‘హలో.. నన్ను బయటికి తీయండి’ | Man Pranks Mourners At His Own Funeral In Ireland | Sakshi
Sakshi News home page

‘అమ్మ నవ్వుతూనే ఉండాలని అలా చేశారు’

Published Wed, Oct 16 2019 2:45 PM | Last Updated on Wed, Oct 16 2019 3:58 PM

Man Pranks Mourners At His Own Funeral In Ireland - Sakshi

డబ్లిన్‌ : ‘హలో.. హలో...? నన్ను బయటికి తీయండి. అక్కడ ఫాదర్‌ ఉన్నాడు కదా. నాకు అతడి మాటలు వినిపిస్తున్నాయి. నేను షే. పెట్టెలో ఉన్నాను’ అన్న మాటలు విని.... తమ ఇంటి పెద్ద శవాన్ని మట్టిలో పూడ్చేందుకు సిద్ధమవుతున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. శవ పేటిక నుంచి వస్తున్న మాటలు నిజం అయితే ఎంత బాగుండునో కదా అని భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయమేమిటంటే... ఐర్లాండ్‌కు చెందిన షే బ్రాడ్లే అనే వృద్ధుడు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించేవాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ.. వారిని సంతోషపెట్టేవాడు. కాగా మూడేళ్ల క్రితం అతడికి క్యాన్సర్‌ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో కాస్త డీలా పడ్డాడు. 

ఈ నేపథ్యంలో తన చావు గురించి ముందే తెలుసుకున్న షే.. మరణం తర్వాత కూడా కుటుంబ సభ్యులకు నవ్వించే వ్యక్తిగానే గుర్తుండిపోవాలని భావించాడు. ఇందుకోసం తన పెద్ద కొడుకు సహాయంతో ఏడాది కిందటే ఆడియో మెసేజ్‌ రికార్డు చేయించి.. తాను చనిపోయిన తర్వాత మట్టిలో పూడ్చేముందు దానిని ప్లే చేయాలని కోరాడు. ఈ క్రమంలో క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతూనే షే అక్టోబరు 8న మరణించాడు. దీంతో అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. షే చెప్పినట్లుగా అతడి మాటలను పెద్ద కొడుకు కుటుంబ సభ్యులకు వినిపించాడు. ఈ విషయాన్ని షే కూతురు ఆండ్రియా ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ మా నాన్న లెజెండ్‌.. షే బ్రాడ్లే. అంత్యక్రియలకు ముందు మమ్మల్ని నవ్వించాలనేది తన చివరి కోరిక. ఆయన చాలా గొప్పవాడు. ఆయన లేరన్న బాధతో మేము విషణ్ణ వదనాలతో ఉండకూడదని ఇలా చేశారు’ అని తన తండ్రి ఫొటోను షేర్‌ చేశారు. తమ తల్లి ఎప్పటికీ నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతో నాన్న ప్రాంక్‌ మెసేజ్‌ చేశారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement