర్ కానుక.. బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ కానుకగా చీరలు అందజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉమ్మడి వరంగల్‌లో సుమారుగా 13.50 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే.. బతుకమ్మ ఆడడానికి వెళ్లే మహిళలు.. తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడం కోసం ఆకర్శణీయమైన రంగులతో రూపుదిద్దుకున్న ఈ చీరల పంపిణీ శనివారం ప్రారంభమవుతుంది. – ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి -
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ ..
నగరంలో నేడు జరిగే వివిధ కార్యక్రమాలు దేవేందర్ యాదవ్ మెమోరియల్ రన్ | వేదిక: నిజాం కాలేజీ గ్రౌండ్స్, బషీర్‌బాగ్ సమయం: ఉదయం 6 గంటలకు కర్నాటిక్ ఓకల్ బై సిద్ శ్రీరాం వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్ సమయం: సాయంత్రం 6 గంటలకు సపాక్ ప్లానింగ్ మీటింగ్ లమాకాన్, బంజారాహీల్స్ సమయం: సాయంత్రం 5 గంటలకు పండిత్ దీన్దయాల్ఉపాధ్యాయ–స్టేజీ ప్లే వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి సమయం: సాయంత్రం 5–30 గంటలకు ఆస్టిమ్ వర్క్‌షాప్ |వేదిక: డైరా సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 8 గంటలకు 22వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీడియాట్రిక్ ఇన్ఫెక్షనల్ డీసీజెస్ వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు సాటర్ డే స్పూకీ నైట్ విత్ డీజేస్ ఆల్బర్ట్ అండ్ లీనా వేదిక: లిక్విడ్స్ క్లబ్ఈటీసీ, బంజారాహీల్స్ సమయం: రాత్రి 8 గంటలకు అనేక్డోట్స్ –మెనీ స్టోరీస్ వేదిక: సప్తపర్ణి, బంజారాహీల్స్ సమయం: రాత్రి 7 గంటలకు ఆర్పీఎల్ క్రికెట్ లీగ్ వేదిక: క్రికెట్ రాక్స్, ఖాజాగూడ సమయం: ఉదయం 7 గంటలకు కాంటెపరరీ డ్యాన్స్ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, మారేడ్‌పల్లి సమయం: ఉదయం 11 గంటలకు యోగా ఫర్ కిడ్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు వేదిక: శిల్పారామం, మాదాపూర్ వయోలిన్ బై పణి బాల సమయం: సాయంత్రం 5.30 గంటలకు వేదిక: శిల్పారామం, మాదాపూర్ కూచిపూడి రికిటల్ బై మంజూల వశిష్ట అండ్ స్టూడెంట్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు సాటర్ డే నైట్ లైవ్ విత్ డీజేస్ జమైకా అండ్ అలెక్స్ వార్గీసీ వేదిక: ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ బార్, జూబ్లీహీల్స్ సమయం: రాత్రి 8 గంటలకు సాటర్ డే నైట్ లైవ్ విత్ జూజీ సందు వేదిక: స్టోన్ వాటర్స్ కిచెన్ అండ్ లాంజ్ , జూబ్లీహిల్స్ సమయం: రాత్రి 7–30 గంటలకు ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక: బుక్స్ ఎన్ మోర్ లైబ్రరీ అండ్ యాక్టివిటీ సెంటర్ , వెస్ట్ మారేడ్‌పల్లి సమయం: సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎఫ్‌సీ వర్సెస్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ వేదిక: జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం, గచ్చిబౌలి సమయం: రాత్రి 7–30 గంటలకు ద బ్యాంగ్ ది టూర్ వేదిక: ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్ సమయం: రాత్రి 7 గంటలకు ది ఇటాలియన్ ఎండ్ఈజ్ఓస్ వేదిక: రాడిసన్బ్లూప్లాజా, బంజారాహీల్స్ సమయం: రాత్రి 7 గంటలకు మిస్టర్స్ అర్భన్ ఇండియా 2019 అడీషన్స్2 వేదిక: మినర్వా కాఫీ షాప్, మాదాపూర్ సమయం: రాత్రి 8 గంటలకు. -
అద్భుతం..పేరిణీ నృత్యం
-
అలరించిన ‘కృష్ణం వందే జగద్గురం’
పుట్టపర్తి టౌన్ : పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ప్రకాశం జిల్లా సత్యసాయి భక్తులు రెండో రోజు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ చిన్నారులు 55 మంది ‘కృష్ణం వందే జగద్గురం’ నృత్యరూకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి చిన్ననాటి ఆటలు, ఆయన భక్త కోటికి చూపిన మహిమాన్విత ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. అనంతరం నృత్యరూపంలో పాత్రధారులైన చిన్నారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పర్తియాత్రలో దాదాపు 200 మంది సత్యసాయి విద్యావాహిని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అలరించిన సాంస్కృతిక సంబరాలు
అనంతపురం కల్చరల్ : నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు మరోసారి ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశారు. నాక్ బృందం సందర్శన సందర్భంగా సోమవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తూ సాగిన కళారూపాలతో విద్యార్థులు అలరించారు. శివతాండవం రూపకంపై యశ్వంత్ శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం రెండు గంటల పాటు కరతాళ ధ్వనుల నడుమ హృద్యంగా సాగింది. విశిష్ట అతిథులుగా విచ్చేసిన నాక్ బృంద సభ్యులు ఆచార్య సతీందర్ సింగ్, ఆచార్య సోంకావాడే, ప్రొఫెసర్ ఎడ్విన్ జ్ఞానదాసు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త లక్ష్మీనారాయణ, డ్యాన్స్ మాస్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు.చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరపింపజేశారు. విద్యార్థుల బ్యాస్బ్యాండ్ వాయిద్యంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. పిదప భరత నాట్య కచేరితో విద్యార్థులు ఆహూతులను ఆలరించారు. చక్కటి నృత్యభంగిమలతో,సుమధుర స్వరాల నడుమ విద్యార్థులు నాట్య కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది. -
రక్తి కట్టిన నాటకం
వేషం అదిరింది. నాటకం రక్తి కట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే నటించుమంటే వారంతా జీవించారు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించారు. ఔరా అనిపించారు. అందుకు ప్రశాంతినిలయం వేదికైంది. సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనం మూడో రోజు వేడుకల్లో భాగంగా అనంతపురం, ముద్దనహళ్లి క్యాంప్‌స్‌ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మనిషి వేసే ప్రతి అడుగులోనూ పొందే ప్రతి అనుభవమూ దైవస్వరూపమేనన్న సందేశాన్ని చక్కగా తమ నాటిక ద్వారా వివరించారు. దేవుడు ఇందులేడందుగలడన్న సందేహమే లేదని, మానవుని ప్రతి అనుభవంలో, పొందే ప్రతి ఫలితంలోనూ దేవుడు దాగి ఉన్నాడన్న సందేశాన్ని చక్కగా వివరించారు. దేవుని దర్శనం కోసం ఆలయాలకు వెళ్లడం కన్నా అభాగ్యుల సేవలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవడమే నిజమైన దర్శనమన్న సందేశంతో నాటికను ముగించడం అందరినీ ఆలోచింపజేసింది. విష్ణుభక్తుడైన భక్తప్రహల్లాదకు శివభక్తుడైన తన తండ్రి హిరణ్యకషిపుడుతో అపద ఎదురైనప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై రక్షించిన తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అపార భక్తిప్రపత్తులు కలిగిన నారాయణ అనే భక్తుడి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు తన లీలను ప్రదర్శించి పరిష్కరించిన తీరును వివరించిన విధం కట్టిపడేసింది. అంధుడైన రామదాసు అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళితే ఆత్మ స్వరూపుడుగా వెంకటేశ్వరుడు దర్శన భాగ్యం కల్పించిన తీరునూ అద్భుతంగా ప్రదర్శించారు. - పుట్టపర్తి టౌన్ -
సాంస్కృతిక క్రీడా సంబరం
- ఘనంగా సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం - సాహస విన్యాసాలు, సాంస్కృతిక క్రీడలతో అలరించిన విద్యార్థులు పుట్టపర్తి టౌన్ : సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభంబించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఒళ్లు గగూర్పొడిచే సాహసోపేత విన్యాసాలతో సత్యసాయి విద్యార్థులు ఆహుతులను అబ్బుర పరిచారు. సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. పుట్టపర్తి సత్యసాయి హిల్‌వీవ్ స్టేడియం వేదికగా జరిగిన సమ్మేళనాన్ని వేలాది మంది హాజఽరయ్యారు. ముందుగా సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి హిల్‌వీవ్ స్టేడియం శాంతివేదికపై ఏర్పాటు చేసిన సత్యసాయి ఆసనంపై ఉంచారు. అనంతరం మార్చ్ ఫాస్ట్ చేశారు. తర్వాత సత్యసాయి యునివర్శిటీ పతాకాన్ని వైస్ చాన్సలర్ కేబీఆర్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. మొదట అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు పురాణ వేదమంత్రాలను వళ్లిస్తూ యోగాసనాల ఆవశ్యకతను వివరించే 36 యోగా విన్యాసాలను ప్రదర్శించారు. తర్వాత జంపింగ్, లాంగ్‌జంప్, బైక్ రైడింగ్ విన్యాసాలు చేశారు. సిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ సైన్సెస్ వైట్‌ఫీల్డ్ విద్యార్థినిలు జానపద కళను, యోగా, ఏరోబిక్స్ విన్యాసాలను బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అత్యద్భుతంగా ప్రదర్శించారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన స్కైరన్నర్స్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన సమ్మేళన కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జె.రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, భగవత్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ‘సిద్ధార్థ’ ఫ్రెషర్స్ డే
చిన్న ఆవుటపల్లి(గన్నవరం రూరల్) : మండలంలోని చిన్న ఆవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. హాజÆ హనుమార గ్యాలరీలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిద్థార్థ అకాడమీ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్తమ వైద్యులుగా పనిచేయాలని సూచించారు. వైద్యుడి గొప్పదనాన్ని రోగులు మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేస్తారని అన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుంటూ, రోగులతో సేవాభావం, మంచి మాటలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్స్ నిరంతరం పెంచుకునే వైద్య రంగంలో దంత వైద్య విద్యార్థులుగా చేరిన బీడీఎస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామోజీరావు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ¯Œæవీ కృష్ణారావు, అకాడమీ ప్రతినిధి చక్రధరరావు, దంత వైద్య కళాశాల ఎవో వై.మధుసూదనరావు, మెడికల్ కళాశాల ఎవో కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
సందడే సందడి
-
నేడు, రేపు పవిత్ర సంగమం వద్ద దీపావళి
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర సంగమం ఘాట్ వద్ద శుక్ర, శనివారాల్లో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. భారీ నరకాసురుడి ప్రతిమను తయారుచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు. చివరిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ‘నరకాసుర వధ’ కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పర్యాటక శాఖ ఆధీనంలో జరుగుతున్నాయి. బాణ సంచా వెలుగుల్లో ఈ కార్యక్రమంగా ఘనంగా నిర్వహించనున్నారు. -
అలరించిన ‘భావన–2016’
-
భక్తి పారవశ్యం.. నాట్య సమ్మోహనం
విజయవాడ కల్చరల్ : డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహణలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభంలో సుసర్లనందిని వీణావాదన హృద్యంగా సాగింది. అన్నమయ్య, రామదాసు తదితర వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. సత్యనారాయణపురానికి చెందిన లలిత బృందంలోని చిన్నారులు 72 అడుగుల వినాయక విగ్రహం ముందు కోలాటం ప్రదర్శించారు. మహిళా భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా నాట్యాచార్యుడు ఘంటసాల పవన్‌కుమార్ బృందం పలు అంశాలకు నాట్యాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమాలను శింగంశెట్టి పెదబ్రహ్మం, చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు. ధర్మరక్షణే మన కర్తవ్యం ధర్మరక్షణే మన కర్తవ్యమని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి అనుగ్రహ భాషణ చేశారు. గురువారం సాయంత్రం 72 అడుగుల గణనాథుడిని సిద్ధేశ్వరానంద భారతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన భారతీయ సంప్రదాయాలను కాపాడుకోవాలని, నియమబద్ధమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు. తొలుత స్వామీజీకి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
బైబై గణేశా..!
-
నేడు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతపురం కల్చరల్ : విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పలు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు శాంతినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. లలితకళాపరిషత్తు వేదికగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలను రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆర్డీటీ కల్చరల్ విభాగం వారు రూపొందించారు. ఉదయం 10 గంటలకు సకల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద గీతాలాపన, 11 గంటలకు డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘పెన్నేటి మలుపులు’ నవలావిష్కరణ ఉంటాయి. మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు నవల గురించి ప్రసంగిస్తారు. అనంతరం ‘తెలుగు సాహిత్యం, సమాజం–దళిత బహుజన, గిరిజన, మైనార్టీల అస్థిత్వం’ అనే అంశంపై చర్చా వేదిక ఉంటుంది. ప్రముఖ రచయితలు లక్ష్మీనరసయ్య, బండి నారాయణస్వామి తదితరులు సమన్వయం చేస్తారు. సాయంత్రం రెండు రాష్ట్రాలకు చెందిన 120 మంది కళాకారులు, రచయితలు, కవులతో సమ్మేళనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు డాక్టర్ విజయభాస్కర్ రచించిన ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే సందేశాత్మక నాటకం ప్రదర్శిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీ, కళాభిమానులు విరివిగా విచ్చేయాలని శాంతినారాయణ కోరారు. -
కేసీఆర్ తాతయ్యను కలవాలె
ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరిక గజ్వేల్: వారంతా విషాదానికి ప్రతిరూపాలు. అనాథలు. ఎయిడ్స్ భూతం కబళించి మెదక్ జిల్లా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో చికిత్స పొందుతున్న 15 ఏళ్లలోపు వయసున్న 30 మంది చిన్నారుల కోరిక సీఎం కేసీఆర్‌ను కలవడం, మాట్లాడడం. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని గడా(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు హామీ ఇచ్చారు. ఎయిడ్స్‌డే సందర్భంగా మంగళవారం ఇక్కడ ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్‌ను పారదోలాలని చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
యుద్ధం వద్దు.. శాంతి ముద్దు