RTC chairman
-
ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా పదవీకాలం ముగియటంతో ఆ పదవి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తప్పుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఆర్టీసీ వర్గాలు భావించాయి. కానీ, పదవీకాలం ముగిసినా ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు వెలువడలేదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఆశాభంగం కలిగిన సిట్టింగ్‌లను బుజ్జగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లాంటి వాటిని వారికి అప్పగించవచ్చని, అందుకే బాజిరెడ్డికి కొనసాగింపు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇక్కడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బాజిరెడ్డికి వీడ్కోలు సమావేశం జరిగింది. బాజిరెడ్డి దంపతులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రెండేళ్ల పదవీకాలంలో, ఆర్టీసీ అభ్యున్నతికి బాజిరెడ్డి ఎంతో కృషి చేశారంటూ అధికారులు కితాబిచ్చారు. ‘‘రెండేళ్లపాటు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేయటం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని బాగు చేసేందుకు ఎండీ సజ్జనార్‌తో కలిసి కృషి చేయడం జీవితంలో మరవలేను. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం నాకు ఎంతో సంతోషం కలిగించింది’’అని బాజిరెడ్డి పేర్కొన్నారు. -
డిసెంబర్ 6న వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
TSRTC: లాభాల్లోకి రాకుంటే ప్రై‘వేటే’
సాక్షి, హైదరాబాద్: ‘మరో మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకుంటే ప్రైవేట్‌పరం చేస్తాం, తర్వాత మీ ఇష్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించినా పరిస్థితిలో మార్పు చూపకపోవటం ఏంటంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..’ అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతా కలిసి గట్టెక్కించాలి ‘రాష్ట్రంలో 97 డిపోలుంటే అన్నీ నష్టాల్లో ఉన్నాయంటే అధికారుల పనితీరులో ఎక్కడో లోపం ఉందని స్పష్టమవుతోంది. పరిస్థితి మారకుంటే ప్రభుత్వం ఎంతకాలం నిధులు కేటాయిస్తూ పోతుందనేది సీఎం ఆవేదన. అందుకే ఉన్నతాధికారులు మొదలు డిపో మేనేజర్ వరకు అందరి పనితీరు మారాల్సి ఉంది. సంస్థను గట్టెక్కించే విధంగా వ్యవహరించాలి. అందుకే డిపో స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించాం. మరో రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తాం. నేనో వైపు, ఎండీ సజ్జనార్ మరోవైపు పర్యటనలు జరిపి లోపాలు గుర్తించి దిద్దుబాటుకు దిగుతాం. ఒక బస్సు రోజుకు ఇన్ని కి.మీ.లు తిరగాలి అని గతంలో నిర్ధారించారు. దాన్ని గుడ్డిగా పాటిస్తున్న అధికారులు ప్రయాణికులు లేకున్నా తిప్పుతున్నారు. ఇది ఎంత దుబారాకు దారి తీస్తుంది. అలాగే ఒకే డిపోలో ఒకే ప్రాంతానికి ఒకే సారి రెండుమూడు బస్సులు బయలుదేరుతున్నాయి. దీనివల్ల ఏ బస్సులోనూ సరైన ఆక్యుపెన్సీ ఉండటం లేదు. ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దాల్సి ఉంది. రెండు మూడు నెలల్లోనే సంస్థను లాభాల్లోకి తేవాలి. లేకుంటే ఆర్టీసీని ప్రభుత్వం భరించడం కష్టం అనేది సీఎం ఉద్దేశం..’ అని బాజిరెడ్డి తెలిపారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్ కొత్తగా భర్తీ లేదు .. బస్సుల్లేవు ‘ఆర్టీసీలో ఇప్పట్లో ఇక కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదని, కొత్త బస్సులు కొనబోమని, కొత్త నిర్మాణాలు చేపట్టబోమని కూడా సీఎం చెప్పారు. అందువల్ల ఉన్న బస్సులనే ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటాం. మరీ అవసరమైతేనే కొత్త బస్సుల కోసం ఆలోచిస్తాం..’ అని చెప్పారు. సీఎం ఆగ్రహంపై చర్చ రెండేళ్ల కిందట కార్మిక సంఘాలు ఉధృతంగా సమ్మె నిర్వహించిన సమయంలోనూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం హెచ్చరించారు. ఆ సమయంలోనే ఆర్టీసీ ఏకంగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్య 3,100కు చేరింది. తాజాగా అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించటం సంస్థలో తీవ్ర చర్చకు దారి తీసింది. -
TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్
సాక్షి, నిజామాబాద్ : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండడంతో అవకాశం రాలేదు. చిరకాల వాంఛ నెరవేరకపోfడ బాజిరెడ్డికి నిరాశ కలిగించే అంశమే.. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నాయకుడిగా ఉన్న బాజిరెడ్డి ఆది నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉంటూ వచ్చారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ 2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. మళ్లీ తాజాగా ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఈ పదవిలో నియమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. చదవండి: NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3 -
కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదే..
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్న సమయంలో కరోనా కట్టడికి అలుపెరగని కృషి చేశారన్నారు. బీసీ నాయకుడిగా ఈటల ఆరుసార్లు గెలిచారంటే ప్రజాధరణ ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ ఓటర్లు నైతికవంతులని, అనూహ్యరీతిలో ఇంటలిజెన్స్‌కి అంతుపట్టకుండా ఉపఎన్నికల్లో తీర్పునిస్తారన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదేనని అన్నారు. -
కేసీఆర్ మాట తప్పారు: నాయిని
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే మంత్రి ఈటల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు తమ మనసులోని అసంతృప్తిని బహిరంగ వేదికల మీద వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి చేరారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్, వద్దు కౌన్సిల్లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మా ఇంటికి పెద్ద.. మేమంతా ఓనర్లమే అని స్పష్టం చేశారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమన్నారు నాయిని. -
అమ్మో.. ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్ అన్న ప్రచారం ఉంటే.. నాయకులెవరూ పద విలో ఉన్నంతకాలం అటువైపు కన్నెత్తి చూడరు. అలాగే.. ఫలానా పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. అన్న ప్రచారం సాగితే.. దాన్ని చేపట్టేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తారు. అవే స్పీకర్, ఆర్టీసీ చైర్మన్, పీఏసీ చైర్మన్ పదవులు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకులంతా వీటిని చేపట్టాలంటే వెను కడుగు వేస్తారు. ఈ పదవులు చేపట్టాక రాజకీయంగా ఒడిదుడుకులు తప్పవన్న సంప్రదాయం చాలా ఏళ్లుగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్టీసీలో అడుగుపెడితే అంతేనా ఆర్టీసీ చైర్మన్ పదవి చేపట్టినవారూ రాజకీయంగా ఇబ్బందులు పడతారన్న ప్రచారం ఉంది. గతంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన గోనె ప్రకాశ్‌రావుకు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రభ తగ్గింది. క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే పదవిని చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణ చైర్మన్‌గా తప్పుకొన్నాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లట్లేదు. ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆర్టీసీ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఏసీ చైర్మన్.. తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవులు చేపట్టినవారికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ పదవిని కాంగ్రెస్‌కే చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టారు. 2016 మార్చిలో ఆయన కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అంతా ఆలోచించారు. ఆఖరికి ఆ పదవిని మరో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఆమె కూడా ఓటమి చవిచూశారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి వల్లే గీతారెడ్డి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. కొనసాగిన స్పీకర్ సెంటిమెంట్ స్పీకర్ పదవిపైనా పలువురు గులాబీ నేతలు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవి చేపడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంటు చాలా ఏళ్లుగా ఉంది. గత స్పీకర్ మధు సూదనాచారి ఓటమితో అది మరోసారి పునరావృతమైంది. గతంలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. దీంతో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించినా వారు కూడా రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. -
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా : ఎమ్మెల్యే
సాక్షి, పెద్దపల్లి : ‘పార్టీలో ఉంటూ ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా’ అని అధిష్టానానికి చెప్పినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో ఇష్టం లేనివారు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని.. ఇక నుంచి ఎవరైనా జోక్యం చేసుకున్నా.. తప్పులు చేసినా ఊరుకోనన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొగులుతానని తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఇబ్బంది కల్గించిందని, ఇది రాజకీయాల్లో కూడా సంచలనం కలిగిందని సోమారపు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో పార్టీలో క్రమశిక్షణ లేదని అధిష్టానానికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రులతో పాటు పక్కనున్న ఎమ్మెల్యేలు సైతం జోక్యం చేసుకుంటారని, ఇది తగదని చెప్పినట్లు వెల్లడించారు. -
వర్ల రామయ్య చాంబర్లో కుర్చీ 40 వేలు..
ఆయన ఓ సంస్థకు చైర్మన్. ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అప్పటికే సంస్థ అప్పుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా సంస్థ ఆర్థికాభ్యున్నతికి చర్యలు తీసుకుంటారు. ఆయన మాత్రం అందుకు భిన్నంగా హంగు, ఆర్భాటం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు. ప్రమాణ స్వీకారం పేరుతో ఆర్టీసీ నిధులు భారీగానే ఖర్చు చేశారు. ఇవి చాలవన్నట్లుగా తన చాంబర్ ఆధునికీకరణ, ప్రత్యేక కుర్చీ, విలాసవంతమైన కార్లు తదితరాల వాటి కోసం మరిన్ని నిధులు వ్యయం చేశారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా చైర్మన్ వ్యవహారం ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన తీరును విమర్శిస్తున్నారు. సాక్షి,అమరావతిబ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి తరువాత తన రాజకీయ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూసిన వర్ల రామయ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. ఆయనతో పాటు మరో నలుగురికి నాలుగు జోన్ల చైర్మన్లగా అవకాశం కల్పించారు. నాలుగేళ్ల పాటు అధికారుల పాలనలో ఆర్టీసీ ఆదాయం పెంచుకునేలా కృషిచేస్తున్న నేపథ్యంలో పాలకవర్గం పేరుతో ప్రభుత్వం ఆర్టీసీపై అదనపు భారం మోపింది. ఇప్పటికే దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులతో నెట్టుకువస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం కనీస చేయూత కూడా ఇవ్వలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు చిల్లర వేస్తూ డీజిల్‌పై రాయితీ కూ డా ఇవ్వని దుస్థితిలో ఉంది. ఈ క్రమంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పాలకవర్గం తమ విలాసాల కోసం ఆర్టీసీ నిధులను నీళ్లలా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలాసాల కోసం.. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం కోసం ఆర్భాటం చేశారు. సుమారు 2 వేల మందిని జనసమీకరణ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు. దాంతో పాటు తన చాంబర్‌ను ప్రత్యేకంగా ఆధునికీకరించారు. చాంబర్ ఆధునికీకరణ, ప్రమాణస్వీకారం కోసం, చైర్మన్ కూర్చునేందుకు ప్రత్యేక కుర్చీ తదితరాల కోసం రూ. కోటి వరకు ఖర్చు చేశారు. అలాగే వర్ల హోదా, డాబు కోసం తనతో పాటు తన కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.70 లక్షల విలువ చేసే రెండు ఖరీదైన గేర్‌లెస్ ఇన్నోవా, ఫార్చూనర్ కార్లు కొనుగోలు చేశారు. దాంతో పాటు ఎస్కార్ట్ కోసం మరో వాహనంకొనుగోలు చేశారు. కేవలం కార్ల కొనుగోలు కోసమే కోటి రూపాయలు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంటి పనులకోసం ఆర్టీసీ ఉద్యోగులు? ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తన సొంత అవసరాల కోసం ఆరుగురు ఉద్యోగులను ఉపయోగించు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న చైర్మన్‌కు అధికారికంగా సీనియర్ స్కేల్ అధికారితో పాటు స్టెనో, ఇద్దరు అటెండర్లు, గన్‌మెన్‌తోపాటు నలుగురు సెక్యూరిటీ విభాగం, నలుగురు డ్రైవర్లు ఉంటారు. అనధికారికంగా మరో ఆరుగురిని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధిగా.. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మాత్రం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి వనరులుగా మార్చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆర్టీసీకి ఆర్థిక భారంగా మారిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం నలుగురు నేతలకు ఉపాధి కోసం తిరిగి జోనల్ చైర్మన్ల వ్యవస్థ పునద్ధరించింది. వారికి చాంబర్లు, ఆర్భాటపు ఖర్చుల కోసం మరో రూ.2 కోట్ల వరకు కేటాయించాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన నేతలు కూడా ఇంత ఆర్భాటపు ఖర్చులు చేయలేదని కార్మిక నేతలు చెబుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రస్తుత ఆర్భాటం కోసం ఖర్చు చేసిన నిధులతో నాలుగు తెలుగు వెలుగు, ఒక వోల్వా బస్సు కొనుగోలు చేయవచ్చని పలువురు కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి నెలన్నర కావస్తున్నా సంస్థ పురోభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. -
ఎన్టీపీసీలో ఇంజినీర్స్ డే
జ్యోతినగర్: దేశాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్ ఉద్యోగ వికాస కేంద్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) చాప్టర్ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన 49వ ఇంజినీర్స్ డే వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రోజురోజుకూ మారుతున్న ప్రపంచ పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇంజనీర్స్‌డే ప్రతిజ్ఞ అనంతరం బ్రోచర్ విడుదల చేశారు. ‘యువ ఇంజనీర్ల నైపుణ్యం, పరిశ్రమల్లో సంస్కరణలు’ అంశంపై ఈఎస్సీఐ డైరెక్టర్ డి.ఎన్.రెడ్డి‡Sవిద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వ్యాసరచన పోటీలలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించిన కరీంనగర్ వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆమనికి బహుమతి అందించారు. అనంతరం సోమారపు సత్యనారాయణను పూలమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర, ఆర్జీ–3 జీఎం డాక్టర్. ఎం.ఎస్.వెంకట్రామయ్య, రామగుండం జీఎం దాస్‌గుప్తా, చంద్రశేఖర్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
18న మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం
ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణకు సన్మానం కరీంనగర్: మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ఆహ్వాన కమిటీ కన్వీనర్లు గుగ్గిళ్లపు రమేశ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బొమ్మకల్‌లోని మున్నూరుకాపు హాస్టల్ ఆవరణలో ఉదయం పదిగంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను సన్మానిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం నాలుగుగంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సంఘం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్ హాజరువుతారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. -
ఆర్టీసీని ఎలా బాగుచేద్దాం!
♦ పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయిద్దాం ♦ రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్లకు సీఎం ఫోన్ సాక్షి, హైదరాబాద్:ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అస్తవ్యస్తంగా తయారైన రోడ్డు రవాణా సంస్థపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. జేఎండీ నుంచి డిపో మేనేజర్ స్థాయి వరకు సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి గల కారణాలను డిపోల వారీగా తనకు ముందస్తుగా లెక్కలు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. డిపోల్లోని బస్సుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. అయితే వచ్చే సోమవారం సమావేశం ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇలాగే చెప్పి... గతేడాది వేతన సవరణ జరిగి 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన రోజున స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ నష్టాల నివారణపై ఓ రోజు మొత్తం సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. చండీ యాగానికి నెల ముందు మరోసారి సమీక్షవిషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయటంలో వారు అన్నీ సిద్ధం చేశారు. కానీ సీఎం ఇప్పటి వరకు సమీక్ష తేదీ ప్రకటించలేదు. సమీక్ష సంగతి దేవుడెరుగు కనీసం ఆర్టీసీని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాలను మూటగట్టుకుంది. సిబ్బంది జీతాలకు కూడా డబ్బులు లేక దివాళా దిశగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉంటుందని సీఎం ప్రకటించటంతో.. ఈసారైనా ఆర్టీసీని ‘బాగు’ చేయడానికి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరాయి. -
సిటీ బస్సులు..మూణ్నాళ్ల ముచ్చటేనా?
- రద్దయిన బస్సు సేవలు - పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్ రామడుగు, న్యూస్‌లైన్: కరీంనగర్ పట్టణానికి సమీప గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రవేశపెట్టిన సిటీ బస్సులు మూ ణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. గత నవంబర్‌లో అప్పటి ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు ప్రారంభించా రు. వీటిని కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కరీంనగర్ నుంచి కొత్తపలి, వెదిర గ్రామాలకు, మానకొండూర్ నుంచి పద్మనగర్ వరకు సర్వీసులను ప్రారంభించారు. గత ఏప్రిల్ చివరి వరకే బస్సులు నడిచాయి. ప్రస్తుతం ఈ సిటీ బస్సుల జాడ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎమ్మెస్సార్ స్వగ్రామం వెదిర వరకు సిటీబస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు నవంబర్ 12 నుంచి సిటీ బస్సులను పొడిగిం చారు. వీటితో ఈ రూట్లోని గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రద్దు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు కరీంనగర్ వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు. కనిపించని ఆర్డినరీ బస్సులు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి గుండా ఆర్డినరీ బస్సులు ఆధికారులు అంతంత మాత్రంగానే నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిపై గుండా కేవలం మూడు ఆర్డినరీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నా రు.బస్సులు లేకపోవడంతో ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నామని వెదిరకు చెందిన సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన సిటీ బస్సులను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వెదిర, దేశరాజ్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.