- ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణకు సన్మానం
18న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం
Published Wed, Sep 7 2016 10:00 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
కరీంనగర్: మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ఆహ్వాన కమిటీ కన్వీనర్లు గుగ్గిళ్లపు రమేశ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బొమ్మకల్‌లోని మున్నూరుకాపు హాస్టల్ ఆవరణలో ఉదయం పదిగంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను సన్మానిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం నాలుగుగంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సంఘం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్ హాజరువుతారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement